DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బయోమెడికల్ చెత్తను వెంటనే రీ సైక్లింగ్ చేయాలి

రిమ్స్,  à°œà±†à°®à±à°¸à± ఆసుపత్రుల్లో ఉన్నత స్థాయి కమిటీ పర్యటన   

డంపింగ్ యార్డుల్లో ఎక్కువ నిల్వ చెయ్యరాదు ఛైర్మన్ బి ఎస్ రెడ్డి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,

 à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): డంపింగ్ యార్డులలోని ప్లాస్టిక్ మెటీరియల్ ను, పొడి చెత్తను ఎప్పటికప్పుడు

రీసైక్లింగ్ చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ ఛైర్ పర్సన్ జస్టిస్ బి.శేషశయన రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన

రాష్ట్రస్థాయి కమిటీ ఛైర్ పర్సన్ ( నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన ) శుక్రవారం ఉదయం స్థానిక రిమ్స్, రాగోలులోని జెమ్స్ ఆసుపత్రులతో పాటు ఆమదాలవలస పురపాలక

సంఘం డంపింగ్ యార్డు , శ్రీకాకుళం నగరపాలక సంస్థ డంపింగ్ యార్డులను స్వయంగా పరిశీలించారు. ముందుగా రిమ్స్ ఆసుపత్రిలో పర్యటించిన జస్టిస్ ఆసుపత్రులలోని పలు

విభాగాలను సందర్శించి, అక్కడ బయోమెడికల్ వేస్ట్ మెటీరియల్ ను పరిశీలించారు. ఆసుపత్రులలోని బయోమెడికల్ వేస్టేజ్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచకపోవడం వలన

మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముందని, కావున ఆసుపత్రిలోని విభాగాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని ఫ్యాబ్ ట్యాంక్, డంపింగ్ యార్డులను

పరిశీలించిన ఆయన బయోమెడికల్ చెత్తను నిల్వచేయరాదని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. డంపింగ్ యార్డులలోని తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా చేయాలని ,

తడిచెత్త నుండి వర్మికంపోస్టు తయారుచేసి ఎరువుగా వాడాలని చెప్పారు. అదేవిధంగా పొడిచెత్తను, ప్లాస్టిక్ ను  à°¨à°¿à°²à±à°µà°šà±‡à°¯à°•à±à°‚à°¡à°¾ రీసైక్లింగ్ చేయాలని ఆదేశించారు.

డంపింగ్ యార్డులలోని చెత్తపై తీసుకోనున్న చర్యలపై ముందస్తు ప్రణాళికను సిద్ధంచేసి తమకు అందజేయాలని పురపాలక సంఘ అధికారులను ఆదేశించారు. 
          à°ˆ

కార్యక్రమంలో ఆం.ప్ర.కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ సుబ్బారావు, ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ యస్.శంకర్ నాయక్, అసిస్టెంట్ ఎన్విరాన్

మెంటల్ ఇంజినీర్ బి.కరుణశ్రీ, రిమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎ.కృష్ణమూర్తి, డెప్యూటీ సూపరింటెండెంట్ డా. యం.ప్రభాకర్, సి.ఎస్.ఆర్.ఎం డా. అప్పలనాయుడు,

డా. కె.సునీల్ నాయక్, నగరపాలక సంస్థ ఇంజినీర్ యస్.దక్షిణామూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam