DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంజాబ్ - దేశంలోనే సర్వత్రా అగ్రగామి  

( ప్రభ్ జోత్ సింగ్ - సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం). 

సామాజిక దురాచారాలను దునుమాడుతూ సార్వజనీన సౌభ్రాతృత్వాన్ని ప్రవచించిన సిక్కు మత వ్యవస్థాపకుడు

గురు నానక్ దేవ్ జీ 550à°µ జయంతి వేడుకల నడుమన “ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” లో ఆణిముత్యంలా పంజాబ్ వెలుగొందుతోంది. గురు నానక్ దేవ్ సుదీర్ఘకాలం జీవితం గడిపిన కపుర్తలా

జిల్లాలోని సుల్తాన్ పూర్ లోధి ఈ వేడుకలకు కేంద్రస్థానంగా ఉంది. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి యవ్వనమైన, ఆధునికమైన సిక్కు మతానికి చెందిన గురూజీ బోధనలు, సందేశం

పాటించే వారినే కాకుండా ప్రపంచంలోని వివిధ మతాల అధిపతుడు, ఆధ్యాత్మికవేత్తలను ఆకర్షిస్తోంది.

ఈ వేడుకలను పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం శిరోమణి

గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్ జిపిసి) సన్నిహిత భాగస్వామ్యంలో గురు నానక్ చివరి రోజులు గడిపిన పాకిస్తాన్ లోని పవిత్ర ప్రార్థనా స్థలం శ్రీ కర్తార్ పూర్ సాహిబ్

సందర్శనకు మార్గం తెరవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతోంది. కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ గా వ్యవహరించే ఈ మార్గం ద్వారా ప్రతీ రోజూ ఐదు వేల మంది శ్రీ కర్తార్ పూర్

సాహిబ్ గురుద్వారా సందర్శించి ప్రార్థనలు చేసుకునే అవకాశం కలుగుతుంది. సుల్తాన్ పూర్ లోధి, శ్రీ కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్లే కాదు, శ్రీ గురునానక్ దేవ్ జీ

ఆధ్యాత్మిక మార్గాన్ని విశ్వసించి అనుసరించే వారు, ఆధ్యాత్మికత, సార్వత్రిక సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరికీ ఆకర్షణీయమైన ప్రధాన

పర్యాటక స్థలంగా పంజాబ్ నిలుస్తుంది. శ్రీ గురునానక్ దేవ్ జీ ఒక స్వచ్ఛంద ఉద్యమాన్ని ప్రారంభించడమే కాదు, సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునేందుకు తన తండ్రి

కాలూ మెహతా ఇచ్చిన 20 రూపాయలతో పేదలు, ఆకలిదప్పికలతో అల్లాడే వారికి ఉచితంగా ఆహారం అందించేందుకు వంటగదిని ప్రారంభించారు. యువకుడైన గురు నానక్ దేవ్ జీ ఆ వంటగదికి

కావలసిన వస్తువులు సమకూర్చి ఆహారం వండి పేదలకు ఉచితంగా అందించారు. ఆయన ప్రారంభించిన ఆ ఉచిత భోజన కార్యక్రమమే ఈ రోజు సిక్కుల ప్రత్యేకతను చాటి చెబుతూ గురూ కా

లంగర్ గా ప్రసిద్ధమైన కార్యక్రమానికి మూలంగా నిలిచింది. ఈ రోజు ఎందరో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉచిత సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసి పేదలకు ఆహారం

అందిస్తున్నారు.

శ్రీ గురునానక్ దేవ్ ఆలయం ఒక్కటే కాదు, పంజాబ్ లో పర్యాటకులకు ఆకర్షణీయమైన ఎన్నో ప్రదేశాలున్నాయి. 1919లో వైశాఖి దినం రోజున వేలాది మంది

స్వాతంత్ర సమర యోధులు సమిధలుగా మారిపోయి తమ త్యాగనిరతిని చాటుకున్న చిహ్నంగా నిలిచే జలియన్ వాలా బాగ్ స్మారకం మరో ప్రధానమైన ఆకర్షణ. అంతే కాదు, అత్యున్నత నాణ్యత

గల విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆధునిక వైద్యవసతులు అందించే ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఆస్పత్రులతో ఆరోగ్యం, విద్యా కార్యక్రమాల్లో కూడా పర్యాటకుల

ఆకర్షణకు పంజాబ్ ప్రధాన కేంద్రంగా ఉంది. దేశం యావత్తుకు ఆహారం అందించే అన్నపూర్ణగా కూడా భాసిల్లుతూ కేంద్ర, రాష్ట్ర ఆహార కేంద్రాలకు భారీ పరిమాణంలో

ఆహారధాన్యాలు అందిస్తోంది. ప్రతీ ఒక్క గ్రామానికి చక్కని రోడ్ల వసతి, నీరు, విద్యుత్ సదుపాయంతో కూడిన ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన ఆస్పత్రులు, విద్యాసంస్థలతో

పురోగమన పథంలో పయనించాలనుకునే రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, అత్యంత అధునాతనమైన క్రీడా మౌలిక వసతులు, ఎంతో పేరు

ప్రఖ్యాతులు గడించిన సంస్థలు పంజాబ్ ప్రత్యేకతను చాటి చెబుతాయి.

పంజాబీలు ఎక్కడ నివశించినా ఒక సార్వత్రిక సమాజంగా నిలుస్తూ ఉంటారు. కెనడా, అమెరికా,

ఆస్ర్టేలియా, న్యూజిలాండ్, యుకె ఎక్కడైనా తమదైన ముద్ర వేస్తారు. పంజాబ్ శౌర్యానికి ప్రతీక అయిన కత్తికే కాదు, దేశానికి క్రీడల్లో కూడా ఒక ప్రముఖమైన ఆయుధంగా కూడా

వెలుగొందుతోంది. ఆంధ్రప్రదేశ్ తో ప్రత్యేక భాగస్వామ్యం కలిగి ఉండి తమ పురోగతిని ఇతర రాష్ట్రాలతో పంచుకునే దేశంలోని అత్యంత అధునాతనమైన ఈ రాష్ట్రాన్ని

 à°¸à°‚దర్శించి ఇక్కడి  à°ªà°šà±à°šà°¦à°¨à°‚, ప్రేమాభిమానాలు ఆస్వాదించండి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam