DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారం అందలం ఎక్కిస్తే  అహంకారం అణచివేస్తుంది, టిటిడి వివాదం టిడిపి కి గుణపాఠం కానుందా ?

ప్రతిపక్ష నాయకున్ని ఎవరైనా కలిస్తే వాళ్ళు విలనేనా ?

తిరుమల, జూన్ 8 , 2018 (DNS Online) : అధికారం అందలం ఎక్కిస్తే  à°…హంకారం అణచివేస్తుంది అనే నానుడి అధికార పార్టీకి

అతికినట్టు సరిపోతుంది. దాదాపు పదేళ్ల తర్వాత అధికారం అంది వస్తే చేజేతులా చెడగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. 
అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ

పాలన లో విఫలం చెందింది కనుకనే ప్రతిపక్ష నాయకున్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని  à°•à°²à°¿à°¸à°¿ సమస్యలు వివరిస్తున్నారు ప్రజలు. అదే పెద్ద నేరంగా భూతద్దం లో చూపించి

పెద్ద నేరంగా ప్రకటిస్తున్నారు అధికార పార్టీ ప్రతినిధులు.  à°¤à°¿à°°à±à°®à°² లో జరుగుతున్నా అనాచారాల పై బహిరంగంగానే ప్రకటించిన ఆగమ పండితులు, రమణ దీక్షితుల ఆరోపణలను

ప్రభుత్వం పట్టించుకోకుండా అయన పైనే వేటు వేసి, వేధింపులు మొదలెట్టడంతో తట్టుకోలేని స్థితి లో అయన మీడియా ను ఆశ్రయించారు. అయితే మీడియా లో అధికశాతం  à°¸à°‚స్థలు

అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయడంతో తప్పని సరి పరిస్థితిలో ప్రతిపక్ష నాయకులు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి

తిరుమల లో జరిగిన అనాచారాన్ని వివరించారు. ఆఖరికి అత్యంత నీచ స్థాయికి దిగజారిన మీడియా సంస్తలు, వీరిద్దరి కలయికనూ రచ్చ చేస్తున్నాయి. రమణ దీక్షితులు వై ఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని, ఆయనకి ఎక్కడి నుంచయినా ఎంపీ సీటు ఇచ్చేందుకు జగన్ హామీ ఇచ్చారంటూ విచ్చలవిడి వార్తలు గుప్పించేశాయి. అధికార పార్టీకి

వ్యతిరేకంగా ఎవరైనా నోరు విప్పితే వాళ్లకి బ్రతుకు లేకుండా చెయ్యడమే పనిగా ఈ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయంటూ ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు

మండిపడుతున్నారు. 

రమణ దీక్షితుల ను విమర్శించే స్థాయి వీళ్ళకుందా  : 

ఇటు వైదిక సంప్రదాయం లో ఆగమ పండితులుగానూ ఉన్నతమైన స్థాయి లో ఉన్నరమణ దీక్షితులు,

ఆధునిక విద్యలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో పీ హెచ్ à°¡à±€ కూడా చేశారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఈయన పై విమర్శలు గుప్పిస్తున్న వారిలో కనీసం 10 à°µ తరగతి కూడా ఎంతమంది  à°ªà°¾à°¸à°¯à±à°¯à°¾à°°à±‹ కూడా

తెలియదు. కేవలం అధికార పార్టీ లో ఉన్నారు అనే ఒకే ఒక్క కారణం వాళ్ళ కన్ను మిన్ను కానక నోటికి వచ్చిన ప్రేలాపన ప్రేలుతుంటే కనీసం స్పందించక పోవడం రమణ దీక్షితుల

సంస్కారం. 

 

pix: courtesy to whom so ever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam