DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర పర్యాటక అవార్డుల్లో ఒకటి విశాఖ కు

జిల్లాలో పర్యాటకం అభివృద్ధి పథం లో 

విఎంఆర్డిఏ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2019

(డిఎన్‌ఎస్‌) : 

విశాఖపట్నం, సెప్టెంబర్, 27: జిల్లా పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చెందుతుందని విఎంఆర్డిఏ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు

పేర్కొన్నారు. గురువారం పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. à°µà°¿à°¶à°¾à°– ను

పర్యాటక హబ్ à°—à°¾ అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.  à°µà°¿à°¶à°¾à°– నగరంతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ ప్రాంతాన్ని

టూరిజం హబ్ à°—à°¾ తీర్చిదిద్దేందుకు కృషి  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±.  à°¯à°¾à°°à°¾à°¡ కొండపై పర్యాటకంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విశాఖ

సముద్ర తీరం ఆధునీకరణ చేస్తున్నట్టు! చెప్పారు .శ్రీ శ్రీ ,గురజాడ వంటి ఎందరో కవులకు, కళాకారులకు నిలయమైన విశాఖపట్నం చారిత్రక, పర్యాటక నగరంగా అభివృద్ధి

చెందేందుకు అన్ని అవకాశాలు! ఉన్నాయన్నారు. విశాఖ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ పర్యాటకానికి చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు.   విశాఖ నగరం శరవేగంగా

అభివృద్ధి చెందుతుందన్నారు. పర్యాటక శాఖ మంత్రి ఈ ప్రాంతం వారు కావడం పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. విశాఖ ను ఆర్థిక రాజధాని చేసే యోచనలో

ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. అన్ని శాఖల్లో ప్రక్షాళన జరుగుతుందని, అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని ఐటి

కంపెనీలు, ఫార్మా కంపెనీలు వస్తాయని, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు.
 
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతు కేంద్రం రాష్ట్ర పర్యాటక శాఖకు ఇచ్చిన మూడు

అవార్డులు మన రాష్ట్రానికి రావడం సంతోషం అన్నారు. అందులో  à°µà°¿à°¶à°¾à°– రైల్వే స్టేషన్ ఉత్తమ పర్యాటక స్టేషన్ à°—à°¾ అవార్డ్ పొందిందన్నారు. విశాఖ లో తీర ప్రాంత పర్యాటకం,

గిరిజన ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రతల వాతావరణం, పర్యాటకులను ఆకర్షిస్తోంది అని చెప్పారు..అల్లూరి నడిచిన ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా ప్రభుత్వం అభివృద్ధి

చేస్తోంది అని చెప్పారు .బుద్దిస్టు సర్క్యూట్ రూ. 21కోట్లతో పనులు చేపట్టి పనులు పురోగతిలో ఉన్నాయని, రుషికొండలో బీచ్లో బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రాజెక్టు రూ. 7.35

కోట్లుతో కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంనకు పర్యాటక అభివృద్ధి కి మరిన్ని ప్రతిపాదనలు పంపడమైనదని, రేవుపోలవరం, యారాడ అభివృద్ధి

అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లమ్మసింగి, అనంతగిరిలో కాఫీ మ్యూజియం, పాండ్రంకి మరియు కెడిపేట ల్లో అల్లూరి సీతారామరాజు

మెమోరియల్ పార్క్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ పర్యాటకంలో విశాఖ రాష్ట్రంలో అగ్రగ్రామి

ఉంటుందన్నారు. యారాడ ను బీచ్ ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విఎంఆర్డిఏ కమిషనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పర్యాటక

ప్రాంతాలను సందర్శించి జ్ఞానాన్ని సంపాదించాలన్నారు. జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ ఈ యేడాది టూరిజం థీం టూరిజం జాబ్స్ పై వివరించారు. జాయింట్

కలెక్టర్ ఎల్ శివ శంకర్ మాట్లాడుతూ విశాఖ జిల్లా పర్యాటక ప్రాంతాల విశిష్టతను వివరించారు. అంతకు ముందు కార్యక్రమాన్ని విఎంఆర్డిఏ అధ్యక్షులు, కలెక్టర్, శాసన

సభ్యులు, విఎంఆర్డిఏ కమిషనర్, జివిఎంసి కమిషనర్ జెసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 à°…సిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట, సమాచార శాఖ ప్రాంతీయ

సంయుక్త సంచాలకులు à°Žà°‚ బాలగంగాధర్ తిలక్, పర్యాటక శాఖ అధికారులు రాధాకృష్ణ, పూర్ణిమా దేవి,  à°•à°³à°¾à°¶à°¾à°²à°² విద్యార్థులు పాల్గొన్నారు.టూరిజం థీంపై విద్యార్థులకు

నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, పెయిటింగ్, తదితర వాటిపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు

జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెష్ట్రా నిర్వహించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam