DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం చేయండి - నలుగురికి ప్రాణదానం చెయ్యండి : 

యువతకు శ్రీకాకుళం యస్.పి  à°…మ్మిరెడ్డి పిలుపు.

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . . .

శ్రీకాకుళం, అక్టోబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌):

శ్రీకాకుళం జిల్లాలోని పోలీసు సిబ్బందితో పాటు యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, తద్వారా నలుగురికి ప్రాణదానం చెయ్యాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్

పోలీస్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం

జరిగింది. ఈ కార్యక్రమానికి యస్.పి ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీసు సిబ్బందిని ఆయన

అభినందించారు. à°ˆ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ రక్తం కొరత ఎక్కువగా ఉందని, దాన్ని అధిగమించేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. పోలీసు

అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని సాయుధ పోలీసు బలగాలు (ఆర్మ్డురిజర్వ్ పోలీస్), ప్రత్యేక బృందాలు ( స్పెషల్ బ్రాంచ్ ), పోలీసు సిబ్బంది, హోమ్ గార్డ్స్

పాల్గొని రక్తదానం చేయడం సంతోషకరంగా ఉందన్నారు. అదేవిధంగా ఆటోడ్రైవర్లు, విద్యార్ధులు కూడా రక్తదాన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమని, ఇదే

స్పూర్తితో జిల్లాలోని ఆరోగ్యవంతులయిన యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని యస్.పి పిలుపునిచ్చారు.
        à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న à°¡à°¿.యస్.పి

ఎ.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రతీ రోజూ ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. బుధవారం రక్తదాన కార్యక్రమాన్ని

నిర్వహించడం జరిగిందని, ఇందులో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది , ఆటోడ్రైవర్లు, విద్యార్ధులు రక్తదానం చేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఇదేస్పూర్తితో

జిల్లాలోని ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు.
        à°ˆ కార్యక్రమంలో వైద్యులు à°¡à°¾.చిట్టిబాబు, రిమ్స్ వైద్యులు à°¡à°¾. శ్రీకాంత్, జిల్లా రెడ్ క్రాస్

సంస్థ సమన్వయకర్త పెంకి చైతన్యకుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది ప్రకాశ్, జగన్నాథం, పోలీసు అధికారులు, సిబ్బంది, ఆటోడ్రైవర్లు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam