DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విదేశీ ఉద్యోగం మోజుతో మోసపోవద్దు : సీపీ యోగానంద్

విశాఖపట్నం, జూన్ 2 2018 (DNS Online) : విదేశీ ఉద్యోగాల మోజుతో ఇల్లు, వాకిలి, కుటుంబాలను వదిలి మోసగాళ్లను నమ్మి, విదేశాలకు వెళ్లి, నానా అవస్థలు పడవద్దని, విశాఖ నగర పోలీసు

కమిషనర్ యోగానంద్ ప్రజలను హెచ్చరించారు. అరబు దేశాల్లో వివిధ ప్రాంతాల్లో పలు కంపెనీలో ఉద్యోగాలు కోసం వెళ్లిన నిరుద్యోగులకు తగిన రక్షణ కల్పించి, అండగా

నిలబడతామని విశాఖ అయన తెలియచేసారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ 
అబుదాబి, దుబాయ్ , ఇతర అరబు దేశాల్లో వివిధ ప్రాంతాల్లో హుండాయ్ (

కొరియా desam ) కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ వేస్కో రోబోటిక్ వెల్డింగ్ సంస్థ , ఆటోనగర్ ఏజంట్ ఎల్ డి ప్రసాద్ ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగుల నుంచి సుమారు 65 వేల

నుంచి 80 వేల వరకూ వసూలు చేసి, వాళ్లకి హుండాయ్ కంపెనీ లో ఉద్యోగం వచ్చినట్టు నియామక ఉత్వర్వులు కూడా ఇచ్చి ఏప్రిల్ 3 , 5 ,6 , 8  à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹ వీరిని అబుదాబి à°•à°¿ పంపినట్టు

తెలిపారు. అక్కడ హారిజాన్ ఇంటెర్నేషల్  à°°à°¿à°•à±à°°à±‚ట్మెంట్ సంస్థ వారు వీరిని రిసీవ్ చేసుకోగా, నిరుద్యోగులకు అనుమానం వచ్చి వారిని అడగ్గా, మాకు సివిల్ వర్కర్ల

కోసం సిబ్బంది కావాలని అడిగి, మిమ్మల్ని తీసుకువచ్చినట్టు చెప్పినట్టు వివరించారు. వెంటనే వీరు తిరిగి భారత్ కు వెళ్లిపోతామని అడిగినా సదరు ఏజంట్ గానీ, సంస్థ

వారు గానీ, స్తానిక ఎంబసీ వారు గానీ ఏవిధంగానూ స్పందించలేదని వాపోయారు. దీంతో విశాఖ పోలీసు వారికి ట్విట్టర్ ద్వారా బాధితులు ఫిర్యాదు చేయడం తో సత్వర ఏర్పాట్లు

చేసి, వీరిని అరబ్బుల కబంద హస్తాల నుంచి కాపాడి, జూన్ 1 à°µ తేదీ నాటికి అందరినీ గమ్య స్థానానికి తీసుకు రావడం జరిగిందని తెలిపారు. à°…నంతరం విలేకరుల సమావేశం లో తాము

ఎదుర్కొన్న అవస్థలను బాధితులు వివరించారు. à°ˆ విలేకరుల సమావేశంలో సీనియర్ పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam