DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందీ భాష అమలు అద్భుతంగా ఉంది: కమాలుద్దీన్  

విశాఖ్ రిఫైనరీ లో హిందీ పక్వడా ముగింపు వేడుకలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్

విశాఖ్ రిఫైనరీ లో హిందీ భాష అమలు అద్భుతంగా ఉందని కేంద్ర హోమ్ శాఖ హిందీ శిక్షణ విభాగం సహాయ సంచాలకులు  à°•à°®à°¾à°²à±à°¦à±à°¦à±€à°¨à± అభిప్రాయం పడ్డారు. మంగళవారం జరిగిన హిందీ

పక్వడా ముగింపు వేడుకల్లో ముఖ్య అతిధిగా కమాలుద్దీన్ మాట్లాడుతూ సంస్థలోని సిబ్బంది హిందీ భాష వినియోగాన్ని సంపూర్ణంగా వినియోగించడం సంతృప్తికరంగా

ఉందన్నారు. హిందీ భాష నేర్చుకోవడం, వినియోగించడం అత్యంత సులభతరం అని, రోజువారీ కార్యాచరణలో హిందీ భాషను అమలు చెయ్యడం ద్వారా ప్రాంతీయ భేదాలు తొలగి, సమాచార ప్రసరణ

విస్తారమవుతుందన్నారు.  

చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్) నరిశెట్టి రాజారావు, మాట్లాడుతూ ఈ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో సంస్థ సిబ్బంది

పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇదే తరహా స్ఫూర్తిని సాధారణ విధుల్లోనూ కనపరచడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించగలమన్నారు.  

ఎగ్జిక్యూటివ్

డైరక్టర్ వి రతన్ రాజ్,  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ సంస్థ లో హిందీ భాష వినియోగం రోజు రోజుకూ పెరగడం వలన, ఉద్యోగుల్లో హిందీ పట్ల ఉన్న ఆసక్తి కనపడుతోందన్నారు. హిందీ భాషను

పూర్తిగా అమలు చెయ్యాలంటే సంస్థలోని ఉద్యోగులు అందరి సహకారం అవసరం అని, కేవలం ఏ ఒక్కరో చేసే కార్యక్రమం కాదని, సమష్టి à°—à°¾ చేసే మహా యజ్ఞం అన్నారు.  

అనంతరం గత

పక్షం రోజులుగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేసారు.  à°ˆ కార్యక్రమం లో  à°…ధికార భాష అధికారి, కె వాసుదేవ, చీఫ్ మేనేజర్ (హెచ్ ఆర్) సుధా మోహన్, వివిధ

విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.       

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam