DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖజానా శాఖ ఆధ్వర్యంలో 69, 99,101  జిఓ లపై అవగాహన

మీడియా బిల్లులు ఐ అండ్ పిఆర్ నుంచే విడుదల :

ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రభుత్వం విడుదల చేసిన 69, 99,101  à°œà°¿à°“ లపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు ఖజానా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

నిర్వహించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా సహాయ ఖజానా అధికారులు

సావిత్రి, తవిటయ్య, ఉప ఖజానా అధికారులు ఎస్.భాస్కర రావు, భాగ్యలక్ష్మి ఆర్ధిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై అంశాలను వివరించారు

వ్యయాలకు ప్రభుత్వం సరికొత్త

విధి విధానాలను రూపొందించిందని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కార్యాలయాల్లో చేసే వ్యయాలు ఏ పద్దుల క్రింద నమోదు చేయాలి అనే అంశాలను వివరించారు. ప్రతీ అంశానికి

బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఉండాల్సిందేనని, బిల్లుల చెల్లింపులో డిడిఓలు విధివిధానాలు స్పష్టంగా పాటించాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే డిడిఓలు బాధ్యులు

అవుతారని, జీతాలు, వేతనాలు చెల్లింపుకు పోస్టులు మంజూరు ఉండాలని తెలిపారు.  
మంజూరైన పోస్టుల జాబితా ఖజానాకు సమర్పించాల్సియుందన్నారు. పోస్టు మంజూరు కాకపోతే

బడ్జెట్ ప్రత్యేకంగా విడుదల కావాలని, ప్రతీ అంశానికి à°’à°• హెడ్ ఆఫ్ అకౌంట్ ఉందని, à°† హెడ్ ఆఫ్ అకౌంట్ లో మాత్రమే మంజూరు చేయాలని తెలియచేసారు. 

మీడియా బిల్లులు ఐ

అండ్ పిఆర్ నుంచే విడుదల :

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో గాని ఔట్ డోర్ పబ్లిసిటీ గాని సమాచార పౌర సంబంధాల శాఖ ( ఐ అండ్ పిఆర్ ) ద్వారా మాత్రమే విడుదల చేయాలి.

శాఖలు నేరుగా విడుదల చేయరాదు. అటువంటి బిల్లులు మంజూరుకు అవకాశం లేదని. ప్రభుత్వ ఉత్తర్వులు 69, 99, 101 నిబంధనలు విధిగా పాటించాలని తెలిపారు.  à°¬à°¿à°Žà°¸à±à°Žà°¨à±à°Žà°²à±  à°¸à°¿à°—్నల్

అందుబాటులో లేకపోతే సంబంధిత శాఖ అధిపతి అనుమతితో ఇతర సంస్థల ఇంటర్నెట్ సేవలను ఉపయోగించవచ్చుని,  à°ªà°¿ à°¡à°¿ ఖాతాను తెరవడానికి ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టాలన్నారు.

బిల్లుల చెల్లింపు సమయంలో భాగంగా మాన్యువల్ బిల్లులు కాకుండా ఆన్ లైన్ లో సీఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించాలన్నారు. ప్రతీ బిల్లుకు సంబందించిన వోచర్ల స్కాన్ కాపీ

పెట్టాలని వివరించారు.  à°ˆ కార్యక్రమంలో వివిధ శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam