DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికే ప్రాధాన్యత

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి చర్యలు : మంత్రి ధర్మాన 

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణ దాస్

పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బాపూజీ కళామందిర్ లో పర్యాటక శాఖ ఆధ్వర్యాన ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాల

శాఖా మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ జె.నివాస్ తో కలిసి

ప్రారంభించారు. à°ˆ సందర్భంగా  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• విశేషాలను గూర్చి జిల్లా పర్యాటక అధికారి నారాయణ రావు మంత్రికి వివరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో  à°ªà°¾à°²à±à°—ొని జ్యోతి

ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో

ప్రకృతి సిద్ధమైన ప్రాంతాలు,  à°¸à°¹à°œà°®à±ˆà°¨ వనరులు, ప్రాచీన దేవాలయాలు ఉన్నాయన్నారు. శ్రీముఖలింగం అత్యంత ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రమని, కోటి లింగాలు à°—à°² ప్రదేశమని

చెప్పారు. ఇటువంటి విశిష్టత కలిగిన దేవాలయాలు ఎన్నో జిల్లాలో ఉన్నప్పటికీ వసతులు లేని కారణంగా పర్యాటకంగా అభివృద్ధి చెందడం లేదని చెప్పారు. ఇటువంటి ప్రసిద్ధ

ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేసారు.  à°…లాగే జిల్లాలో బీచ్ లు, బుద్దిస్ట్ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని వాటిని కూడా

పర్యాటకంగా అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు. జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ రోజు నుండి పర్యాటక ప్యాకేజీ క్రింద విశాఖపట్నం నుండి బస్ ను

ప్రారంభించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తొలుత పర్యాటక దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు మంత్రి బహుమతులను

అందజేసారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఒక నినాదంతో పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ ఏడాది టూరిజం అండ్

జాబ్స్-అందరికీ ఉపాధి నినాదంతో పర్యాటక దినోత్సవంను నిర్వహించు కుంటున్నామని అన్నారు. పర్యాటకం వలన ఉపాధి, ఆదాయ మార్గాలు అభివృద్ధి చెందుతాయని    à°•à°²à±†à°•à±à°Ÿà°°à±

 à°¸à±à°ªà°·à±à°Ÿà°‚  à°šà±‡à°¸à°¾à°°à±.  à°¸à°¿à°‚గపూర్, మలేసియా  à°µà°‚à°Ÿà°¿  à°¦à±‡à°¶à°¾à°²à± పర్యాటకంపైనే ఆధారపడి ఉన్నాయని కలెక్టర్ à°ˆ సందర్భంగా గుర్తుచేశారు. à°—à°¤ కలెక్టర్ చొరవతో సీతం పేటలో రూ.2.50

కోట్లతో ఎన్.టి.ఆర్.అడ్వంచర్ పార్కును ఏర్పాటుచేయడం వలన సుమారు 200 మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్.టి.ఆర్ అడ్వెంచర్ పార్క్ నిర్మించిన

ఏడాదిలోనే సగం పెట్టుబడి ఆదాయంగా లభించిందని తెలిపారు. జిల్లాలో ఏ రంగాల్లో పర్యాటక ప్రాధాన్యత ఉన్నదో పరిశీలించి, వాటి అభివృద్ధికి ప్రతిపాదనలను

ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. విశాఖపట్నంతో అనుసంధానం చేయడం వలన జిల్లా పర్యాటక రంగం మరింత అభివృద్ధిచెందే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేసారు. విశాఖ,

శ్రీకాకుళం బుద్దిస్ట్  à°¸à°°à±à°•à±à°¯à±‚ట్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి వనరులపై బాట్ రేస్ కు ప్రతిపాదనలు పంపామని, టెంపుల్

టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. 3 దేవాలయాల మాస్టర్ ప్లాన్ అమలుకు కోరడం జరిగిందని చెప్పారు. గిరిజన జీవన విధానం, సంప్రదాయాలు

తెలియజేయుటకు పర్యాటకంగా మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఏకో, బీచ్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, వజ్రపు కొత్తూరు మండలం

శివసాగర్, కల్లెపల్లి, కళింగ పట్నం, బారువ బీచ్ ల అభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ప్రపంచ పర్యాటక దినోత్సవం

సందర్భంగా పర్యాటక శాఖ పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేసింది. ఇందులో తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీ శ్రీనివాస కళ్యాణం ఆహుతులను

మంత్రముగ్ధులను చేసింది. అలాగే శుక్లాం బరందరం విష్టుం శశివర్ణం అంటూ నీరజా శిష్యం బృందం చేసిన కూచిపూడి నృత్యం, మెహర్ ప్రభాకర్ శిష్యబృందం గ్రామాల్లో

అమ్మవారి జాతరపై చేసిన జానపద నృత్యం ఆధ్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. కార్యక్రమాన్ని అధ్యంతం తిలకించిన మంత్రి, జిల్లా కలెక్టర్ కళాకారులకు

జ్ఞాపికనిచ్చి అభినందించారు.

వావిలాపల్లి జగన్నాధం నాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, సెట్ శ్రీ

ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాసరావు, ఐసీడీస్ పథక సంచాలకులు జి.జయదేవి, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్ మహాలక్ష్మి, పర్యాటక అధికారి

ఎన్. నారాయణ రావు, హోటల్స్ ప్రతినిధులు ఆనంద్, గోపి., మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam