DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక కళ్యాణం కోసమే దేవీ వైభవం: అయ్యన్నపంతులు   

మహా కామేశ్వరీ పీఠంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు  

అక్టోబర్ 9 à°¨ అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణం 

à°ˆ నెల 29 నుంచి అక్టోబర్ 8 వరకూ వేడుకలు  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌) : లోక కళ్యాణం కోసమే దేవీ శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్టు శ్రీ మహాకామేశ్వరి

పీఠాధిపతులు యద్దనపూడి అయ్యన్నపంతులు తెలియచేసారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8 వరకూ ఈ ఉత్సవాలను

విశాఖ నగర శివారు ప్రాంతమైన పెందుర్తి సమీపంలో à°—à°² రాంపురం గ్రామం లోని తమ పీఠంలో జరుగుతాయన్నారు.  à°…క్టోబర్ 9 à°¨ శ్రీ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా

జరుగుతుందన్నారు. ఈ మహోత్సవాన్ని పోణంగిపల్లి రఘునాథాచార్య ఆధ్వర్యవంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో అందరం కలిసి అమ్మను ప్రార్థిద్దామని, పెద్ద

సంఖ్యలో భక్తులు దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారు. 

సెప్టెంబర్ 29 న ఉదయం 7 గంటలకు యాగ మందిర ప్రవేశం, గురుమండలార్చన, అఖండ

దీపారాధన, అనంతరం 10 గంటలకు అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడంతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. చండీయాగం ప్రారంభం, శ్రీ కనకధారా మహా

యజ్ఞం, నవ వారణార్చన, దశవిధ హారతులు తో మొదటి రోజు కార్యక్రమం ముగుస్తుందని వివరించారు. 

సెప్టెంబర్ 30 à°¨ ఉదయం బలోపేసాన - బాలా అమ్మవారి అర్చన,  12 సంవత్సరాల వయసు

లోపల గల బాలికలకు అర్చన, నూతన వస్త్ర బహుకరణ,

అక్టోబర్ 01 న ఉదయం 10 గంటలకు స్వాతీ నక్షత్ర కాల సర్పదోష నివారణ, నాగశాంతి మహాయజ్ఞం, సాయంత్రం సహస్ర కలశాభిషేకం.
   
/> అక్టోబర్ 02 న ఉదయం 10 గంటలకు శ్రీ కనకధారా మహా యజ్ఞం, సాయంత్రం నవ వారణార్చన.

అక్టోబర్ 04 à°¨  à°Šà°‚జల్ సేవ 

అక్టోబర్ 05 న పుష్పోత్సవం - పుషయాగం.

అక్టోబర్ 06 న

ఉదయం సువాసినీ అర్చన.  à°µà°¾à°°à°¿à°•à°¿ అమ్మవారి సేవ వస్త్రాలు బహుకరించడం జరుగుతుంది. 

అక్టోబర్ 07 న ఉదయం కోటి కుంకుమార్చన.

అక్టోబర్ 08 న విజయదశమి .

పవిత్రోత్సవములు. పూర్ణాహుతి. 

అక్టోబర్ 09 à°¨ ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియచేసారు. 

ఈ విలేకరుల సమావేశం లో

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, పీఠం ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam