DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేత వస్త్రాలు వాడండి- చేనేత కార్మికులకు చేయుత నివ్వండి 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):  à°šà±‡à°¨à±‡à°¤ వస్త్రాలను ఆదరించి, చేనేత కార్మికులకు చేయూత

అందించాలని శ్రీకాకుళం జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్వో) ఎల్.రమేష్ పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రభుత్వ చేనేత సంస్థ కో - ఆప్టెక్స్ దీపావళి పండగ సందర్భంగా

నగరం లో 7రోడ్ జంక్షన్ వద్ద à°—à°² వై ఎస్ ఆర్ మునిసిపల్ కల్యాణ మండపంలో మెగా చేనేత వస్త్ర ప్రదర్శన శనివారం ప్రారంభమైంది.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ ముఖ్య అతిథిగా డిపిఆర్వో

రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపిఆర్వో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన కో - ఆప్టెక్స్ నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు

అందిస్తుందని అన్నారు . పండగ సమయంలో అధిక శాతం వస్త్రాలపై రిబేటును అందిస్తూ వినియోగదారుల ఆదరణను చూరగోంటుందని ఆయన పేర్కొన్నారు. వివిధ రకాల చీరలు, వస్త్రాలను

వినియోగదారులకు అందుబాటు ధరలకే అందిస్తున్న ఏకైక సంస్థ కో - ఆప్టెక్స్ అని అయన చెప్పారు . చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి , చేనేత కార్మికులకు ఆదరించాలని రమేష్

కోరారు. ఈ నెల 10 నుండి 27 వ తేదీ వరకు స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద నున్న వై ఎస్ ఆర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన ను అందరూ తిలకించాలని

పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు చేయూత నివ్వాలని కోరారు.

సంస్థ రీజినల్ మేనేజర్ (విజయవాడ) టి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ దీపావళి పండగ సందర్భంగా ఈ చేనేత

వస్త్ర ప్రదర్శన ప్రాంభించామన్నారు. 200 వరకు అన్ని నూతన వస్త్రాలపై రిబేట్ ఇవ్వబడుతుందని చెప్పారు . కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థ

ఉద్యోగులకు సులభమైన 6 వాయిదాలలో వడ్డీ లేకుండా అరువుపై విక్రయించే అవకాశం కల్పంచడం జరిగిందన్నారు. కొనుగోళుదారు ముందస్తుగా 6 చెక్కులు అందజేయాలని వివరించారు.

అంతే కాకుండా నెల వారి పొదుపు పథకం లో నెలకు రూ.300 నుండి రూ.3000 వరకు 11 నెలలు పథకం కూడా ఉందని తెలిపారు. ఈ పథకం ద్వారా కస్టమర్ కు 58 శాతం వరకు లాభం ఉంటుందని తెలిపారు.

వస్త్రాల విక్రయం ద్వారా వచ్చిన లాభంలో అధిక శాతం చేనేత కార్మికులకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు.

కో ఆప్టెక్స్ షోరూం మేనేజర్ పి. జె. ధనపాల్ మాట్లాడుతూ

సరికొత్త మోడల్ తో కంచి, అరని, సేలం, కోయంబత్తూర్ పట్టు చీరలు, కాటన్ చీరలు. 1000 బుటా చీరలు, సిల్క్ కాటన్ చీరలు, రెడీమేడ్ షర్ట్స్, లేటెస్ట్ దుప్పట్లు , బ్లాంకెట్స్, టవల్,

లుంగీలు, పంచెలు, పాకెట్ ధోతి, కార్పెట్స్ మొదలగు చేనేత వస్త్రాలను తగినంత స్టాక్ తో అందుబాటులో ఉంచామన్నారు. చేనేత కళాకారులకు, వినియోగదారులకు అవగహన

పెంపొందించేందుకు చేనేత వస్త్రాల పై చేనేత కళాకారుల ఫోటో ముద్రించామని తెలిపారు. శ్రీకాకుళం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని చేనేత కార్మికులకు చేయూత

నివ్వాలని కోరారు.

 à°ˆ కార్యక్రమం లో షోరూం ఎస్ à°Žà°‚. ఎస్ మహేష్, సంస్థ రిటైర్డ్ మేనేజర్ గణేశ్వరం బాబూరావు, మీనకేశ్వరరావు, ఉద్యోగులు మురళీ,వెంకటరావు,కళ్యాణి,

ఎస్ ఉమాపతి తదితరులు పాల్గున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam