DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టపాసులు అక్రమంగా విక్రయించవద్దు : ఎస్పీ నవదీప్ సింగ్

(DNS రిపోర్ట్ : రాజా పి , Bureau, కరస్పాండెంట్ ,  అమరావతి)

అమరావతి , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ గోదావరీ జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ IPS వారు జిల్లాలో

అక్రమంగా టపాసులు విక్రయిస్తే చట్ట ప్రకారం à°•à° à°¿à°¨  చర్యలు తప్పవని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరీ జిల్లా   ప్రజల అందరికి ముందుగా  దీపావళి పండుగా శుభాకాంక్షలు 

ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలుపుచు జిల్లా లో  బాణసంచా విక్రయ లైసెన్స్ కల్గిన దుకాణదారులు మాత్రమే అమ్మాలని. మిగితా ఎవరు విక్రయించినా చట్ట

వ్యతిరేఖమేనన్నారు. దీపావళి పురస్కరించుకుని లైసెన్స్ కల్గిన దుకాణదారులు పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి ఎస్పీ గారు మాటలాడుతూ,  ప్రజల భద్రత, శ్రేయస్సు

ముఖ్యం, శాశ్వత & తాత్కాలిక లైసెన్సు కల్గిన దుకాణాల్లో మాత్రమే బాణసంచా అమ్మాలి. తాత్కాలిక లైసెన్సుదారులు బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక

షెడ్డులలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. నియమ నిబంధనలు  పక్కాగా పాటించాలి. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో

సిద్ధంగా ఉంచుకోవాలి. à°† పరిసరాల్లో ఏమి చేయాలో. ఏమి చేయకూడదో తగు సూచనలు చేస్తూ బోర్డులను ప్రదర్శనలో ఉంచాలి. 18 సంవత్సరాలలోపు  పిల్లలను విక్రయాల పనుల్లో

ఉంచుకోరాదు. ప్రజలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
   దీపావళి పర్వదినం జిల్లా ప్రజలు అందరూ ఆనందంగా కుటుంభ సబ్యాలుతో 

జరుపుకోవాలని. టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పట్ల తల్లి తండ్రులు  అప్రమత్తంగా ఉండాలి. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు

టపాసులు కాల్చాలి. ఇళ్లలోపల కాకుండా బయట ఖాళీ ప్రదేశాల్లో బాణసంచా కాల్చాలి. తారాజువ్వల్లాంటి  టపాసులను భాహిరంగా ప్రదేశాలలో,  గడ్డి వాములు, గుడిసెలు, పెట్రోలు

బంకులు వద్ద కాల్చరాదు. విద్యుత్ తీగలు, చెట్లు కిందన  కాలిస్తే ప్రమాదం జరిగే వీలుంది. బాణసంచా కాల్చేటప్పుడు సింథటిక్ దుస్తులు కాకుండా తేలికైన కాటన్

దుస్తులు ధరించాలి. సరదా కోసం చేతులతో పట్టుకుని టపాసులు కాల్చరాదు. బాణసంచాను దీపాలు, లాంతర్లు దగ్గర ఉంచరాదు. వంట గది కిటికీలు మూసేయాలి. అగ్గిపెట్టె, లైటర్ల

దగ్గర టపాసులు ఉంచరాదు.
బాణసంచా కాల్చేటప్పుడు పొడగాటి అగరబత్తులు, కొవ్వొత్తుల ద్వారానే కాల్చాలి. రెండు బకెట్ల నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. సగం కాలిన,

ఆరిపోయిన టపాసులను తిరిగి కాల్చే ప్రయత్నం చేయరాదు. జిల్లాలో ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా. అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ - 100 లేదా జిల్లా

పోలీస్ వ్యాట్సాప్ నంబర్ 9550351100 కు సమాచారం చేరవేయాలి. బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారాన్నిచేరవేసిన వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం అని ఐ పత్రకా

ప్రకటన జిల్లా యస్.పి తెలియపర్చినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam