DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోస్టింగ్ ల పేరిట దేవాదాయ శాఖలో భారీ దోపిడీ కి రంగం సిద్ధం

బదిలీల పేరిట కార్యాలయ అధికారి కుంభకోణం 

అనర్హులకు అందలం, గెజిటెడ్ అధికారికి భారీ ముడుపులు  

ఆలయ ఆస్తులు దోపిడీ:  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ భూములు, అనర్హులు

డబ్బులు 

కాగితాలు చూడకుండానే కమిషనర్ సంతకాలా? 

ఇక్కడే ఉంటె రూ. 30 వేలు, బదిలీలకు రూ. 60 వేలు 

రెండు రోజుల్లో బదిలీల ఆర్దర్లకు ఉత్తర్వులు సిద్ధం. .

.  . . .

మంత్రి కళ్ళు తెరవకుంటే దేవుని హుండీలు గుల్లే. . . ???

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . . .

విశాఖపట్నం, అక్టోబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌): బెల్లం చుట్టూ ఈగలు వెళతాయి

అన్నట్టుగానే ఉంది దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగుల తీరు. ఆదాయం తక్కువ ఉన్న ఆలయాలు, సంస్థల నుంచి ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు మరి అధికంగా డబ్బులు తినేందుకు

అడ్డగోలు మార్గాలను పట్టినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో వెలువడనున్న బదిలీ , పదోన్నతులు తదితర ఉత్తర్వుల్లో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది.

పూర్తిగా అక్రమార్కుల కనుసన్నల్లో సాగిన ఈ కధనం వెనుక భారీ మొత్తం లో నిధులు చేతులు మారినట్టు సమాచారం. దీని వెనుక కమిషనర్ కార్యాలయ అధికారి కీలక పాత్రధారిగా

నిలిచినట్టు తెలియవచ్చింది.  

 à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖలో భారీ కుంభకోణం వెలుగు లోకి వస్తోంది. à°ˆ కుంభకోణానికి ప్రధాన పాత్రధారి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం లోని à°’à°•

గెజిటెడ్ హోదా కల్గిన అధికారిగా తెలుస్తోంది. రాష్ట్రంలోని తక్కువ ఆదాయం వస్తున్న 6 ఏ , 6 బి, 6 సి ఆలయాల్లో తక్కువ జీతాలతో పనిచేస్తున్న కొందరు, అధిక ఆదాయం వస్తున్న

ఆలయాల్లో పోస్టింగ్ లు కోసం గొల్లపూడి లోని కమిషనర్ కార్యాలయం చుట్టూ కోర్టు పక్షుల్లా తిరుగుతూనే ఉన్నారు. దొంగ దారి లో ఎదో విధంగా అధిక ఆదాయం వచ్చే ఆలయాల్లో

పోస్టింగ్ ల కోసం వెంపర్లాడుతున్న వీళ్ళకి ఆయువు పట్టుగా దేవాదాయ శాఖలోని ఒక గెజిటెడ్ హోదా అధికారి తారసపడ్డాడు. దీంతో వీళ్ళని ఒక ఏటిఎం కార్డు మాదిరిగా

వాడుకునేందుకు సిద్ధపడిన అతను పోస్ట్ కో రేటు పెట్టేసి, లక్షల్లోనే ముడుపులు తీసుకునేందుకు బృహత్తర పధకం వేసేసారు. అయితే ఈ పధకం లో ఎంతమంది పడ్డారు అనేది

పోస్టింగుల్లో తేడాలొస్తే గానే బయట పడే అవకాశాలు తక్కువ. 

ఒకే హోదా కానీ. . . పిఆర్ సీల్లో నే భారీ వ్యత్యాసం :. . .

అధిక డబ్బుల కోసం ఉద్యోగులు, అదనపు ఆదాయం

కోసం అధికారి గూడు పుఠాణీ చేసి దేవాదాయ శాఖను పూర్తిగా బ్రష్టు పట్టించే పనిలో పడ్డారు. ప్రస్తుతం వీళ్ళు పనిచేస్తున్న ఆలయాల్లో ఉద్యోగులకి ఇచ్చే పిఆర్సీ ,

అధిక ఆదాయం వచ్చే ఆలయాల్లో ఇదే స్థాయి ఉద్యోగి కి ఇచ్చే పిఆర్సీ ల్లో చాలా వ్యత్యాసం ఉన్నట్టు తెలిసింది. దీంతో కొత్త పోస్టింగ్ ల కోసం కాళ్ళు అరిగే లా

గొల్లపూడి కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఈ అక్రమ అధికారిని ప్రసన్నం చేసుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఇన్ని అవస్థలు పడలేని వాళ్ళు మాత్రం తమకు వచ్చిన

అరకొర జీతంతో అదే ఆలయాల్లో కొనసాగుతున్నారు. 

ఈ అక్రమ అధికారి, తమకు బేరం కుదిరిన వాళ్ళ జాబితాను తయారు చేసి బదిలీలు / డిప్యూటేషన్ తరహా పై సంతకం కోసం కమిషనర్

కు పంపుతున్నారు. తయారు చేసింది గెజిటెడ్ అధికారి కదా అని కమిషనర్ ఆమోదించడం తో వీళ్ళ గూడు పుఠాణీ పారుతోంది. తద్వారా కొత్తగా నియామకాలు జరగవలసిన ఆలయాల్లో

పాతవాళ్లే పాతుకుపోయి, నియామకాలకు కూడా అడ్డుకట్ట వేస్తున్నట్టు తెలుస్తోంది. 

పైగా ఆలయాలను పూర్తి బ్రష్టు పట్టించే విధంగా వీళ్ళ అడ్డగోలు చర్యల

కారణంగా ఆలయాల్లో జరగవలసిన సాధారణ కార్యాచరణ పూర్తిగా ప్రక్కదారి పట్టింది. 

ఇక్కడే ఉంటె రూ. 30 వేలు, బదిలీలకు రూ. 60 వేలు: . . . 

ఈ బదిలీల ప్రకారం ఉన్నచోటే

పనిచేసే సిబ్బందికి 6 ఏ  à°®à°¾à°¤à±ƒà°¸à°‚స్థ ఉద్యోగులకు రూ.  30 వేలు  à°œà±€à°¤à°‚ వస్తుండగా, ఇతర ప్రాంతాల నుంచి అక్రమార్కుల బదిలీలో వచ్చిన వారికి , రూ.  50 వేలు నుంచి రూ. 60 వేలు జీతాలు

నిర్ణయిస్తూ కమిషనర్ ఆర్డర్ లు ఇచ్చేస్తున్నారు.   

కళ్ళముందు కాకరకాయ. . వెనక గుమ్మడికాయలే. :. . .

కళ్ళ ముందు నుంచి కాకరకాయలు చూసేవాడికి, వెనక నుంచి

గుమ్మడి కాయలు చోరీ అవుతున్న పట్టింపు ఉండదు అనేది కమిషనర్ వైఖరి లో నిజంగా తెలుస్తోంది. అందరికీ కనిపించే 2005 పి ఆర్ సి, 2010 పి ఆర్ సీ, 2015 పి ఆర్ సీ అని చూస్తున్నారు గానీ ,

 à°¡à±†à°ªà±à°¯à±‚టేషన్ మీద వచినవాడి 2005 prc  à°œà±€à°¤à°‚, మాతృసంస్థ లో వున్న 2015 పి ఆర్ సీ వాడి జీతం ఒక్క లాగానే  à°‰à°‚టున్నాయి అనే విషయాన్నీ కమిషనర్ గమనించలేకపోతున్నారు. 

పైరవీలు

చేసేవారికే పదోన్నతుల్లో  à°ªà±†à°¦à±à°¦ పీట. : . .

దేవాదాయ  à°¶à°¾à°–లో  à°ªà±ˆà°°à°µà±€à°²à±  à°šà±‡à°¸à±‡ వారికే పదోన్నతుల్లో పెద్ద పీట వేస్తున్నారన్నది బహిరంగ రాజస్యంగా మారిపోయింది.

ఇలాంటి వాళ్ళకే వారి మాతృసంస్థ  à°•à°¨à±à°¨à°¾ పెద్ద సంస్థలకు  à°Ÿà±à°°à°¾à°¨à±à°¸à±à°«à°°à±  à°…వుతారు, అలా చేయించుకున్నాక  à°…క్కడ నుండి ప్రమోషన్లు, పి ఆర్ సి లు  à°®à±à°¡à±à°ªà±à°² చలవతో

 à°œà°°à°¿à°—ిపోతాయి  

ప్రభుత్వం భూములు, సిబ్బంది హుండీ నిధులు: . . . 

ఆలయాల నిర్వహణకు దేవునికి నిత్యా దూప దీప నైవేద్యాలకు ఎందరో దాతలు ఉదారంగా విరాళం ఇచ్చిన

లక్షలాది ఎకరాలను ఇప్పడికీ వేలాదిమంది ఆక్రమించి, దోచుకోగా, ప్రసుతం వీటిని కాపాడవలసిన రాష్ట్ర ప్రభుత్వమే ఏకంగా ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం వీటిని

ఆక్రమించుకుని ప్రయత్నం లో ఉంది. అయితే ఇదే ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఏకంగా దేవుని హుండీలు ( వీళ్ళ జీతాలు హుండీల ఆదాయం నుంచే ఇస్తారు.) దోచుకోడానికి

సిద్దపడిపోయారు. 

దేవాదాయ శాఖ మంత్రి à°•à°¿ పట్టింపే లేదు : .. . . 

తన శాఖ కమిషనర్ ప్రధాన కార్యాలయం లో జరుగుతున్న కుంభకోణం పై సమాచారం ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు కు ఏ మాత్రం పట్టింపు లేకపోవడం గమనార్హం. ఉద్యోగులే మంత్రి ని కూడా ప్రక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పడికే చాలామందిని

దొంగదారి లో అడ్డగోలు బదిలీ చెయ్యడం ద్వారా అక్రమార్కుని భారీమొత్తం లోనే ముడుపులు అందినట్టు సమాచారం. ఈ భారీ కుంభ కోణం పై దేవాదాయ శాఖామంత్రి దృష్టి

సారించకపోతే దేవుని హుండీలు మొత్తం గుల్ల అయ్యే ప్రమాదం ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam