DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 10 కాల్స్

విశాఖ  à°¸à±à°ªà°‚దనకు 1472 దరఖాస్తులు :. . .

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, అక్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): సోమవారం కలెక్టరేట్లో

నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పదిమంది ఫోన్ ద్వారా అభ్యర్థనలు, ఫిర్యాదులు చేశారు. వారికి ఫోన్ లో విశాఖపట్నం

సంయుక్త కలెక్టర్ ( జెసి 2 ) à°Žà°®à±. వి. సూర్యకళ సమాధానాలిచ్చారు. నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామం నుండి నాగేశ్వరరావు ఫోన్ చేస్తూ తాను ఇంట్లో వ్యక్తిగత

మరుగుదొడ్డి నిర్మించుకున్నా నేటి వరకు సొమ్ము చెల్లింపు చేయలేదని ఫిర్యాదు చేశారు. రోలుగుంట మండలం బుచ్చం పేట గ్రామం నుండి పోతురాజు నాయుడు ఫోన్ చేస్తూ తమ

గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఒకే గదిలో నడుస్తున్నదని మిగిలిన తరగతులు చెట్ల కింద జరుగుతున్నాయని వెంటనే కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. విశాఖపట్నం నుండి

గిరిబాబు మాట్లాడుతూ తాను పెట్రోల్ బంక్ లైసెన్స్ కి దరఖాస్తు చేసుకున్నానని ఎన్ ఓ సి కొరకు కలెక్టరేట్లోని సి సెక్షన్ లో పెండింగ్ లో ఉందని త్వరగా మంజూరు

చేయవలసిందిగా కోరారు. నర్సీపట్నం నుండి శివ నారాయణ రాజు ఫోన్ చేసి మున్సిపాలిటీలో నిబంధనలు పాటించడం లేదని, సుప్రీంకోర్టు నిబంధనలు బేఖాతరు చేస్తూ చెరువు

పోరంబోకులో భవనాలు నిర్మిస్తున్నారని, పట్నం లోని బైపాస్ రోడ్డు ను ఆక్రమిస్తూ భవనాలు ఉన్నాయని అందువలన ట్రాఫిక్ జామ్ అవుతుందని ఫిర్యాదులు చేశారు. విశాఖపట్నం 18

వార్డు నుండి కె వి ఎన్ జి మూర్తి ఫోన్ చేస్తూ తమ వార్డులోని కమ్యూనిటీ హాలు చేపల బజారు ప్రాంతంలో పారిశుద్ధ్యం సరిగా లేదని సిరిపురం దత్త్ ఐల్యాండ్ వద్ద రోడ్డు

గోతులు పడి ఉన్నదని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

విశాఖ  à°¸à±à°ªà°‚దనకు 1472 దరఖాస్తులు :. . .

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన

కార్యక్రమానికి 1,472 దరఖాస్తులు వీడియో వచ్చాయి.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను  à°µà°¿à°¨à±à°¨à°µà°¿à°‚చుకున్నారు. కొంతమంది ఫిర్యాదులను కూడా

అందజేశారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం జెసి 2 à°Žà°‚. వి. సూర్యకళ,  à°œà°¿à°²à±à°²à°¾ రెవెన్యూ అధికారి à°Žà°‚.శ్రీదేవి, కె ఆర్ సి సి ఉప కలెక్టర్ రంగయ్య, భూ సంరక్షణ ఉప కలెక్టర్ శ్రీనివాస మూర్తి

ప్రజల నుండి దరఖాస్తులు ఫిర్యాదులు స్వీకరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam