DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింపు -  కలెక్టర్ జె.నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలోని అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా

పథకం వర్తిస్తోందని, ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో స్పందన

కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్ - 2 ఆర్.గున్నయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి

సంస్థ పథక సంచాలకులు ఏ.కల్యాణ్ చక్రవర్తి, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ పాల్గొని ఆర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో

గార మండలం ఆరంగిపేట నుండి సెలగల చిన్నవాడు మరియు బూర్జ మండలం కిలంత్రి నుండి పి.కృష్ణారావులు స్వంత భూములను కలిగి వ్యవసాయం చేసుకుంటున్న తమకు రైతు భరోసా

పథకాన్ని వర్తింపజేయలేదని, ఈ విషయమై మండల వ్యవసాయ అధికారులను కలిసి తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. కావున తమకు ప్రభుత్వం ప్రకటించిన రైతు

భరోసా పథకాన్ని మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్ కు ఆర్జీలను సమర్పించగా, కలెక్టర్ స్పందిస్తూ అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందుతుందని, దీనిపై ఆందోళన

చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతు భరోసాపై ఎటువంటి అపోహలకు తావులేదని, ఖచ్చితంగా ప్రతి రైతుకు  à°…ందుతుందని పేర్కొన్నారు. నరసన్నపేట మండలం లుకలాం నుండి పాలకొండ

గడ్డెమ్మ ఆర్జీని ఇస్తూ లుకలాం రెవిన్యూ పరిధిలో గల తన పొలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించారని, అడిగితే తనపై దౌర్జనానికి దిగుతున్నారని, కావున తనకు

తగిన న్యాయం చేయాలని కోరారు. పాలకొండ మండలం వెలగవాడ నుండి పోతల శివకుమార్ ఆర్జీని సమర్పిస్తూ తాను 2016లో  à°•à±à°²à°¾à°‚తర వివాహాన్ని చేసుకున్నానని, అయితే తనకు ఎటువంటి

గృహం లేదని, కావున గృహాన్ని మంజూరుచేయాలని కోరుతూ దరఖాస్తు చేసినప్పటికి ఇల్లు రాలేదని అన్నారు. ఇటీవల గ్రామ వాలాంటీరు గృహం కొరకు పేరు రాసుకొని

వెళ్లినప్పటికి జాబితాలో తన పేరు లేదని, కావున తనకు న్యాయం చేయాలని కోరారు. పలాస మండలం రామ కృష్ణాపురం నుండి పి.ఖగపతిరావు ఆర్జీ ఇస్తూ తమ గ్రామంలోని సర్వే నంబర్

221లోని 1,2,3,4లలోని మాజీ సైనికులకై కేటాయించిన భూమిని అదే మండలం లోని గోపిటూరు గ్రామస్తులు ఆక్రమణ చేస్తున్నారని, కావున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

చేశారు. నందిగాం మండలం పాలవలస నుండి తుంగాన వెంకటేశ్వరరావు ఆర్జీని సమర్పిస్తూ తన తండ్రి 4.50 ఎకరాల భూమిని తన తల్లి పేరున రాసారని, అందులో 2.00 ఎకరాల భూమి ల్యాండ్

సీలింగ్ లో ఉందన్నారు. అయితే ఆ భూములు తమ స్వాధీనంలోనే ఉన్నాయని, వ్యవసాయ సాగు చేసుకుంటున్నామని చెప్పారు. కావున ఈ భూములకు సంబందించిన మ్యూటేషన్ కావాలని మండల

తహశీల్దారును కోరామని, కాని ఇంతవరకు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు. పొందూరు మండలం కింతలి నుండి తమ్మినేని హరిహరరావు కలెక్టర్ కు ఆర్జీని ఇస్తూ తమ

గ్రామంలోనే ఉద్యోగం చేసుకుంటున్న తనపై తన బావమరుదులు హత్యాయత్నం కు పాల్పడుతున్నారని, à°ˆ విషయమై మండల అధికారులకు చాలాసార్లు  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à± చేసినప్పటికీ ఎటువంటి

ఫలితం లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. కావున తన బావ మరుదుల నుండి రక్షణ కల్పించాలని కోరారు. నరసన్నపేట నుండి జామి లక్ష్మీ ఆర్జీ ఇస్తూ 30 ఏళ్ల నుండి

నరసన్నపేటలోనే నివాసం ఉంటున్న తనకు ఇప్పటివరకు ఎటువంటి ఇల్లు లేదని, కావున తనకు గృహాన్ని మంజూరుచేయాలని కోరారు. శ్రీకాకుళంలోని మంగువారితోట నివాసి అయిన కనపల

వెంకటరావు ఆర్జీ ఇస్తూ శ్రీకాకుళం రూరల్ మండలం నగరి పంచాయతీలో గల సర్వే నంబర్ 270లోని 5లో 20 సెంట్లు, 9లో 23 సెంట్ల భూమి తన తల్లి అయిన కనపల చిన్నమ్మ పేరున ఉందని, అయితే ఆ

భూమిని సబ్ డివిజన్ చేసి తన వాటా క్రింద అప్పగించాలని కోరారు.  à°Žà°šà±à°šà±†à°°à±à°² మండలం ముద్దాడ నుండి సింహాద్రి లలిత కుమారి ఆర్జీ ఇస్తూ ఇటీవల కురిసిన వర్షాలకు తన 1.50 ఎకరాల

భూమిలో గల వరి పంట పూర్తిగా దెబ్బతిందని, కావున తనకు తగిన నష్ట పరిహారాన్ని మంజూరుచేయాలని కోరారు. ఎచ్చెర్ల నుండి వండాన బారికివాడు ఆర్జీ ఇస్తూ వర్గాల వలన తనకు

చెందిన 90 సెంట్ల భూమిలోని వరిపంట పూర్తిగా పోయిందని, కావున నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఇచ్చాపురం నుండి కె.దేవేందర్ ఆర్జీ ఇస్తూ  à°µà±ƒà°¦à±à°§à±à°¡à±ˆà°¨ తనకు పింఛను

మంజూరు చేయాలని కోరారు. వంగర మండలం కొట్టిస నుండి కె.కృష్ణమూర్తి ఆర్జీ ఇస్తూ తమ గ్రామంలోని వాటర్ ట్యాంక్ నుండి తాగునీరు సరఫరా కావడంలేదని, అందువలన

గ్రామస్తులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు.

        à°ˆ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, గ్రామీణ నీటి

సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మీ, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్,

బి.సి.కొర్పొరేషన్ కార్య నిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్. మహాలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.

ఎం.చెంచయ్య, మెప్మా పథక సంచాలకులు ఎం.కిరణ్ కుమార్, ఏ.పి.ఎం.ఐ. పి ప్రాజెక్ట్ అధికారి జమదగ్ని, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు డా.వి.వి.కృష్ణ మూర్తి, వ్యవసాయ శాఖ సంయుక్త

సంచాలకులు బి.జి.వి.ప్రసాద్, ఆర్.టి.సి పి.ఆర్.ఓ బి.ఎల్.పి.రావు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam