DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రుణాలతో ఆర్ధిక స్వావలంబన సాధించాలి – కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à±à°£à°¾à°²à°¨à± పొంది ఆర్ధిక స్వావలంబన సాధించాలని శ్రీకాకుళం

జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సన్ రైజ్ హోటల్ లో లీడ్ బ్యాంకు నేతృత్వంలో అన్ని వాణిజ్య బ్యాంకుల ఆధ్వర్యంలో  à°–ాతాదారుల సేవా మహోత్సవం

గురు వారం జరిగింది. భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆర్థిక సేవా విభాగం ఆదేశాలు మేరకు సేవా మహోత్సవాలను బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో

జిల్లా కలెక్టర్ నివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఖాతాదారుల సేవా మహోత్సవంలో గృహ, వాహన,

వ్యాపార, వ్యక్తిగత, చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రుణాలు పొందవచ్చని అన్నారు. రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుటుంబాలు ఆర్ధికంగా అభివృద్ధి

సాధించాలని అందుకు రుణాలను మంచి కార్యక్రమాలకు పెట్టుబడిగా పెట్టాలని సూచించారు. సంఘంగా ఉంటే బలమని,  à°¦à±‡à°¨à°¿à°¨à±ˆà°¨à°¾ సాదించగలిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రుణాలపై అవగాహన పెంచుకొని, అందుకు అనుగుణంగా రుణాలు పొందాలని అన్నారు. జిల్లాలో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలలో 98 శాతం తిరిగి చెల్లింపు జరుగుతుందని

చెప్పారు. జిల్లాలో డ్వాక్రా సంఘాలు అత్యధికంగా రూ.7.50 లక్షలు మాత్రమే ఋణంగా పొందారని, ఇతర ప్రాంతాల్లో రూ.20 లక్షల వరకు ఒక సంఘం తీసుకున్న సంఘటనలు ఉన్నాయని ఆ

స్ధాయికి చేరుకోవాలని కోరారు. మంచి ప్రణాళికలు రూపొందించి సమాజ హిత కార్యక్రమాలు చేపట్టాలని, సంఘాలు ఆర్ధికంగా బలోపేతం కావాలని అన్నారు. ఎక్కువ మందికి

బ్యాంకులు రుణాలు అందించాలని బ్యాంకులను కోరారు. డ్వాక్రా వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదం చేయాలని అన్నారు. రైతు భరోసా మొత్తాలను ఆయా వ్యక్తులకు గల రుణాలకు జమ

చేయరాదని, దీనిపై ప్రభుత్వం నిర్దిష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయక కార్యక్రమాల క్రింద బి.సి, ఎస్.సి, కాపు తదితర కార్పొరేషన్ ల

పరిధిలో మంజూరు చేసిన యూనిట్లను తక్షణం ప్రారంభించడానికి చేయూత ఇవ్వాలని అన్నారు. ఖాతాదారుల బాంక్ ఖాతాలు ఆక్టివ్ à°—à°¾ లేకపోవడంతో  à°°à±ˆà°¤à± భరోసా సొమ్ము కొంత మంది

రైతులకు జమ కాలేదని వాటిని ఆక్టీవ్ చేయాలని కోరారు. రైతులు బ్యాంకుల వద్దకు వెళ్ళి తమ ఖాతాలను సరిచేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ కన్వీనర్

మరియు ఆంధ్రా బ్యాంకు సర్కిల్ జనరల్ మేనేజర్ కె. వి.నాంచారయ్య మాట్లాడుతూ ఖాతాదారులు బ్యాంకులకు వచ్చేవారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాతాదారుల వద్దకు బ్యాంకులు

వెళుతున్నాయన్నారు. ఖాతాదారుల ఆర్థిక అవసరాలు తీర్చి వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. రుణాలు తీసుకుని సక్రమంగా

తిరిగి చెల్లింపులు చేసి మరో లబ్దిదారు ప్రయోజనం పొందుటకు సహకరించాలని కోరారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రా బాంక్ జోనల్

మేనేజర్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ ఖాతాదారుల సేవా మహోత్సవాలను మొదటి దఫాలో దేశంలో 250 జిల్లాల్లో జరుపుతున్నారని, 2వ దశలో 150 జిల్లాల్లో జరుపుతున్నారని చెప్పారు. మొదటి

దశలో శ్రీకాకుళం జిల్లా ఉందని చెప్పారు. శ్రీకాకుళంలో జరుగుతున్న సేవా మహోత్సవాలలో  à°…న్ని బ్యాంకుల సమన్వయంతో రూ.309 కోట్ల రుణాల పంపిణీకి నిర్ణయించడం

జరిగిందన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో సైతం నిర్వహించుటకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ఈ సందర్భంగా ఖాతాదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఆంధ్రా

బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, డిసిసిబి తదితర 25 బ్యాంకులు తమ కౌంటర్లను ఏర్పాటు చేసి ఖాతాదారులకు సేవలను అందించాయి.

à°ˆ

కార్యక్రమంలో ఎస్బిఐ జనరల్ మేనేజర్ బివిఎస్కెటి భాస్కర్, ఏపిజివిబి ఛైర్మన్ కె. ప్రవీణ్ కుమార్, కెనరా బాంక్ జనరల్ మేనేజర్ డివి ప్రసాద రావు, యూనియన్ బ్యాంక్

డెప్యూటీ రీజినల్ హెడ్ కిన్నెర నారాయణ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏజిఎం శైలేంద్ర కుమార్ సింగ్, డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఙివిబిడి హరి

ప్రసాద్, డిసిసిబి సిఇఓ à°¡à°¿.సత్యనారాయణ, ఎస్.బి.ఐ రీజినల్ మేనేజర్ ఏ.తేజోమయి అరవింద్, నాబార్డ్ ఏజిఎం మిలింద్  à°¸à±‹à°µà°²à±à°•à°°à±,  à°µà°¿à°µà°¿à°§ బ్యాంకుల పర్యవేక్షణ అధికారులు,

ఖాతాదారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam