DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కంటి వెలుగు

జిల్లాలో 6 లక్షల 15  à°µà±‡à°²à°®à°‚ది విద్యార్థులకు పరీక్ష 

మొత్తం స్కూళ్ళు 5268, రోజుకు 850 టీమ్ లు   

10 à°¨ గాజువాక లోని పాఠశాలలో ప్రారంభం 

స్వచ్చంద సంస్థలు,

ఆసుపత్రుల సహకారం 

విశాఖ జిల్లా వైద్యశాఖాధికారి తిరుపతిరావు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, అక్టోబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : విద్యార్థి దశ లో

కంటి దృష్టి సక్రమంగా ఉంటేనే విద్యార్థి విద్య పట్ల దృష్టి పెట్టగలదని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలోని విద్యార్థుల కంటి దృష్టిని పరీక్షించేందుకు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్

తిరుపతి రావు తెలిపారు. బుధవారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ  à°ˆ కార్యక్రమం లో భాగంగానే à°ˆ à°•à°‚à°Ÿà°¿ వెలుగు కార్యక్రమాన్ని

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10 న గురువారం ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విశాఖ జిల్లాలో ఈ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం గాజువాక లోని పాఠశాలలో

మొదలుపెడుతున్నట్టు తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు మొత్తం 5268 ఉంటాయని, వాటిల్లో 6 లక్షల 15 వేలమందికి పైగా చిన్నారులు విద్యాభ్యాసం

చేస్తున్నారన్నారు. వీరందరికీ ఈ నెల 10 నుంచి 16 వరకూ డాక్టర్ వై ఎస్ ఆర్ కంటివెలుగు కార్యక్రమం ద్వారా ప్రాధమిక కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 5268

వైద్య బృందాలను ఈ కంటి పరీక్షల కోసం నియమించినట్టు వివరించారు. ఈ బృందాల్లో ప్రతి రోజు 850 ప్రతి రోజు విధుల్లో ఉంటారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ

దశవారిగా పరీక్షలు జరుగుతాయన్నారు. à°ˆ వైద్య బృందంలో ఆశా సిబ్బంది, ఏ ఏన్ à°Žà°‚ , మండల ప్రాధమిక ఆరోగ్య అధికారి, తదితరులు ఉంటారన్నారు.  à°ªà±à°°à°¤à°¿  à°¬à±ƒà°‚దానికి à°’à°• à°•à°‚à°Ÿà°¿ వెలుగు

కిట్ ను అందింఛామని,  à°¦à°¾à°¨à°¿à°²à±‹ à°’à°• టార్చ్ లైట్, మెజరింగ్ టేప్, విజన్ బోర్డు, చార్ట్, ఉంటాయని, ప్రతి విద్యార్థికి à°Žà°¡à°® కన్ను, కుడి కన్ను కూడా పరిశీలించడం జరుగుతుందని

తెలిపారు.  
మొదటి దశలో ప్రాధమిక పరీక్షలు నిర్వహిస్తామని, తదుపరి దశలో అవసరమైన విద్యార్థులకు మందులు, చికిత్స పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.

విశాఖ జిల్లాలో జరుగుతున్నా ఈ వైద్య సహాయ కారితక్రమం లో జిల్లాకు చెందిన శంకర్ ఫౌండేషన్, ఎల్ వి ప్రసాద్, పుష్పగిరి, విశాఖ ఐ ఆసుపత్రి తదితర వైద్య సంస్థలకు చెందిన

బృందాలు సహకారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. 

ఆరోగ్య సిబ్బంది - ప్రాథమిక కంటి పరీక్షలకు సూచనలు : . . .
〰〰〰〰〰〰〰〰

1. బాగా వెలుతురుగా ఉన్న గదిని కంటి

పరీక్షల కొరకు ఎంపిక చేసుకోవాలి.

2. విజన్ కిట్ లోని 'E' చార్ట్ ను గదిలో / వరండాలో వెలుతురు ఉన్న వైపు ఉంచాలి.

3. 'E' చార్టుకు ఎదురుగా 3 మీటర్ల దూరమును విజన్ కిట్

లోని టేప్ సహాయముతో కొలిచి అక్కడ ఒక గుర్తును ఉంచాలి.

4. 'E' చార్ట్ నుంచి ఎదురుగా 3 మీటర్ల దూరములో ఉంచిన గుర్తు దగ్గర పాఠశాల విద్యార్థిని ఉంచి చూపు పరీక్షను

నిర్వహించాలి.

5. విద్యార్థి కంటి అద్దములు వాడుచున్నట్లయితే, కంటి అద్దములు ఉంచి చూపు పరీక్ష నిర్వహించాలి.

6. మొదట కుడి కంటిని, తరువాత ఎడమ కంటిని

వేరువేరుగా చూపు పరీక్ష నిర్వహించాలి.

7. కుడి కన్ను పరీక్ష చేయునప్పుడు, ఎడమ కన్ను మీద ఎటువంటి వత్తిడి కలుకుండా మూసి ఉంచాలి.

8. అలాగే ఎడమ కన్ను

పరీక్షచేయునప్పుడు, కుడి కన్ను మీద ఎటువంటి వత్తిడి కలుకుండా మూసి ఉంచాలి.

9. కుడి కన్ను, ఎడమ కన్ను వేరువేరుగా చూపు పరీక్ష కొరకు ఎదురుగా ఉన్న చార్ట్ లోని

ముందు వైపు ఉన్న పెద్ద “E” 4 అక్షరాలలో 3 అక్షరాలు, వెనుకవైపు ఉన్న చిన్న "E" 4 అక్షరాలలో 3 అక్షరాలు సక్రముగా చెప్పినచో చూపు బాగా ఉన్నట్టు, చెప్పకపోతే దృష్టిలోపము

ఉన్నట్టుగా గుర్తించాలి.

10. సక్రమంగా ఉంటే ప్రాథమిక కంటి పరీక్షపుస్తకంలో N - అని, చెప్పకపోతే AB అని నమోదు చేయవలెను.

11. తదుపరి ప్రతి విద్యార్థి కుడి, ఎడమ

కన్నులను టార్చిలైట్ సహాయముతో ఏమైనా లోపాలు (ఎరుపు, మెల్ల, కంటిపూత మొదలగునవి) కొరకు పరీక్షించాలి.

12. చూపు పరీక్షను, టార్చిలైట్ పరీక్షా వివరాలను మొదటి దశ -

విద్యార్థి మెడికల్ రికార్డు - (కార్డు) మీద నమోదు చేసి సంతకము చేసి పాఠశాల విద్యార్థి చేతికి ఇవ్వవలెను. సక్రమంగా ఉంటే ప్రాథమిక కంటి పరీక్షపుస్తకంలో N - అని,

చెప్పకపోతే AB అని నమోదు చేయవలెను.

13. పాఠశాల విద్యార్థి ని తదుపరి కంటి పరీక్షల కొరకు రిఫరల్ చేయబడినచో ఆ విషయాన్ని విద్యార్థికి తెలియచేయాలి.

14. ప్రాథమిక

కంటి పరీక్షల వివరాలను స్కూల్ స్క్రీనింగ్ రికార్డు - 1 (పుస్తకము) లో కూడా నమోదు చేయవలెను.

15. ఆశా స్కూలు పుస్తకము లోని వివరాలను, “వై యస్ ఆర్ à°•à°‚à°Ÿà°¿ వెలుగు"

ప్రత్యేక వెబ్ సైట్ ( http://drysrkv.ap.gov.in ) లో ప్రాథమిక / పట్టణ ఆరోగ్య కేంద్రంల లోని కంప్యూటర్ల ద్వారా యూసర్ id (user ID), పాస్ వర్డ్ (password) ల సహాయముతో సంబంధిత ఏ ఎన్ యం (ANM) జాగ్రత్తగా తప్పులు

లేకుండా నమోదు (upload) చేయాలి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam