DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ సారాయి వ్యాపారానికి ద్వితీయ విఘ్నం లేదా ?

గాంధీ జయంతి à°•à°¿ విక్రయాలు ఉంటాయా? లేదా ? 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS):  .

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను అదుపు

చేసేందుకు తానె స్వయంగా సారాయి అమ్మెందుకు దుకాణాలు తెరిచేసింది. పైగా అక్టోబర్ 1 నుంచి అమ్మకాలు మొదలు పెట్టింది. ఏ వ్యాపారానికైనా ద్వితీయ విఘ్నం పనికిరాదు

అంటారు. అదే విధంగా ప్రభుత్వం తెరిచినా సారాయి దుకాణాలను అక్టోబర్ 2 వ తేదీన కూడా తెరిచి మద్యం విక్రయాలు జరుపుతారా లేదా అనేది తెలియాలి. అయితే అక్టోబర్ 2 గాంధీ

జయంతి కావడం, దేశ వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిషేధించారు. ప్రభుత్వం తన సారాయి వ్యాపారం వృద్ధి చెందాలి అంటే బుధవారం కూడా విక్రయాలు సాగించాలి. ఆలా సాగిస్తే

గాంధీ జయంతి రోజున ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేసింది అనే విమర్శలు ఘాటుగానే వస్తాయి. ఒక వేళా విక్రయాలు చెయ్యకపోతే ఇంత ఆర్భాటంగా మొదలు పెట్టిన విక్రయాలు

తుడిచి పెట్టుకు పోతాయ్ అనే నమ్మకం వ్యాపారస్తుల్లో ఉంది. 
ప్రభుత్వానికి ప్రధాన ఆర్ధిక వనరులు మద్యం విక్రయాలు, వినియోగాల వల్లనే అని తెలుస్తోంది. మరి ఈ

నమ్మకం నిజమని తేలితే ప్రభుత్వ మద్యం దుకాణాలు కేవలం మూడు రోజుల్లోనే మూతపడే అవకాశం ఉంది. ఇంతకీ ప్రభుత్వ అధినేతలకు ఈ ద్వితీయ విఘ్నం నమ్మకం ఉందొ లేదో తెలియదు.

వీళ్ళు కూట్టగా వ్యాపారం మొదలు పెట్టారు కదా, ఇలాంటి నీతులు, నమ్మకాలూ తెలుసుకోక పొతే ఎలా?

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam