DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేసవి రద్దీకి తగ్గట్టు విశాఖ ఆర్టీసీ సేవలు - రూ 50 లక్షల ఆదాయం

విశాఖపట్నం, జూన్ 01, 2018 (DNS Online) : వేసవి సెలవుల రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం నుంచి వివిధ గమ్య స్థానాలకు వెళ్లే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

రోడ్ రవాణా సంస్థ అధిక బస్సులను నడిపినట్టు విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ సుధీష్ కుమార్ తెలియచేసారు. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రయాణీకుల నుంచి

సానుకూల స్పందన లభించినట్టు తెలిపారు. విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ కు 32 సర్వీసులు, నరసాపురం కు 17 సర్వీసులు, విజయవాడకు 78 సర్వీసులు నడిపినట్టు వివరించారు. వీటి

సేవలకు గాను 50  à°²à°•à±à°·à°² రూపాయల ఆదాయంతో పాటు 95 ఆక్యుపెన్సీ రేషియో కూడా సాధించినట్టు చెప్పారు. అదే విధం à°—à°¾ తిరుగు ప్రయాణం లో భాగం à°—à°¾ జూన్ నెల లో వేసవి సెలవుల రద్దీ,

వివాహాల రద్దీకి తగినట్టుగా విశాఖపట్నం నుంచి విజయవాడ కు 30 సర్వీసులు, అమలాపురం కు 20 సర్వీసులు, నరసాపురం కు 10 సర్వీసులు, హైదరాబాద్ కు 40 సర్వీసులు నడిపేందుకు అన్ని

ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ అదనపు సర్వీసులను విజయవంతం చేసి పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ప్రయాణీకులకు, ప్రయాణీకులను ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి

గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలియచేసారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam