DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నలభై ఏళ్ల అనుభవం తో నలభై తరాలు నట్టేట ముంచాడు 

కురుపాం లో కళ్యాణ్ సేన కవాతు 
విజయనగరం జిల్లా పర్యటనలో విజృంభించిన జన సేనాని 

విజయనగరం, మే 31, 2018 ( DNS Online) : నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని ప్రతీ సభలోనూ

ప్రగల్బాలు పలికే చంద్రబాబు నాయుడు తన స్వార్థం తో నలభై తరాల ఆంధ్రుల జీవితాలు నట్టేట ముంచాడని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన

లో ఉన్న అయన గురువారం విజయనగరం జిల్లా కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి పట్టణాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా అయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,

ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితం లో చేసిన తప్పులతో ఎంతమంది జీవితాలు బుగ్గి పాలయ్యాయో ఉదాహారణలతో వివరించారు. తనకు పిల్లనిచ్చిన మామ కె

వెన్నుపోటు పొడిచి, అయన స్థాపించిన తెలుగుదేశం పార్టీతో పాటు, ఆస్తులు కూడా దోచుకుని, అయన మరణానికి కారణమయ్యాడన్నారు. మద్యపానం నిషేధం ఎత్తివేసి, కొన్ని వందల

కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకుండా చేశాడన్నారు. విభజన సమయం లో రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి, భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నాడని, తద్వారా ఆంధ్రాకు తీరని

ద్రోహం చేశాడన్నారు. ఇతను తానా అంటే తందానా అనేందుకు మాత్రం పని చేసే వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారన్నారు. 

నవ నిర్మాణ దీక్షల కోసం వేసే పందిళ్ళకి రూ.13

కోట్లు నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి గిరిజన ప్రాంతాల్లో వంతెనలకి డబ్బులు ఇవ్వపోవడాన్ని తప్పుబట్టారు. గిరిజనుల్ని ఓట్లుగా చూస్తూ వారి అభివృద్ధిని పాలకులు

విస్మరిస్తున్నారని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మాట మారుస్తూ ప్రజల్ని పదేపదే మోసం చేస్తున్నారని

స్పష్టం చేశారు. 

జనసేన పోరాట యాత్రలో భాగంగా కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి నియోజక వర్గ కేంద్రాల్లో జన సైనికులతో కలసి కవాతు నిర్వహించారు. ఆయా

కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ “చెప్పిన మాట మీద నిలబడకుండా పదేపదే మాటలు మార్చేవాళ్లు వద్దు. ఒకటే మాట ఒకటే బాణం అనే నాయకులు కావాలి.

అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్ళేందుకు మరో అవకాశం కావాలని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. 2014లో మీకు పవన్ కల్యాణ్, జన సైనికులు అండగా ఉన్నారు. 2019లో మీకు ఎవరు ఉంటారు.

ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లో 50 శాతం ఒకే కంపెనీకి ఇచ్చారు. శిలాఫలకం తప్ప ఇండస్ట్రి రాలేదు. ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం వలసలు

పోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మీకు ఓట్లు వేయాలి. బొబ్బిలిలో జూట్ మిల్లులు మూసేశారు. అయినా టిడిపి, వైసిపిలు మాట్లాడకపోయినా జనసేన గళం విప్పుతుంది. ఈ

ప్రభుత్వానికి గిరిజన ప్రాంతాలు అన్నా, ఉత్తరాంధ్ర అన్నా చిన్న చూపు. కనీస అవసరాలు కూడా తీర్చారు. విద్య, వైద్యం అడుగుతున్నా వాటిని కూడా తీర్చరు. ఇప్పటికీ కనీస

రోడ్డు వసతి లేదు. కురుపాం దగ్గర పూర్ణపాడు వంతెన కట్టేందుకు రూ.10 కోట్లు నిధులు లేవు. ముఖ్యమంత్రి కుటుంబం హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉంటే రూ.150

కోట్లు ప్రభుత్వం బిల్లు కట్టిందట. అంగన్వాడీ టీచర్లకి జీతాలు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఉండవు. బొబ్బిలిలో జూట్ మిల్ కార్మికుల పెన్షన్

ఇప్పించలేకపోతున్నారు... మిల్ యజమాన్యంతో మాట్లాడి. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో మరి. పార్వతీపురం మునిసిపాలిటీలో రోడ్లు సరిగా లేవు. రంగు మారిన నీళ్ళు

తాగేందుకు సరఫరా చేస్తున్నారు. కనీస బాధ్యత లేదా? పెదపెంకి గ్రామంలో బోదకాలు వ్యాధితో జనం బాధలుపడుతున్నా ఇక్కడి ప్రజా ప్రతినిధులకి పట్టడం లేదు. కురుపాం

ప్రాంతంలో ఇప్పటికీ గిరిజనులు వైద్యం కోసం కిలో మీటర్ల కొద్దీ నడచి రావాల్సి వస్తోంది. ఆసుపత్రుల్లో వైద్య, పారా మెడికల్ సిబ్బంది ఉండటం లేదు. ట్రైబల్

డెవలప్మెంట్ అథారిటీని నిర్వీర్యం చేసేశారు. సింగపూర్ తరహా కట్టడాలు, అభివృద్ధి అనే ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రలో గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాల గురించి ముందు

ఆలోచించాలి. కౌమార దశకి వచ్చిన ఆడపిల్ల ఆరోగ్య సంరక్షణ, నెలసరి అవసరాలకి నేస్తం పేరుతో ఇచ్చే కిట్ విషయంలోనూ పాలకులు కక్కుర్తి పడుతున్నారు. కాంట్రాక్టర్ ని

ఫైనలైజ్ చేయకుండా డబ్బుల కోసం చూస్తున్నారు. ఇలాగేనా ఆడబిడ్డల రక్షణ చూసేది. రెండు కుటుంబాలు, రెండు పార్టీలు ఉంటే పంచుకొంటూ ఉంటారు. అడిగేవాళ్ళు వుండరు. జనసేన

ఎవరు అన్యాయం చేసినా నిలదీసి ప్రశ్నిస్తుంది. మూడో ప్రయమ్నాయంగా వుంటుంది. జంఝావతి, తోటపల్లి ప్రొజెక్ట్స్ పూర్తి చేయరు. వాళ్ళకి కృష్ణా, గుంటూరు వైపు పనులే

కావాలి. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమేనా. విజయనగరం జిల్లాలోని రైతులకి అవసరమైన తాగు నీరు ఇచ్చే ప్రొజెక్ట్స్ పూర్తి చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర

అంటే చిన్న చూపు. ఇలాగే పాలన సాగిస్తే కళింగాంధ్ర ఉద్యమం వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర మేధావులు అన్నీ లెక్కలూ తీస్తున్నారు. ఇలాంటి ఉద్యమ సూచనలు

కనిపిస్తున్నాయి. జన సైనికులకి చెప్పేది ఒక్కటే... ప్రతి గిరిజన గ్రామానికీ వెళ్ళండి... అక్కడి సమస్యలు గుర్తించండి. వాటిపై మన జనసేన బలంగా పోరాటం చేస్తుంది.

గిరిజనులకీ, ఆడపడుచులకీ, దివ్యాంగులకీ, ఉత్తరాంధ్ర ప్రజలకీ జనసేన ఎప్పుడూ à°…à°‚à°¡à°—à°¾ నిలిస్తుంది” అన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam