DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రక్షణ లో  పోలీసుల సేవలు ఎనలేనివి

రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚).: . .  .

శ్రీకాకుళం, అక్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర

శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల సేవలు ఎనలేనివని  à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటంలో వారి

చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు. సోమవారం ఉదయం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ

కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి అనంతరం

పోలీసు అమరవీరుల స్ధూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని పెట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన

పోలీసు అమరవీరులకు గుర్తుగా దేశం యావత్తు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటుందని గుర్తుచేసారు. గతేడాది 292 మంది పోలీసులు దేశం కోసం వారి

ప్రాణాలను అర్పించారని అన్నారు. ప్రజల ప్రాణాలకు నిరంతరం రక్షకులుగా, సమాజ శాంతి భద్రతస్థాపనకు నిత్యసేవకులుగా పోలీసులు పనిచేస్తుంటారని,  à°®à°¾à°¤à±ƒà°­à±‚మి శ్రేయస్సు

కోసం పనిచేసే నిస్వార్ధ శ్రామికుడిగా వెలకట్టలేని త్యాగనిరతితో అహర్నిషలు విధులలో పోరాడి అసువులు బాసిన పోలీసు అమరవీరులకు  à°ˆ సందర్భంగా మంత్రి జోహార్లను

అర్పించారు.  à°¨à°¿à°¸à±à°µà°¾à°°à±à°§ త్యాగమూర్తులను స్మరించుకొని వారి ఆత్మశాంతికి నివాళులు అర్పిద్దామన్నారు. సమాజ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహ శక్తుల

చేతిలో తమ ప్రాణాలను తృణప్రాయంగా పరిత్యజించిన అమరులైన త్యాగమూర్తులను స్మరించుకుందామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థకు అత్యంత

ప్రాధాన్యతను ఇస్తుందని, à°ªà±‹à°²à±€à°¸à±à°²à°¨à± గౌరవిస్తూ , రాష్ట్ర ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

పోలీసుల పర్యవేక్షణలో   à°ˆ రాష్ట్రం అన్నిరకాలుగా  à°¸à±à°–ఃశాంతులతో ఉంటూ  à°¶à°¾à°‚తి భద్రతలను కాపాడాలనే ధ్యేయంతో గౌరవ ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతను కలిగిన

వ్యవస్థగా పోలీసు శాఖను గౌరవించడం జరుగుతుందని తెలిపారు.  గతంలో ఏనాడు లేని విధంగా పోలీసులకు వారాంతపు సెలవును ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని అన్నారు.

నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాటం చేసే పోలీసులకు వారంలో ఒకరోజు సెలవును ప్రకటిస్తే వారు మరింత పటిష్టంగా పనిచేయగలరనే సదుద్దేశ్యంతో వారాంతపు సెలవును

ప్రకటించడం జరిగిందని తెలిపారు. సమాజంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న పోలీసు వ్యవస్థకు చట్టబద్దత కల్పించడమే కాకుండా,  à°šà°Ÿà±à°Ÿà°¾à°²à°•à± ఎవరూ అతీతులు కారనే

విధంగా పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడం జరిగిందన్నారు. పోలీసులు చట్టాన్ని సంరక్షించడంలో వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి సహకరించవలసిన అవసరం ప్రతీ

పౌరుడికి, ప్రజాప్రతినిధులకు ఉందని గుర్తుచేసారు. చట్టం అన్నది వారి పర్యవేక్షణలో ఉండాలనేది తన అభిప్రాయమని,  à°¦à±€à°¨à°¿à°•à°¿ నూటికి నూరుపాళ్లు ఏకీభవించిన వ్యక్తి

తాను అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు.  à°ªà±‹à°²à±€à°¸à± అమరవీరుల

సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులందరకీ వందనాలు తెలుపుతూ వారి ఆత్మకు శాంతికలగాలని కోరుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం పోలీసు అమరవీరుల

వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు మరియు ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మంత్రి బహుమతులను, సర్టిఫికేట్లను పంపిణీచేసారు.

  
        జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆర్.ఎన్.అమ్మిరెడ్డి మాట్లాడుతూ  ప్రతీ ఏడాది అక్టోబర్ 15 నుండి 21 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించుకోవడం

జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. గత వారం రోజులుగా పోలీసు శాఖ నుండి అమరవీరుల

త్యాగాలను స్మరిస్తూ రకరకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. ఓపెన్ హౌస్, క్యాండిల్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణ,

ఆహారం, పండ్లు పంపిణీ, అన్నిరకాల క్రీడలను నిర్వహించామని చెప్పారు. ప్రజల్లో పోలీసుల త్యాగాలను తెలియజేసేందుకు ఒక ప్రయత్నం చేయడం జరిగిందని తెలిపారు. మన

జిల్లాలో గత ఏడాదిలో ఏడుగురు పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారన్నారు. వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా 292 మంది పోలీసులు ప్రాణత్యాగం చేసారని గుర్తుచేసారు. విధి నిర్వహణలో పోలీసులు ఎంతో క్లిష్టతరమైన బాధ్యతలను చేపడతారని, తమ వ్యక్తిగత జీవితాన్ని

ప్రక్కనబెట్టి సమాజ సేవకోసం పోలీసులు పనిచేస్తారని ,  à°† సందర్భంలో వారి ప్రాణాలను సైతం పణంగా పెడతారని ఆయన à°ˆ సందర్భంగా గుర్తుచేసారు. పోలీసుల జీవితం చాలా

కష్టతరమైందని, దీన్ని ప్రజలుకూడా గుర్తించాలని శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోమని, అయితే ప్రజలు,

ప్రజాప్రతినిధులు సహకారం ఇందుకు అవసరమని చెప్పారు. ప్రజల నుండి గట్టి సహకారం లేనిదే శాంతిభద్రతలు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా ఉండదని ఆయన స్పష్టం

చేసారు. జిల్లాలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, అన్నిరకాలుగా పోలీసుల విధి నిర్వహణలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి సహకారం బాగా ఉందన్నారు.  à°ˆ స్పూర్తితో

పోలీసు శాఖ మరిన్ని సేవలు అందించేందుకు సమాయత్తమై ఉందని ఆయన పేర్కొన్నారు.

        à°ˆ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి à°¡à°¾. కిల్లి కృపారాణి, మాజీ శాసనసభ్యులు

గుండ లక్ష్మీదేవి, నగరపాలక సంస్థ కమీషనర్ యం.గీత, అంధవరపు వరహా నరసింహం, జిల్లాకు చెందిన డి.యస్.పిలు, ఏ.ఎస్.పిలు, సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లు,

పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam