DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - మా పూర్వజన్మ సుకృతం 

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. 

భక్తి శ్రద్దలతో పాల్గొన్న ఈఓ, అర్చక సిబ్బంది. 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి) : .  . 

తిరుపతి, సెప్టెంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à°¾à°•à±à°·à°¾à°¤à±à°¤à± తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రతి ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల అంకురారోపణకు ముందు వచ్చే మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌

ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. దీన్ని అనుసరించే à°ˆ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు à°ˆ నెల 30 నుంచి ప్రారంభం అవుతున్నందుకు ముందుగా వచ్చే మంగళవారం (24 à°¨)

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.  à°®à°‚గళవారం వేకువజామున 3 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ తర్వాత తోమాల, కొలువు, పంచాంగ

శ్రవణం, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమంజనం జరుగుతుంది. తిరుమంజనంలో భాగంగా.. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని శుద్ధి

చేస్తారు. శుద్ధి తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకమ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి ఆలయంలో పూస్తారు. ఆలయ శుద్ధి

పూర్తి చేసారు. అనంతరం భక్తుల్ని స్వామి దర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్  à°¤à°¿à°°à±à°®à°‚జనం సందర్బంగా  à°ˆ రోజు జరగవలసిన అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు

చేశారు. మిగిలిన సేవల్ని మాత్రం జరుగుతాయి. ప్రతి ఏటా నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాల పర్వదినాల ముందు మంగళవారం నాడు

ఆలయశుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది. 

à°ˆ కార్యక్రమం లో ఆలయ అర్చకులు, ప్రత్యేక అధికారి ధర్మ రెడ్డి, డిప్యూటీ ఈఓ  à°¹à°°à°¿à°‚ద్రనాథ్, పేష్కార్ లోకనాథం, తదితరులు

పాల్గొన్నారు. 

పుష్కరిణి పర్యవేక్షణ : 

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వామి పుష్కరిణి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ

ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రానున్నందున, మాడా వీధుల్లో ఎటువంటి అపారిశుద్యం లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని

సిబ్బందికి సూచించారు. ప్రధానంగా పుష్కరిణి లోని నీటి ని ఎప్పడికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam