DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ రావాలంటే ఆ సంతకం తప్పనిసరి ??

త్వరలో కీలక శాఖల్లో..ప్రస్తుతానికి ఆర్థిక శాఖలో..

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : .. . 

అమరావతి,  à°…క్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో

అవినీతి రహిత పరిపాలనను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. నిధులు, బడ్జెట్ కేటాయింపుల

దుర్వినియోగాన్ని అరికట్టడానికి డిజిటల్ సంతకాల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ఆర్థిక శాఖలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ డిజిటల్ సంతకాల సత్ఫలితాలను ఇస్తుండటంతో..

మరికొన్ని కీలక శాఖలకు దీన్ని విస్తరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, విద్యుత్ వంటి భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న

శాఖల్లో డిజిటల్ సంతకాల వ్యవస్థను అమలు చేయొచ్చని తెలుస్తోంది. డిజిటల్ సంతకాల వ్యవస్థ ప్రస్తుతానికి ఆర్థిక శాఖలో అమల్లో ఉంటోంది.  à°¬à°¡à±à°œà±†à°Ÿà± విడుదలకు

సంబంధించిన జీవోలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు డిజిటల్ సంతకాలు చేస్తున్నారు.  à°¬à°¡à±à°œà±†à°Ÿà± కేటాయింపులకు సంబంధించిన ప్రతి జీవో మీద కూడా కుడివైపున ఆర్థిక శాఖ

ముఖ్య కార్యదర్శుల డిజిటల్ సంతకాలను నమోదు చేస్తున్నారు. చిన్న మొత్తం నుంచి వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను విడుదల చేసే జీవోలపై ముఖ్య కార్యదర్శులు సంతకాలు

చేస్తున్నారు. ముఖ్య కార్యదర్శులు కే వీ సత్యనారాయణ, షంషేర్ సింగ్ రావత్ సంతకాలతో ఆయా జీవోలు విడుదలవుతున్నాయి. ఏ శాఖకు సంబంధించిన నిధులను విడుదల చేయాల్సి

వచ్చినప్పటికీ.. à°† మొత్తం ఆర్థిక శాఖ నుంచే మంజూరు కావడం తప్పనిసరి.  à°®à±à°¨à±à°¸à°¿à°ªà°²à± శాఖ చాలా సందర్భాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుంటుంది. స్థానిక సంస్థల నిర్వహణ

అనేది స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. రాబట్టుకున్న పన్నులతోనే పాలనా పరమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. అలాగే- విద్యుత్ శాఖ కూడా. ప్రజల వద్ద నుంచి

ఛార్జీల రూపంలో రాబట్టుకున్న బిల్లులను విద్యుత్ కొనుగోళ్ల కోసం బదలాయిస్తుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు శాఖల్లో కూడా ఆర్థిక కార్యకలాపాల్లో

పారదర్శకతను తీసుకుని రావడానికి డిజిటల్ సంతకాల వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam