DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తపాలా విభాగ సేవలు అనిర్వచనీయం : ఏ కే జైన్ 

సైనికుల క్షేమ సమాచారం తెలిసేది తపాలా లేఖ ద్వారానే . . .

ఎన్ఏడి 75  à°à°³à±à°³ ప్రస్థానం పై ప్రత్యేక తపాలా ఆవిష్కరణ :

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . .

విశాఖపట్నం,

సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ నావికా దళ ఆయుధ భాండాగారం ( ఎన్ ఏ à°¡à°¿ ) సంస్థ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా  à°­à°¾à°°à°¤à±€à°¯ తపాలా శాఖా ప్రత్యేక తపాలా స్టాంపు ని

విడుదల చేసింది. మంగళవారం ఎన్ ఏ డి ప్రాంగణం లో జరిగిన ప్లాటినం జూబిలీ వేడుకల్లో భాగంగా భారతీయ తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక తపాలా ( స్టాంప్ ) ను విశాఖ ప్రాంతీయ

సీనియర్ సూపరెంటెండెంట్ ఎన్. సోమశేఖర్ రావు ( విశాఖపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్), తూర్పు నావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ లు సంయుక్తంగా విడుదల చేసారు.

ప్లాటినం జూబిలీ వేడుకలను పురస్కరించుకుని తయారు చేసిన ప్రత్యేక సావనీర్ ను కూడా వీరువురు విడుదల చేసారు. 

ఈ సందర్బంగా తపాలా శాఖ చేస్తున్న సేవలను

నావికాదళాధిపతి కొనియాడారు. కుటుంబ సభ్యులకు దూరంగా వేలాది కిలోమీటర్ల దూరంలో దేశ రక్షణ లో ఉండే సైనికుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించడంలో తొలినాళ్ళ

నుంచి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కూడా తపాలా శాఖ ద్వారా లేఖలతోనే సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకల్లో నావికాదళ అధికారులు, సిబ్బంది

పాల్గొన్నారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam