DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాంభట్ల పార్వతీశ్వర శర్మకు అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం

నవంబర్ 2 నుంచి తెలుగు సాహితీ సదస్సు.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహణలో. . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) :

విశాఖనగరానికి చెందిన యువ సాహితీ వేత్త, యువ శతావధాని, అవధాన భీమ, అవధాన సుధాకర, అవధాన భారతి డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ కు అమెరికా తెలుగు సాహితీ సంఘాలు

ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రముఖ సాహితీ వేత్త వంగూరి చిట్టెన్ రాజు నేతృత్వం లోని అమెరికా తెలుగుసంఘాలు ఆహ్వానం పలికాయి. దొరకునా ఇటువంటి సేవా! పేరిట వంగూరి

ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఓర్లాండో మహానగర తెలుగు సంఘం సంయుక్త నిర్వహణలో నవంబర్ 2-3, 2019 తేదీలలొ ఓర్లాండో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్టు వంగూరి

చిట్టెం రాజు తెలియచేస్తున్నారు .  సదస్సు లో పాల్గొనేందుకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు  

ఈ సదస్సు గురించి క్లుప్తంగా:
1. ఫ్లారిడా రాష్త్రంలో, అందునా

ఓర్లాండో మహా నగరం లో కేవలం తెలుగు భాషా, సాహిత్యాలకి మాత్రమే పెద్ద పీట వేసి రెండు రోజుల పాటు నిర్వహించబడే జాతీయ స్థాయి సాహిత్య సాహితీ సదస్సు.

2. మొట్టమొదటి

సారిగా అమెరికా వస్తున్న  యువ శతావధాని, అవధాన భీమ, అవధాన సుధాకర, అవధాన భారతి బిరుదాంకితులు à°¡à°¾. రాంభట్ల పార్వతీశ్వర శర్మ (విశాఖ పట్నం), ప్రముఖ రచయిత, బ్లాగర్,

పత్రికా సంపాదకురాలు, ధారావాహికల రచయిత్రి, తెలంగాణా వంటల మీద దేశవ్యాప్తంగా గుర్తింపు, తెలంగాణాలో బహుశా ఏకైక మహిళా ప్రచురణ కర్త గా తెలంగాణ ప్రభుత్వపు

విశిష్టమహిళ 2019 పురస్కార గ్రహీత  జ్యోతి వలబోజు , మరొక  ప్రముఖ భారత దేశ సాహితీ వేత్తలు మా ఆహ్వానిత అతిధులుగా ఓర్లాండో విచ్చేస్తున్నారు.  

3.  ఫ్లారిడా నలుమూలల

నుండే కాక అనేక మంది టెక్సస్, ఇలినాయ్, మేసచ్యుసెట్స్, మిస్సోరి, కాలిఫోర్నియా, ఒహాయో, సౌత్ కెరొలైనా, మిషిగన్, న్యూ జెర్శీ మొదలైన ఇతర రాష్త్రాల అమెరికా రచయితలు,

సాహితీవేత్తలు మా ఆహ్వానాన్ని మన్నించి à°ˆ సదస్సులో పాల్గొంటున్నారు. అనేక మంది  ఔత్సాహిక యువ రచయితలు à°ˆ సదస్సులో పాల్గొనడం à°’à°• ప్రత్యేకత.  

3. అమెరికాలో

అత్యధిక సంఖ్యలో కథలు వ్రాసిన ప్రముఖ అమెరికా సాహితీ వేత్త సత్యం మందపాటి & విమల (ఆస్టిన్) దంపతులకి జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది.

4. అమెరికా

తెలుగు కథానిక -14వ సంకలనంతో సహా 9 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి తాజా ప్రచురణలు, ఇతర సంస్థల ప్రచురణలు 8, అయ్యప్ప స్వామి మధురగీతాల CD ఆవిష్కరించబడతాయి.

5.

ఓర్లాండో లో బాలబాలికలకి స్వఛ్చందంగా తెలుగు నేర్పుతున్న ఉపాధ్యాయులకి గౌరవ సత్కారం జరుగుతుంది.

వక్తలకి ప్రత్యేక ఆహ్వానం

6. నవంబర్ 2, 2019 సాయంత్రం

ఓర్లాండో నగర వాసులకి “12à°µ ఘంటసాల ఆరాధనోత్సవాలు-9à°µ బాలూ సంగీతోత్సవం” సినీ సంగీత విభావరి ఉచిత కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన గాయనీ గాయకులు “అపర ఘంటసాల తాతా బాల

కామేశ్వర రావు (హైదరాబాద్), శారద ఆకునూరి (హ్యూస్టన్), సత్య కడాలి (కొలంబియా, S.C).

à°ˆ సదస్సులో ఉత్సాహంగా పాల్గొని, వారికి  నచ్చిన సాహిత్యపరమైన అంశం మీద ప్రసంగించమని

వక్తలని కోరుతున్నారు .   మీ ప్రసంగ మకుటం, సంక్షిప్త వ్యాసం మాకు అందవలసిన ఆఖరి తేదీ: October 30, 2019.

అలాగే స్వీయ రచనా విభాగం లో మీ కవితలని సభాముఖంగా వినిపించి

ఆనందించమని కవులని కోరుతున్నారు.

ప్రతినిధులకి ప్రోత్సాహకాలు : ఈ 11వ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు అందరికీ ఈ క్రింది ప్రోత్సాహకాలు అందించనున్నారు

.

రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం ఫలహరం, మధ్యాహ్న భోజనం, కనీసం $200 విలువ చేసే సరి కొత్త తెలుగు పుస్తకాలు, సుమారు 30 ఉన్నత స్థాయి సాహిత్య ప్రసంగాలు, లబ్ధప్రతిష్టులైన

అంతర్జాతీయ గాయనీగాయకుల మూడు గంటల సినీ సంగీత విభావరి, అన్నింటినీ మించి రెండు రోజుల ఆత్మీయ తెలుగు వాతావరణం లో కలకాలం గుర్తుంచుకునే సాహితీ విందు.

 

ప్రవేశ రుసుము : సదస్సు నిర్వహిస్తున్న ఫ్లారిడా ప్రతినిధులకి ఒక్కొక్కరికీ కేవలం $50. ఇతర రాష్ట్రాల వారికి అంతా ఉచితమే.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam