DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రికెటర్లన్నా, మీడియా అన్నా అనుమతి లేదా . . .

క్రికెట్ మ్యాచ్ రక్షణలో . . . . 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ పోలీసులు మితిమీరిన

వ్యవహారంతో   సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. విశాఖ లో టెస్ట్ మ్యాచ్ ఆడడం కోసం నగరానికి వచ్చిన భారత క్రికెట్ ( పురుషుల) జట్టు మ్యాచ్ అనంతరం

విమానాశ్రయానికి చేరుకున్న సందర్బంలో విశాఖ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై జట్టు నాయకుడు విరాట్ కోహ్లీ విశాఖ

పోలీసులను గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. వర్షం పడుతుండడంతో భారత్ జట్టును మూడవ నెంబర్ ప్లాటుఫారం పై ఆపడంతో తడిసి ముద్దయ్యారు. దీన్ని ముందుగానే

గమనించాల్సి యుండగా పోలీసులు విఫలం అయ్యారు. దీనిపై విశాఖ పోలీసులు ఇచ్చిన సమాధానంతో విరాట్ సంతృప్తి చెందినట్టు కనపడలేదు. 

మైదానంలోనూ ఇదే తీరు :  . .

.

విశాఖ పోలీసుల తీరు క్రికెట్ à°®à±ˆà°¦à°¾à°¨à°‚లోనూ శృతిమించింది. దక్షిణాఫ్రికా తో జరుగుతున్నా టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు బాటింగ్ చేస్తున్న సమయంలో à°’à°• అభిమాని

మైదానంలోకి వెళ్లడం తటస్తించింది. దీంతో మ్యాచ్ కు బందోబస్తు కోసం వినియోగించిన 900 మంది పోలీసులకు మైదానంలో ప్రేక్షకుల స్టాండ్ ల నుంచి గ్రౌండ్ ఎవ్వరినీ

రానివ్వద్దు అంటూ  à°à°•à°µà°¾à°•à±à°¯ ఆదేశాలు జరీ చేసేసారు విశాఖ పోలీసు అధికారులు. దీంతో తెలిసి తెలియక, అసలు క్రికెట్ అంటే ఏంటో, అక్కడ ఎవరెవరికి మైదానంలోకి వెళ్లే

పాస్ లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇస్తుందో కూడా పోలీసులకు తెలియదు. అయితే మైదానంలోకి  à°¬à±Œà°‚డరీకి దగ్గరకి మీడియా ఫొటోగ్రాఫర్లకు అనుమతి ఇస్తూ బి సి సి ఐ

కవరేజ్ పాస్ లను ఇచ్చింది. అసలు ఈ పాస్ విలువ ఏంటో తెలియని పోలీసు అధికారులు మీడియా ఫొటోగ్రాఫర్లను కూడా అడ్డుకున్నారు. బిసిసిఐ ఇచ్చిన కవరేజ్ పాస్ చూపించినా సరే

పోలీసులు మూర్ఖంగా వ్యవహరించడం చూపరులకు వింతగా అనిపించింది. దీనిపై విసుగెత్తిన మీడియా ప్రతినిధులు పోలీసుల విపరీత వైఖరి పై బిసిసిఐ కమిటీకి ఫిర్యాదు

చేసింది. 

మీడియా గేలరీ లో పోలీసులు :. . . .

మ్యాచ్ ను కవరేజ్ చెయ్యడం కొరకు కేవలం మీడియా ఫొటోగ్రాఫర్లకు మాత్రమే కేటాయించిన గేలరీ మొత్తం పోలీసులే

కూర్చోడం గమనార్హం. భద్రతా ఏర్పాట్లను చూడవలసిన పోలీసు సిబ్బంది మాత్రం భాద్యతలను విస్మరించి మ్యాచ్ ను వీక్షించడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam