DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్కడ ఉన్నవి 12 కౌంటర్లు  - పని చేసేవి నాలుగే  

మరో నాలుగు కౌంటర్లు తెరవాలి : ప్రయాణీకులు 

విశాఖ రైల్వే రిజర్వేర్షన్ కేంద్రంలో పెరుగుతున్న డిమాండ్. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం,

అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్నట్టు à°—à°¾ ఉంది విశాఖపట్నం రైల్వే రిజర్వేషన్ కేంద్రం పని తీరు. ప్రతి రోజు వందలాదిగా వివిధ గమ్య స్థానాలకై

టికెట్ల కోసం వచ్చే ప్రయాణీకులకు నిత్యం తిప్పలు తప్పడం లేదు. రైల్వే స్టేషన్ కు అతి సమీపం లోనే ఉన్న ఈ ప్రధాన కేంద్రం లో వివిధ రైళ్లకు రిజర్వేషన్ టికెట్లు

ఇచ్చేందుకు మొత్తం 12 కౌంటర్లు ఉండగా వాటిలో కేవలం 4 కౌంటర్లు మాత్రమే పనిచేస్తుండడం బాధాకరం. పైగా ఈ నాలుగింటిలోని ఒక కౌంటర్ లోనే (10 వ నెంబర్ కౌటర్) టికెట్

కాన్సలేషన్ కూడా చేసుకోవాల్సి రావడం దురదృష్టకరం. మొత్తం 12 కౌంటర్లలో ఒకటి విచారణ ( ఎంక్వైరీ), రెండవది టోకెన్ నెంబర్ ఇచ్చేవి కాగా మిగిలిన 10 కౌంటర్లలో కేవలం 4

పనిచేస్తుంటాయి. అత్యంత రద్దీగా ఉండే విశాఖ నుంచి నిత్యం వెలది మంది వివిధ గమ్య స్థానాలకు చేరుకునేందుకు రైల్వే టికెట్లు బుక్ చేస్తుంటారు. జనం అవసరాలకు

తగినట్టు à°—à°¾  à°Ÿà°¿à°•à±†à°Ÿà± కౌంటర్లు లేకపోవడంతో రోజు వచ్చే ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. మరో నాలుగు కౌంటర్లను కూడా తెరవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. 

à°’à°•

నిదర్శనం :

à°’à°• ప్రయాణీకుడు 23 -10 (అక్టోబర్)- 2019  à°•à±‹à°¸à°‚ టికెట్లు కోరుతూ రిజర్వేషన్కు దరఖాస్తు చేయగా, పూర్తి చార్జీలు చెల్లించడంతో అతనికి టికెట్ ఇచ్చారు. దానిపై

ముద్రించిన తేదీ లో 23 ఒక్కటే స్పష్టంగా ఉంది, మిగిలిన అంకెలు సరిగ్గా లేకపోవడం తో కౌంటర్లోని సిబ్బందిని సంప్రదించగా, ఆ టికెట్ పై ఉన్న తేదీ 23 -12 -2019 (డిసెంబర్ 23 కు) అని

చెప్పడం తో విస్తుపోవడం జరిగింది. దరఖాస్తు పై రాసిన తేదికి మారుగా సిబ్బందికి తోచిన తేదీ వెయ్యడంతో టికెట్ నష్టపోవడమే కాకుండా, తీవ్ర ఒత్తిడికి కూడా లోనవ్వడం

జరిగింది. 10 à°•à°¿ 12 కు ప్రింటింగ్ లో సక్రమంగా లేకపోవడం గమనార్హం.  

పైగా తప్పు ఎవరి ద్వారా జరిగినప్పటికీ, జరిగిన తప్పిదానికి టికెట్లో సగానికి పైగా డబ్బులు కోత

విధించారు.  à°ªà±à°°à°¿à°‚టర్ సరిగ్గా పనిచేయక పొతే ముందుగానే చూసుకోవాల్సిన భాద్యత రైల్వే సిబ్బంది పై ఉంది.  

పెరుగుతున్న డిమాండ్. . .:

గ్రేటర్ మహా నగరంగా మారి

దశాబ్దం గడుస్తున్నా విశాఖపట్నం కు కనీసం ఒక్క అదనపు సౌకర్యం కూడా పెరగక పోవడం గమనార్హం. పైగా ఇటీవలే విశాఖ నగరం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్

కూడా ఏర్పడింది. ఎక్కడైనా జోన్ ఏర్పడితే కొత్తగా రైళ్లు వస్తాయి, అదనంగా బెర్తులు పెరుగుతాయి. రైల్వే కౌంటర్లు పెరుగుతాయి. అయితే దీనికి భిన్నంగా విశాఖపట్నం లో

జోన్ ప్రకటన వచ్చాక ఉన్న కౌంటర్లు కూడా తగ్గించేస్తున్నారు. 

ఇదే కౌంటర్లలో తత్కాల్. .. 

ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ ఇచ్చే తత్కాల్ టికెట్లను

కూడా ఇవే నాలుగు కౌంటర్లలోనే అందిస్తుండడం అభినందనీయం. 

టచ్ స్క్రీన్ లో సమాచారం అంటే. . .  

రైళ్ల ల్లో బెర్ట్ ల సమాచారం కోసం ఇదే కేంద్రంలో ఏర్పాటు

చేసిన రెండు టచ్ స్క్రీన్ యంత్రాల్లో సమాచారం రాబట్టాలంటే అరగంటకు పైగా వేచియుండాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి. ఈ యంత్రాల మరమ్మత్తు చేసి సక్రమం గా

ఉంచకపోతే ఈమాత్రం కూడా పనిచేసే అవకాశం కూడా ఉండేలా కనపడడం లేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam