DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ ఎవరో తెలియకుండానే ప్రచారానికి పిలిచారా? వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ బాబే

పవన్ ఎవరో తెలియకుండానే 2014 లో ప్రచారానికి ఎలా పిలిచారు : పవన్ కళ్యాణ్ 

వెన్ను పోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్ర బాబు  

రాష్ట్రాన్ని బ్రష్టు

పాట్టించింది తెలుగుదేశమే . . . 

గజపతి నగరం, జూన్  1 (DNS Online) : à°—à°¤ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అని à°…à°¡à°¿à°—à°¿ ఉంటే చాలా బాగుండేదని,

నాలుగేళ్ల పదవి అనుభవించాక ఇప్పుడు పవన్ ఎవరో తెలియదు అని అడగడం అంటే ఏరు దాటేశాక తెప్ప తగలేసిన చందాన ఉందని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగరం చేరుకున్న పవన్, జనసైనికులతో కవాతు చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గజపతి రాజులంటే తమకు ఎంతో గౌరవం ఉందని,

అయితే అశోక్ గజపతి రాజు లాంటి పెద్దలు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తో సహవాసం చెయ్యడం ద్వారా తమకు సరిపడని వ్యాఖ్యలు చేసి, తమ స్థాయిని

తగ్గించుకుంటున్నారన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన రాజు వంశీకులు నేడు విమర్శలు ఎదుర్కోవడం సబబు కాదన్నారు. 

వెన్ను పోటు రాజకీయాలకు బ్రాండ్

అంబాసిడర్ అయిన చంద్ర బాబు రాష్ట్రాన్ని అధ పాతాళానికి తొక్కాడన్నారు. తన అవసరం ఉన్నంత వరకూ చంద్రబాబు ప్రక్క వారితో జత కడతాడని, అవసరం తీరాక నడ్డి

విరగ్గొడతాడని 1995 లో ఎన్ à°Ÿà°¿ రామారావు విషయం లో బయటపడింది, 2017 లో రేవంత్ రెడ్డి, 2018 లో మోత్కుపల్లి విషయం లో బహిర్గతమైందన్నారు. నాడు తన మామ 
రామారావును వెన్నుపోటు

పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని కేంద్రం చెప్పిన నాడే ఎన్ డి ఏ నుంచి బయటకు రావాల్సియుండగా, ఓటు కు నోటు కేసులు,

అక్రమంగా దోచుకున్న నిధులను కాపాడుకునేందుకే బీజేపీ తో నాలుగేళ్ల సంసారం చేసి, తమ అవసరాలు తీరాక విడాకులు తీసుకున్నారన్నారు. ఆరు కోట్ల ఆంధ్రుల

ఆత్మాభిమానాన్ని చంద్రబాబు అండ్ కో కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వని కారణంగా కవాతు

చేస్తున్నామన్నారు. 

అనుభవం ఉన్న వ్యక్తి అని అవకాశం కల్పించాలని ఓట్లు చీల్చకుండా ఉండడానికి, తాము 2014  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ కనీసం పోటీ కూడా చేయకుండా తెలుగుదేశం

పార్టీ, బీజేపీ à°² తరపున  à°ªà±à°°à°šà°¾à°°à°‚ చేస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వం లో మంత్రులు, నేతలు, అవినీతి ఎక్కువైందన్నారు.

బి.జె.పి. స్క్రిప్ట్ చదువు

తున్నానని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు, బి.జె.పి.ని మొదటి ఎదురించేది, నిలదీసేది జనసేన, పవన్ కళ్యాణ్ అని అన్నారు. 

17  à°µà±‡à°² కిలో మీటర్ల రోడ్లు

వేశామని చెబుతున్న చంద్రబాబు, విజయనగరం లో రోడ్లు ఎక్కడ వేశారో జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు

శ్రీకాకుళంలో 19 జీవనదులు, జిల్లా దాదాపు 6

జీవనదులు ఉన్న ప్రాంతం, రాష్టాన్ని ఆరోగ్యఆంధ్ర ప్రదేశ్ గా చెబుతున్న చంద్రబాబు గజపతినగరంలో పందులు తిరుగుతున్నాయి

ఆంద్రా ప్రాజెక్టు డబ్బులు లేవుకాని,

ఉత్తుత్తి సదస్సులు, మేజువాణీలకు, స్టార్ హోటళ్లలో సమావేశాలకు మాత్రం పుష్కలంగా డబ్బులు ఉన్నాయా అని అడిగారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam