DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆకలి తీర్చడం మహోన్నత కార్యక్రమం: డిపిఆర్ఓ రమేష్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): ఆకలిలో అలమటించే వారిపట్ల సమాజం ప్రత్యేక దృష్టి కలిగి ఉండాలని

శ్రీకాకుళం జిల్లా పౌరసంబంధాల అధికారి (డిపిఆర్ఓ) ఎల్.రమేష్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆశయాల్లో ఒకైటన ఆకలితో ఉన్నవారికి ఆహారం (ఫీడ్ ద హంగర్) కార్యక్రమం క్రింద

లయన్స్ క్లబ్ కార్యదర్శి నారా ఈశ్వర రావు జన్మ దినోత్సవం సందర్భంగా చంపాగల్లీ వీధిలోగల నగరపాలక సంస్ధ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్ధులకు శుక్ర వారం మద్యాహ్నం

భోజనాలను అందించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ పాల్గొన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం మహోన్నతమైన కార్యక్రమం అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని

పేర్కొంటూ ప్రపంచ వ్యాప్తంగా రోజుకు టన్నుల కొద్ది ఆహారాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు. కోట్లాను మంది ఆకలితో అలమటిస్తున్నారని వృధాను నివారించి వారికి

ఆహారాన్ని అందించడం వలన ఒక జీవితం నిలబడుతుందని పేర్కొన్నారు. జీవరాశికి ఆహారం తీసుకోవడం జీవనంల ప్రధాన భాగమని ఆహారం లేనపుడు కలిగే అనర్ధాలను అందరూ

గుర్తేరగాలని అన్నారు. ఈశ్వర రావు జన్మ దినోత్సవం సందర్భంగా పేద పిల్లలకు ఆహారం అందించడం సంతోషకమరని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలను జన్మ దినోత్సవం లేదా ఇతర

శుభ దినోత్సవాలలో పాటించి పేదల కడుపు నింపడానికి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన కోరారు. లయన్స్ క్లబ్ మంచి సేవా నిరతి కలిగిన సంస్ధ అని సమాజ హిత కార్యక్రమాలు

చేపట్టడం జరుగుతుందని అన్నారు. 
    à°²à°¯à°¨à±à°¸à± అధ్యక్షులు నటుకుల మోహన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పేద

పిల్లలకు ఆహారాన్ని అందించడంలో కలిగే సంతృప్తి భిన్నంగా ఉంటుందని అందులో భాగంగా పాఠశాల విద్యార్ధులకు, ఇతర పేదలకు ఆహారాన్ని అందించుటకు సంకల్పించామన్నారు.

రానున్న రోజుల్లో మరిన్ని కారక్రమాలు చేపట్టుటకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
    à°ˆ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నారా ఈశ్వర రావు, ఆయన కుటుంబ

సభ్యులు, లయన్స్ సభ్యులు డా.కృష్ణ మోహన్, జి.బి.శ్రీనివాస రావు, బ్లు ఎర్త్ గోపి, పొన్నాడ రవి కుమార్, పేర్ల ఉమా శంకర రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి,

ఉపాధ్యాయులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam