DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో ఒక స్ట్రింగర్ విలేకరి ఆదాయం రోజుకు లక్ష .  

టిటిడి ని తప్పుదారి పట్టించే మీడియా పై వేటు. . .

తిరుమల పై మీడియా తాట తీస్తున్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ 

అవకాశాన్ని అలుసుగా తీసుకుంటే ఆట కట్టిస్తాం :

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ 

టికెట్ల కుంభకోణంలో మీడియాదే అగ్ర తాంబూలం 

à°—à°¤ జేఈఓ అండతో విచ్చల విడిగా వ్యాపారం . . 

కోట్లు à°—à°¡à°¿à°‚à°šà°¿à°¨ మీడియా నేతల పై పూర్తి ఆరా 

(DNS

రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి) : . . .

తిరుపతి, అక్టోబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రవ్యాప్తంగా చాలా మీడియా సంస్థల్లో జీతాలే ఇవ్వని పరిస్థితుల్లో తిరుమల

లో ఒక స్ట్రింగర్ విలేకరి ఆదాయం రోజుకు లక్ష అంటే యావత్ మీడియా లోకం తో సహా టిటిడి సైతం అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఉంది అంటే

అతనేదో ఆ సంస్థ అధిపతో, భాగస్వామే కాదు. సాధారణ స్ట్రింగర్. ఇదే హోదా లో ఇతర ప్రాంతాల్లో పనిచేసే వారికి నెలకు ఆదాయం కనీసం మూడు వేలు దాటదు. ఆదాయం లో ఈ విలేకరి

సాక్షాతూ శ్రీవారితోనే పోటీ పడుతున్నట్టు à°—à°¾ తెలుస్తోంది.  

వివరాల్లోకి వెళితే. . .

 à°ªà±à°°à°®à±à°– హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానములలో

జరుగుతున్న అక్రమాలు, టికెట్ల విక్రయ కుంభకోణాల్లో మీడియా పాత్ర ఉండడంతో కొరడా జుళిపిస్తోంది. ఏళ్లకు ఏళ్లుగా తిరుమల కొండపై పాతుకుపోయిన కొందరు మీడియా

ప్రతినిధులు తాము పనిచేస్తున్న సంస్థల పేరుతొ అందినకాడికి దోచుకుంటుంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ సంస్థల సాధారణ విలేకరులగా కొండపైకి వచ్చిన వాళ్ళు

నేడు కోట్లకు పైగా పడగలెత్తిన అంశాలు వెలుగు చూశాయి. ఇప్పడికే ఒక ప్రముఖ పత్రిక, పలు టీవీ ఛానెల్ ప్రతినిధులు అనకొండలుగా తెల్లగా, మిగిలిన వాటిల్లో కొందరు చిన్న

చితక వానపాముల్లా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చేతికి ఆర్జిత సేవల టికెట్ల కుంభకోణంలో రెడ్ హ్యాండెడ్ à°—à°¾ దొరికారు. దీంతో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులకు ఒక్కసారిగా మతి పోయినంత పనీ అయ్యింది.  

 

దర్శనం, ఆర్జిత టికెట్లలో భారీ గోల్మాల్ :

తిరుమల కు వచ్చే భక్తులు ప్రధానంగా శ్రీనివాసుని దర్శనానికి ఎదురుచూస్తుంటారు. అవకాశం దొరికితే ఆర్జిత సేవల

టికెట్లు కోసం వెతుకుతారు. సరిగ్గా దీన్నే అవకాశంగా చేసుకుని విచ్చలవిడిగా కుంభకోణం సృష్టించేసారు సదరు అనకొండల్లాంటి మీడియా ప్రతినిధులు. విఐపి బ్రేక్

దర్శనానికి ఐదు వేల నుంచి పది వేలకు పైగా వసూలు చేస్తూ, మూడు దర్శనాలు - ఆరు ఆర్జిత సేవలు అన్నట్టుగా టిటిడి అధికారులతో పలుకుబడిని వినియోగించేసారు. కుంభకోణంలో

వెలుగు చూసినవి : శీఘ్ర దర్శనం, సుప్రభాతం, కాటేజీలు,  à°•à°³à±à°¯à°¾à°£à°‚,  

 .రోజుకు లక్ష. . .తిరుమల లో విలేకరి ఆదాయం. : 

ఒక ప్రముఖ పత్రికకు ప్రతినిధిగా ఉన్న తిరుమల

విలేకరి రోజు హస్తలాఘవం ఒక లక్ష కు పైగానే అని టిటిడి అధికారులు తేల్చారు. అంటే వాళ్లకు తెలియకుండా ఇంకెంత దోచి ఉంటాడో ఈ రాతగాడు. కేవలం 2019 జనవరి నుంచి జూన్ వరకు 820

విఐపి టిక్కెట్లు ( కల్యాణం, సుప్రభాతం, ఇతర సేవలు) పొందినట్లు తేలగా.. ఇందులో పట్టుమని పది శాతం  à°®à°‚ది కూడా à°† సంస్థకు చెందిన వారు కాదు. ఇతను à°—à°¤ పదేళ్లుగా ఇక్కడే

విధుల్లో ఉన్నాడు. కేవలం ఆరు నెలల్లోనే ఇంత దోచాడు అంటే గత పదేళ్లలో ఇంకెంత దోచి ఉంటాడో అని సాక్షాత్తు టిటిడి అదనపు జేఈఓ ధర్మారెడ్డి సందేహం వ్యక్తం

చేసినట్టు సమాచారం. ఇతను తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని కొనుకున్నట్టుగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లెక్కల్లో తేలింది.  

2 .

ప్రసారాలు రావు కానీ పైరవీలు ఎక్కువ:

చాలా కేబుల్స్ లో ప్రసారాలు రాని ఒక టీవీ ఛానెల్ స్ట్రింగర్ ఆదాయం నెలకు ఐదారు లక్షలు పైగా ఉంటుంది అని టిటిడి వర్గాలు

తెలియచేస్తున్నాయి. తిరుమల కొండ మీద మూడు తట్టలు, ఆరు అక్రమ దర్శనాల దందా సాగిస్తూ వచ్చిన ఇతని పై సదరు సంస్థ 
వేటు వేసింది.  

3 .యాజమాన్యం మారడం తో డొంక

కదిలింది : . . .

అసలు హిందూ సంప్రదాయం అంటేనే ఏమాత్రం విలువ లేని ఒక టీవీ ఛానెల్ ( దీనికి హిందూ ద్వేషి గా పేరు గాంచింది) కు చెందిన స్ట్రింగర్ వీళ్లిద్దరి కంటే

బాగా ముదిరి పోయినట్టు సమాచారం. ఏకంగా టిటిడి ఉన్నతాధికారులనే బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో బాగా శృతి మించినట్టు తెలియడంతో సదరు ఛానెల్ కు టిటిడి

నుంచి నోటీసులు కూడా వెళ్లినట్టు సమాచారం.  à°ªà°Ÿà±à°Ÿà±à°®à°¨à°¿ పదవ తరగతి కూడా పాస్ కానీ ఇతను దొంగ సర్టిఫికెట్ సంస్థకు ఇచ్చినట్టు సమాచారం. కనీసం టీవీ లోగో కూడా సరిగ్గా

పెట్టుకోడం రాని ఇతను ఇంతకాలం ఆ ఛానెల్ లో ఎలా కొనసాగాడో వాళ్ళకే తెలియాలి అనే అనుమానాలను టిటిడి సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఈ ఛానెల్ యాజమాన్యం

మారడం తో à°ˆ ప్రబుద్దుని బండారం బయట పడింది. దీంతో ఇతని సర్టిఫికెట్ చూపించాలని డిమాండ్ చెయ్యడం తో ఇతను టెన్త్ కూడా పాసవ్వలేదని తేలింది.  

ఇంతకాలం à°ˆ  à°Ÿà°¿à°µà°¿ లో

ఎలా కొనసాగగలిగాడని కొత్త యాజమాన్యం ఆరాతీస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.. కనీసం రెండు లైన్లు వార్త రాయడం చేతకాని ఇతను నలుగురు బినామీ రిపోర్టర్లతో కథ

నడిపిస్తున్నట్లు తేలింది. తిరుమల లో ఈ ఛానెల్ కు ఇచ్చిన కార్యాలయం అవినీతి అనకొండలు అడ్డగా మారిందని టిటిడి తేల్చింది. ఇక్కడ నుంచి మరో ఆరు టీవీ ఛానళ్ళకు ఫీడ్,

స్క్రిప్ట్ వెళ్తుంది. వాళ్లంతా à°ˆ ప్రబుద్ధునికి బినామీలు. 

తీసుకున్న విఐపి దర్శనం టికెట్లు : 783
లడ్డు ల దందా : రోజుకు వందకు పైగానే. .
గదులు, కాటేజీల దందా :

రోజులు పదికి పైమాటే. 
ఆర్జిత టికెట్ల దందాకు లెక్కేలేదు. . .

ఇటీవల అదనపు జేఈఓ ధర్మారెడ్డి చేపట్టిన తనిఖీల్లో వెలుగు చూసిన ఈ మీడియా అనకొండలపై పూర్తి

స్థాయి వేటు తో పాటు, క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు సిద్దపడినట్టు సమాచారం. 

మీడియా కు బ్రేక్ వేసేందుకే .. శ్రీవాణి పథకం

ప్రతి రోజూ లక్షలకు పైగా

దందాలు చేస్తున్న ఈ మీడియా అనకొండలనుంచి శ్రీనివాసుని భక్తులను కాపాడేందుకే టిటిడి శ్రీవాణి పధకాన్ని అమలు లోకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీవాణి

పధకానికి 10 వేలు కడితే ఒక విఐపి బ్రేక్ దర్శనం టికెట్ ఇస్తున్నట్టు ఇటీవల టిటిడి ప్రకటించింది. దీంతో సామాన్య భక్తులకు నేరుగా టిటిడి యే విఐపి టికెట్ లు ఇచ్చే

అవకాశం ఉంది. తద్వారా మీడియా దళారీలు, అనకొండలు శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేసే అవకాశం ఉండదు అని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ భావించింది. 

మీడియా అంటేనే అసహ్యం వేసేలా :  . .

వీళ్ళందరూ చేసిన అవినీతి దందాలా ప్రభావం కారణంగా తిరుమల కొండపై మీడియా ప్రతినిధులం అని ఎవరైనా చెప్పుకుంటే చాలా అసహ్యంగా చూసే విధంగా తయారైంది అని ఒక

సీనియర్ పాత్రికేయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడికే 90 శాతం పరువు పోయిందని, మిగిలిన పరువు ఇలాంటి వాళ్ళవల్ల పోయిందన్నారు. కనీస విద్యార్హత లేకుండా కేవలం

దందాలు చేసేందుకే టీవీ ఛానెళ్ల జిల్లా ప్రతినిధులకు ముడుపులు చెల్లించుకుని మరీ లోగోలు తెచ్చుకుంటున్నారని, కనీస విద్యార్హత, నైతిక విలువలు లేకుండా

సమాజంలోకి వెళ్తున్నారన్నారు. 

మీడియా ప్రతినిధులపై శల్య పరీక్షలే:

తిరుమల పరిధిలో విధులు నిర్వహించే అన్ని మీడియా సంస్థల ప్రతినిధులపైనా డేగకన్ను

వేసింది. అధికారులను ప్రలోభపెట్టినా, విధి నిర్వహణలో అవినీతి కి పాల్పడినా, ఇచ్చిన విలువలను దుర్వినియోగం చేసినా, ఆయా సంస్థలకు నేరుగా ఫిర్యాదు చేసి, టిటిడి పరిధి

నుంచి వీరిని బయటకు పంపేందుకు టిటిడి యంత్రాంగం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ద పడినట్టు తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam