DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయం ఆంధ్ర ప్రదేశ్ 

టాలెంట్ సెర్చ్ కోసం రాష్ట్ర వ్యాప్త క్రీడలు 

రాష్ట్ర క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ 

సీఎం కప్ ఫుట్ బాల్ పోటీల ప్రారంభం. .

.

మైదానం ఇవ్వండి - స్పోర్ట్స్ స్టార్స్ ని తయారు చేస్తాం 

క్రీడా ప్రముఖులకు సమ్మానం : . . .

విస్తృత ఏర్పాట్లు చేసాం: శాప్ ఇంచార్జి సూర్యారావు :. . .

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, అక్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయం à°—à°¾  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర నిలిచిందని రాష్ట్ర క్రీడలు,

పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విశాఖ నగరం లోని వైజాగ్ పోర్ట్ గోల్డెన్ జూబిలీ మైదానం లో జరిగిన సీఎం కప్ ఫుట్ బాల్ పోటీలను అయన

ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి

జిల్లాలోనూ ఒక క్రీడా అంశంలో పోటీలు నిర్వహిస్తున్నామని, వాటిల్లో విజేతలు గా నిలిచినా వారు అమరావతి లో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల అనంతరం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని ప్రకటించారు. ప్రతి క్రీడాకారుడు à°•à±à°°à±€à°¡à°¾ స్పూర్తితో కూడిన విజయం కోసం

పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలోనూ మైదానం ఉండాలని, అవకాశం లేని పాఠశాలలు సమీపంలోని ప్రభుత్వ మైదానాలు, కళాశాలల మైదానాలను వినియోగించుకుని, పిల్లలకు

క్రీడలను అలవాటు చెయ్యాలని సూచించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ,

అంతర్జాతీయ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్ ఖ్యాతిని పెంపొందిస్తున్న క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనన్నారు.

ఇటీవల షటిల్ బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తిని చాటి చెప్పిన పివి సింధు కు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారని, ఆమె త్వరలోనే విశాఖ వేదిక గా ఆమె

à°’à°• స్పోర్ట్స్ అకాడెమీ ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. 

అనంతరం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చాంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె. మీనాలతో కలిసి ఫుట్ బాల్ ను కిక్

చేసి పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఫుట్ బాల్ జట్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి, మంత్రి కి, ఇతర అతిధులకు స్వాగతం

పలికారు. à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ( శాప్ ) విశాఖపట్నం జిల్లా నివేదికను జిల్లా సంయుక్త కలెక్టర్ 2 ఎంవి సూర్య à°•à°³

తెలిపారు. 

మైదానాలు ఇవ్వండి - క్రీడారత్నాలు సిద్ధం చేస్తాం: . . 

ఆంధ్ర ప్రదేశ్ లో క్రీడా మైదానాలు తక్కువగా ఉన్నాయని, మైదానాలను ప్రభుత్వం

అందించగలిగితే తాము క్రీడా రత్నాలను తయారు చేస్తామని విశాఖపట్నం ఫుట్ బాల్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ రావు తెలిపారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో

ఎక్కడైనా క్రీడా పోటీలు నిర్వహించాలంటే మైదానాలను అద్దెకు తీసుకోవాల్సి ఉందన్నారు. అంత అద్దెలు భరించగలిగే ఆర్ధిక స్థితి క్రీడా సంఘాల వద్ద

లేదన్నారు. 

ఈ పోటీల ప్రారంభోత్సవ సభలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

సీనియర్ నేత, పార్టీ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

క్రీడా ప్రముఖులకు సమ్మానం : . .

.

సి ఎం కప్ ప్రారంభోత్సవ సభకు హాజరైన ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారులు నీలంశెట్టి లక్ష్మి (వెయిట్ లిఫ్టింగ్) , ఎం. వి మాణిక్యాలు (వెయిట్ లిఫ్టింగ్),

ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఐ. వెంకటేశ్వర రావు ( బాక్సింగ్)  à°²à°¨à± మంత్రి ముత్తంశెట్టి సమ్మానించారు. 

విస్తృత ఏర్పాట్లు చేసాం: శాప్ ఇంచార్జి సూర్యారావు :. .

.

సీఎం కప్ ఫుట్ బాల్ పోటీలను విశాఖ కేంద్రం గా విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అధారిటీ విశాఖపట్నం

ఇంచార్జి డి. సూర్య రావు తెలిపారు. గత వారం రోజులుగా అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ ల సహకారంతో ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ

క్రీడల్లో భాగంగా విశాఖ జిల్లా జట్లకు మంచి శిక్షణ కూడా అందించడం జరిగిందన్నారు. 

నెలకో చోట సీఎం కప్ పోటీలు :. . .

రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను

అభివృద్ధి పరిచేందుకు ప్రతి జిల్లాలోనూ పోటీలు నిర్వహిస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. 

ఆగస్టు లో : శ్రీకాకుళం జిల్లాలో

 à°µà°¾à°²à±€à°¬à°¾à°²à±, 
సెప్టెంబర్ లో : విజయనగరం జిల్లాలో ఖో ఖో 
అక్టోబర్ లో : విశాఖపట్నం జిల్లాలో ఫుట్ బాల్
నవంబర్ లో : పశ్చిమ గోదావరి జిల్లాలో త్రో బాల్
డిశంబర్ లో :

తూర్పు గోదావరి జిల్లాలో నెట్ బాల్
జనవరి 2020 లో : గుంటూరు జిల్లాలో హ్యాండ్ బాల్
ఫిబ్రవరి 2020 లో : ప్రకాశం జిల్లాలో కబడ్డీ
మార్చి 2020 లో : నెల్లూరు జిల్లాలో బాల్

బాడ్మింటన్ 
ఏప్రిల్ 2020 లో : చిత్తూర్ జిల్లాలో బాస్కెట్ బాల్
మే 2020 లో : అనంతపూర్ జిల్లాలో సాఫ్ట్ బాల్
జూన్ 2020 లో: కడప జిల్లాలో హాకీ
జులై 2020 లో : కర్నూల్ జిల్లాలో

సెపక్ తక్రా 
ఆగస్టు 2020 లో : కృష్ణ జిల్లాలో బేస్ బాల్ 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam