DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయ సిబ్బంది భాద్యత మాదే : మంత్రి వెల్లంపల్లి 

బోటు బాధిత కుటుంబానికి కారుణ్య నియామకం 

గ్రేడ్ 3 ఈఓ గా రఘురామ్ సతీమణి కి ఉపాధి.

à°ˆ నియామకంతో  DNS వార్తకు పరిపూర్ణత . . . :

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) :  . . .

అమరావతి,  à°…క్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహించే వారందరూ ఒకే కుటుంబ సభ్యులుగా

భావిస్తున్నామని, వారందరి భాద్యత తమదేనని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గురువారం నర్సాపురం ఈఓ రఘురాం సతీమణి నాగ జ్యోతి కి గ్రేడ్ 3

ఈఓ గా కారుణ్య నియామకం ఉత్తర్వులను ఆయన అందించారు. గత నెల తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నం సమీపంలోని కచులూరు వద్ద మునిగిన పాపికొండలు పడవ ప్రమాదంలో అమరేశ్వర

స్వామి దేవాలయం ఈవో రఘురాం మరణించిన విషయం తెలిసిందే. విజయవాడ లోని పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణ వీధి లో మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ నియామక పత్రాన్ని

అందించారు. రాష్ట్ర ప్రభుత్వ నుంచి 10 లక్షల రూపాయల పరిహారాన్ని గతంలోనే  à°…ందజేశారని తెలిపారు. కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని, ఉపాధి కల్పనా ద్వారా వారి

కుటుంబానికి చేయూతగా ఉంటుందన్నారు. ఈ నియామకం పట్ల దేవాదాయ శాఖ యూనియన్ నాయకులు, ఏపీఎన్జీవో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్

పద్మ,  à°®à°°à°¿à°¯à± దేవాదాయ శాఖ యూనియన్ నాయకులు, ఏపీ ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.

à°ˆ నియామకంతో  DNS వార్తకు పరిపూర్ణత . . . :

సెప్టెంబర్ 15 న తూర్పు గోదావరి జిల్లా

పాపికొండలు పర్యాటక పడవ గోదావరి లో మునిగిన సందర్బంలో దేవాదాయ శాఖా ఉద్యోగి అమరేశ్వర స్వామి దేవాలయం ఈవో రఘురామ్ కూడా ఉన్నారని DNS న్యూస్ ఏజెన్సీ ప్రచురించిన

వార్తకు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి  à°µà±†à°‚టనే స్పందించడం జరిగింది. తక్షణం à°† ఈఓ కుటుంబానికి à°…à°‚à°¡à°—à°¾ నిలబడతామని, ప్రకటించి, రఘురాం మృతదేహాన్ని, కుటుంబ

సభ్యులకు చేర్చే వరకూ భాద్యత వహించాల్సిందిగా కాకినాడ డీసీ దుర్గాప్రసాద్ కు సూచించడం జరిగింది. తదుపరి రఘురాం సతీమణి నాగ జ్యోతికి ఉపాధి కల్పిస్తామని మంత్రి DNS

 à°•à± తెలియచేయడం జరిగింది. అయన ఇచ్చిన మాటకు గురువారం కార్యరూపం లభించడం తో DNS  à°ªà±à°°à°šà±à°°à°¿à°‚à°šà°¿à°¨ వార్తకు పరిపూర్ణత చేకూరింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam