DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ ఉత్తమ మండల పరిషత్ గా సబ్బవరం 

ఎంపిడిఓ రమేష్ నాయుడు కు కలక్టర్ అభినందన 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¾à°¤à±€à°¯ ఉత్తమ

మండల పరిషత్ à°—à°¾ విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఎంపికైనట్లు సబ్బవరం ఎంపిడిఓ బి. రమేష్ నాయుడు మంగళవారం తెలిపారు.  à°¦à±€à°¨à± దయాళ ఉపాధ్యాయ పంచాయితీ స్వశక్తీకరణ

పురస్కార్-2019 సబ్బవరం మండలానికి దక్కింది.  à°ˆ నెల 23à°µ తేదీన ఢిల్లీలో జాతీయ సైన్స్ కాంప్లెక్స్ లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయితీ స్వశక్తీకరణ పురస్కార్-2019

నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర  à°ªà°‚చాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతులు మీదుగా సబ్బవరం మండల పరిషత్

అభివృద్థి అధికారి బి. రమేష్ నాయుడు అందుకున్నారు.  à°…వార్డు తీసుకొని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ను ఎంపిడిఓ బి. రమేష్ నాయుడు కలిసారు.  à°®à°‚డలంలోని అన్ని శాఖలను

సమన్వయం చేసి ఆయా శాఖల పనితీరును జాతీయ బృందం పరిశీలించినపుడు ఆయా శాఖల పనితీరు జాతీయ పరిశీలనా బృందాన్ని ఆకట్టుకుందని కలెక్టర్ కు వివరించారు. ఈ అవార్డుకు

సాధించడానికి సూచనలు, సలహాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జిల్లా పరిషత్ సిఇఓ రమణమూర్తి, మండల స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మరియు

పాత్రికేయులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam