DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ని ప్రక్షాళన చెయ్యాల్సిందే. .: ప్రభుత్వానికి స్వామీజీల హెచ్చరిక 

రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే : స్వామీజీలు 

అత్యున్నత ఆలయాన్ని అప్రతిష్ట పాలు చెయ్యొద్దు : స్వామీజీల

హితవు 

తిరుపతి జూన్ 9 2018 (DNS ) : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్న పాలకమండలి తీరును మార్చుకోవాలని,

దీన్ని అప్రతిష్ట పాటు చెయ్యవద్దని హంపీ విరూపాక్ష పీఠాధిపతి విద్యాగణేషానంద భారతీస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో వివాదాలకు నిలయంగా మారిన టిటిడి ని

తక్షణం ప్రక్షాళన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. టిటిడి అధికారుల మొండి వైఖరికి నిరసనగా పలువురు స్వామీజీలు శనివారం తిరుపతి లో నిర్వహించిన విలేకరుల సమావేశం

లో అయన మాట్లాడుతూ టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తిరుమలలో పరిస్థితులపై భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని చెప్పారు. మాజీ

ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని భారతీ స్వామి డిమాండ్‌ చేశారు. ఇప్పడికే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు

చేస్తున్నవారిలో వందల సంఖ్యలో అన్యమతస్తులు ఉన్నారని, వారిని హిందూ ధార్మిక సంస్థ నుంచి బయటకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు.  

సభ్యులకి ఆగమ జ్ఞానం

తెలియక్కర లేదా ?  

టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమితులు అయ్యేవారికి ఆగమ సంప్రదాయాలు తెలిసి ఉండాలని పీఠాధిపతులు పేర్కొన్నారు. ధనవంతులు , పార్టీలకు

చెందినవారూ, ముఖ్యమంత్రి, మంత్రుల వద్ద ప్రాపకం ఉంటె చాలని, ఇలా టిటిడి బోర్డు సభ్యులు అయి పోవచ్చని ఎద్దేవా చేశారు కమలానంద భారతి. ప్రస్తుతం బోర్డులో అలాంటి

వ్యక్తులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

శ్రీవారి పింక్‌ వజ్రం పగిలిపోయే ఆస్కారం లేదని చెప్పారు. పూలు, నాణెలు పడినంత మాత్రాన వజ్రాలు

పగిలిపోతాయా? అని ప్రశ్నించారు. టిటిడి లో జరుగుతున్న అనాచారాలపై పలువూరు పీదాధిపతులు తిరుపతి లో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఆలయ అర్చకత్వం, సన్నిధి, గొల్లల, అర్చన

విధానం, ఆగమ సంప్రదాయం, తదితర అంశాల పై, వంశపారంపర్య పరంపరలపై చర్చించనున్నారు.  à°¤à°®à°•à± ఏ రాజకీయ పార్టీ తోనూ సంబంధాలు లేవని, కేవలం తిరుమల శ్రీనివాసుని ఉన్న సంబంధం

తో మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam