DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ ఒకసారి మాట ఇస్తే కష్టమైనా నిలబడే మహా శక్తి   

జగన్ ను దగ్గర చూస్తే మంచి మనసు తెలుస్తుంది. 

ఎన్నికల్లో ఓడినా... ఆదరించి ఉన్నత హోదా ఇచ్చారు. 

రాజకీయ పెద్ద బాలశిక్ష తండ్రి ద్రోణంరాజే. . .

.

ఆత్మీయసభలో విఎంఆర్ డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . . . 

విశాఖపట్నం, నవంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : ఏ ఒక్కరినీ దూరం నుంచే చూసి

ఒక అభిప్రాయానికి రాకూడని, వైఎస్ జగన్ ను అతి దగ్గరగా చూస్తే తప్ప అతని సున్నితమైన మనసు తెలియదని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. శనివారం

విశాఖ నగరంలోని ఓ హోటల్ లో జరిగిన ఆత్మీయ సదస్సులో అయన మాట్లాడుతూ రాజకీయ పరంగా పూర్తి సందిగ్ద స్థితి లో ఉన్న సమయం లో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్

రెడ్డి తనను పిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. అయినప్పటికీ

కొద్దీ పాటి తేడాలో ఓటమి పాలైనా, పిలిచి మరీ విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ( వి ఎం ఆర్ డి ఏ) మొట్టమొదటి చైర్మన్ గా నియమించారన్నారు. తనకు పెద్ద బాలశిక్ష

తన తండ్రి ద్రోణంరాజు సత్యన్నారాయణేనన్నారు. ఎందరో రాజకీయ దురంధురులను రాష్ట్రానికి పరిచయం చేసారని, అయితే అయన వారసత్వాన్ని తానూ పూర్తిగా అందుకోలేక

పోయానన్నారు. మూడు సార్లు ఓటమి పాలైనా, వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్నారు. కష్టపడితే తప్ప ఏ ఒక్క విజయమూ ఎవరి సొంతమూ కాదన్నారు.  à°•à±à°Ÿà±à°‚à°¬ వారసత్వం

ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ప్రజా క్షేత్రం లో ప్రజలతో మమేకమై ఉంటె తప్ప రాజకీయంగా ప్రగతి సాధించే అవకాశం ఉందన్నారు. ఇది ఏ ఒక్కరికో పరిమితం కాదని తెలిపారు. తన

తండ్రి దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ ( ఉడా ) కు మొట్ట మొదటి చైర్మన్ గా నియమితులు కాగా, తానూ వి ఎం ఆర్ డి ఏ కు మొట్టమొదటి చైర్మన్

à°—à°¾ నియమితులయ్యానన్నారు. 

విశాఖ కు ఎంతో ప్రగతి ఉంది  . . . . 

విశ్వ నగరంగా అభివృద్ధి పడేందుకు ఆసియనగరంలోనే ఎక్కువ అవకాశాలున్న అతి తక్కువ నగరాల్లో

విశాఖ నగరం ఒకటన్నారు. ఈ నగరాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. ప్రస్తుతం వి ఎం ఆర్ డి ఏ పరిధి ఐదు జిల్లాలకు

విస్తరించిందని తెలిపారు. 

విశ్రాంత పోలీసు అధికారి టి ఎస్ ఆర్ ప్రసాద్ ఆధ్వర్యవంలో జరిగిన ఈ ఆత్మీయ సదస్సులో విశిష్ట అతిధులుగా పాల్గొన్న రాష్ట్ర శాసన సభ

ఉప సభాపతి కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు లకు ఘన సమ్మానం చేసారు.  

ప్రత్యేక అతిధిగా విచ్చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. కార్యక్రమం లో అధికార తెలుగు భాష సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ వై ఆర్ కృష్ణారావు,

బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో విద్యా వేత్తలు, వేదపండితులు, వైద్యులు, న్యాయవాదులు, వివిధ హోదాల్లో బ్రాహ్మణా ప్రముఖులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam