DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాయల్‌ వశిష్ఠ బోటు బోర్డు తో సహా పైకప్పు వెలికితీత

గోదారి నీటి అడుగున విశాఖ à°—à°œ ఈతగాళ్లు విస్తృత తనిఖీలు  

ఆపరేషన్ ముగిసే వరకూ ఆపేది లేదు : ధర్మాడి బృందం  

ధవళేశ్వరం దగ్గర మరో మృత దేహం లభ్యం. 

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°…క్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ సెప్టెంబర్ 15 à°¨ తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరినదిలో

మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీతలో పురోగతి సాధించారు. సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. విశాఖ నుంచి వచ్చిన

దీప్తి అండర్ వాటర్ సర్వీసెస్ సభ్యులు పదిమంది సాహసోపేతంగా రంగంలోకి దిగారు. ఇద్దరు గజ ఈతగాళ్లు ( స్వామీ, నాగరాజు) నదీ అడుగుభాగంలోకి వెళ్లి ఆదివారం నుంచి

విస్తృత తనిఖీలు చేపట్టారు. 

రెండు రోప్‌లను మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో కొంత పురోగతి సాధించారు. నీటిలో

మునిగిపోవడంతో బోటు ముక్కలు ముక్కలుగా బయటకు వస్తోంది. సోమవారం బోటు పై భాగం విరిగి పోయి, డ్రైవింగ్ కేబిన్ విడిగా రావడం జరిగింది.  à°—à°œ ఈతగాళ్లు బోట్ ను వెలికి

తీసే ప్రయత్నం బోటు కదులుతుండడంతో అడుగున ఉన్న మృత దేహాల్లో మరొకటి సోమవారం ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు చేరుకుంది. 

సుడిగుండాలు లేకపోవడం.. గోదావరి

నీటిమట్టం 38-40 అడుగుల స్థాయిలోనే ఉండటంతో బోటును వెలికితీసేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా ఐదోరోజు నీటిమట్టం తగ్గడం అనుకూలించింది. రాయల్‌

వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన à°“à°‚ శివశక్తి అండర్‌ వాటర్‌

సర్వీసెస్‌కు చెందిన పది మంది డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. దాదాపు 15

నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో

పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు. ఇలా 6 సార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు

అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ విలేకర్లకు తెలిపారు. నదిలో బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే, వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam