DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగం ఒక చరిత్రే : మంత్రి ధర్మాన 

సచివాలయ అభ్యర్ధులకు నియామక పత్రాలు జారి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ): . . .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): కేవలం

నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగం à°’à°• చరిత్రే నని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ పట్టణంలో ఆనందమయి ఫంక్షన్ హాల్ లో

సోమవారం జరిగిన కార్యక్రమంలో  à°—్రామ, వార్డు సచివాలయ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి నియామక పాత్రలను అందించారు. à°ˆ సందర్బంగా

అయన మాట్లాడుతూ  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ఉద్యోగాలు కల్పించడం సాధించడం కష్ట సాధ్యమైన అంశంగా ఉందని, దానిని ముఖ్యమంత్రి యువత కోసం సుసాధ్యం చేశారన్నారు. యువత కలలను సాకారం

చేశారని పేర్కొన్నారు.  à°•à±‡à°µà°²à°‚ నాలుగు నెలల కాలం లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టడం కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ మాత్రమే సాధ్యమైందని

తెలిపారు.  రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపించుటకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుండాలనే తపనతో

పనిచేస్తున్నారని ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పే అవకాశం ఉందని యోచిస్తున్నారని చెప్పారు. దీనితో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు

వస్తాయని మంత్రి కృష్ణదాస్ పేర్కొన్నారు. అందుకే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 75 శాతం ఉద్యోగాలు

స్థానికులకే కేటాయించాలని చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. రానున్న 5 సంవత్సరాలలో వేలాది ఉద్యోగులు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారని చెప్పారు.

ప్రజలకు మంచి సేవలు అందించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ కృతజ్ఞతలు తెలియజేయాలని నూతన ఉద్యోగార్ధులను కోరారు. 

రాష్ట్రంలో గత నాలుగు నెలల కాలంలో 4

లక్షల ఉద్యోగాల నియామకంతో దేశంలో చరిత్ర సృష్టించారని చెప్పారు. ప్రభుత్వం అప్పగించిన పనులను చక్కగా నిర్వర్తించి ప్రజల మన్ననలను పొందడమే కాకుండా

ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఉద్యోగానికి సార్ధకత చేకూర్చాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి

అందేవిధంగా సచివాలయాలు, వాలంటీర్లు పనిచేయాలన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలని పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ, వార్డు

సచివాలయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ పట్టణంలో ఆనందమయి ఫంక్షన్ హాల్ లో సోమ వారం జరిగిన కార్యక్రమంలో  à°—్రామ, వార్డు

సచివాలయ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ముఖ్య అతిథిగాహాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని

ప్రారంభించారు. సంగీత ఉపాధ్యాయులు ప్రశాంతి ప్రార్ధనా గీతాన్ని ఆలాపించారు. 
జిల్లాలో 835 గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు  1,14,734 మంది పరీక్షలు వ్రాసిన సంగతి

తెలిసిందే. పోస్టులలో గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 5 పోస్టలు 529, వి.ఆర్.à°“ గ్రేడ్ 2 పోస్టులు 185,  à°.ఎన్.à°Žà°‚ గ్రేడ్ 3 పోస్టులు 648,  à°ªà°¶à±à°¸à°‚వర్ధక

అసిస్టెంట్లు 792, మత్స్య సహాయకులు 67, ఉద్యానవన అసిస్టెంట్ల పోస్టులు 155, గ్రేడ్-2 వ్యవసాయ సహాయకులు 676, సెరీకల్చర్ సహాయకులు 4, మహిళా పోలీసు మరియు మహిళా, శిశు సంక్షేమ

సహాయకులు 930, ఇంజనీరింగు అసిస్టెంట్లు 835, డిజిటల్ అసిస్టెంట్లు 835, వార్డు సంక్షేమ విద్యా సహాయకులు 835 పోస్టులు, సర్వేయర్లు 835 వెరశి 7,326 పోస్టులు., పట్టణ ప్రాంతాల్లోగల

వార్డు సచివాలయాలలో వార్డు విద్యా మరియు డేటా ప్రాసెసింగు సహయకులు 95, గ్రేడ్ -2 వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి 94, వార్డు ప్లానింగు మరియు

రెగ్యులేషన్ కార్యదర్శి 95, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి 95. ఎమినిటీస్ కార్యదర్శి 95, వార్డు పరిపాలన కార్యదర్శి 84 పోస్టులు వెరశి 558 పోస్టులు ఉన్నాయి. గ్రామ,

వార్డు సచివాలయాలలో మొత్తం 7,884 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాగా ధృవీకరణ పత్రాలు పూర్తి స్ధాయిలో పరిశీలన జరిగిన 2,514 మందిలో 2,467 మంది అర్హత

సాధించగా  2,466 మందికి సోమ వారం నియామక పత్రాలను అందజేయుటకు ఏర్పాట్లు చేసారు.
    à°œà°¾à°¯à°¿à°‚ట్ కలెక్టర్ à°¡à°¾ కె శ్రీనివాసులు భారీ ప్రక్రియను సజావుగా పూర్తి

చేసామన్నారు. ఇంతటి భారీ నియామక ప్రక్రియలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలు పొందిన యువత ప్రజలకు మంచి సేవలు అందించి మన్ననలు పొందాలని

తెలిపారు.
    ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు – రేష్మా, శ్రీవాణి, తేజేశ్వరి, ఎస్.సుశీల, సీపాన గోవిందరావు, ఏ.భవాని, కే.అప్పన్న, రవళి ప్రియ, హరిత తమ అభిప్రాయాలను

వెల్లడించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రభుత్వ ఉద్యోగం సాకారం అయిందని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు మధురమైన

క్షణాలని అభ్యర్ధులు తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలను మంత్రి, జాయింట్ కలెక్టర్ అందజేసారు.
      à°ˆ సందర్భంగా విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి

కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యోగం ఉద్యోగంగా కాకుండా ఉద్యమంలా సేవలు అందించాలని

పిలుపునిచ్చారు. సొంత మండలంలో ఉద్యోగం చేసే గొప్ప అవకాశం పొందినందుకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిజాయితీతో,

నిష్పక్షపాతంగా పారదర్శకంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లతో అనుసంధానం అవుతూ  à°ªà±à°°à°¤à°¿ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతి గడపకు చేర్చాలని చెప్పారు. 2000

మందికి ఒక సచివాలయం, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసామని తెలిపారు.
       à°ˆ కార్యక్రమంలో ఆర్డీవో à°Žà°‚.వి.రమణ, జెడ్పీ సిఇఓ జి.చక్రధర రావు, నగర పాలక సంస్థ

కమిషనర్ ఎం.గీతా దేవి, డిపిఓ వి.రవికుమార్, డిఆర్డిఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జెడి బిజిడి ప్రసాద్, మత్స్య శాఖ జెడి డా వివి కృష్ణ మూర్తి, పశుసంవర్ధక శాఖ

జెడి డా.ఏ.ఈశ్వర రావు, పంచాయతీరాజ్ ఎస్.ఇ ఎస్.రామ్మోహన్, ఉద్యానవన శాఖ ఏడి ఆర్వివి ప్రసాద్, మునిసిపల్ పూర్వ అధ్యక్షులు వరం, డిసిఎంఎస్ మాజీ అధ్యక్షులు గొండు కృష్ణ

మూర్తి., వెంకట చిరంజీవి నాగ్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam