DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 న గరుడ సేవ :తిరుమల ఘాట్ రోడ్లపై బైక్ లు నిషేధం. . .

గరుడ సేవకు పోటెత్తనున్న భారీ భక్త జనం 

మొత్తం ఫుల్ టీమ్ తో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సేవకు హాజరు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . .

తిరుపతి, అక్టోబర్ 03,

2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల లో జరిగే ఉత్సవాల్లో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది, అందునా ఐదవ రోజు జరిగే గరుడ సేవకు సర్వ శ్రేష్ఠ ప్రాధాన్యత

ఉంటుంది. ప్రస్తుతం తిరుమల లో జరుగుతున్నా శ్రీనివాసుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ సేవ ఈ నెల 4 వ తేదీ ( శుక్రవారం) జరుగనుంది. ఈ శ్రీనివాసుని కోసం దివి నుంచి

భువికి వేంకటాద్రి ని తీసుకు వచ్చినవాడే గరుడుడు, ఆయనకే మరో పేరు గరుడాళ్వార్. అలాంటిది ఆయనే వాహనంగా శ్రీనివాసునికి తన పై ఎక్కించుకుని తిరుమల మాడ వీధుల్లో

సంచారం చేస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఈ అత్యద్భుత సేవను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమల కు తరలివస్తుంటారు.

అత్యంత రద్దీ గా ఉండే ఈ రోజున

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గురువారం రాత్రి (అక్టోబర్ 3 ) 11 గంటల నుంచి, శనివారం ( అక్టోబర్ 5 ) ఉదయం 8 గంటల వరకూ తిరుమల కొండ పైకి అలిపిరి టోల్ గెట్ ద్వారా

ద్విచక్ర వాహనాలను అనుమతించడంలేదు. అధిక సంఖ్యలో కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు తిరుమలకు చేరుకోవాల్సి యున్నందున,  à°¬à±ˆà°•à± లు, స్కూటర్లు, తదితర ద్విచక్ర

వాహనాలను ఈ సమయాల్లో అనుమతించడం లేదని టిటిడి ప్రకటించింది. ఈ మేరకు అలిపిరి టోల్ గేట్ వద్ద హోర్దింగ్ లు కూడా ప్రదర్శించారు. ఈ బైక్ లకు అలిపిరి వద్దే ఉచిత

పార్కింగ్ ఏర్పాటు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam