DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కలియుగంలో హరినామస్మరణే మోక్షానికి మార్గం : 

కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి విద్యాప్రసన్నతీర్థ 

దాససాహిత్య ప్రాజెక్టు చే వైభవంగా మెట్లోత్సవం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . .

.

తిరుపతి, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌):  à°•à°²à°¿à°¯à±à°—ంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని à°•‌ర్ణాట‌à°•‌లోని కొక్కె

సుబ్రహ్మణ్య మఠాధిపతి విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవ కార్యక్రమాలు

మంగ‌à°³‌వారం  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿à°²à±‹à°¨à°¿ రైల్వేస్టేషన్‌ వెనక వైపు à°—à°² మూడో సత్రం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
       à°ˆ సందర్భంగా విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ

మంగళాశాసనాలు చేస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుండి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో

మెట్లోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా భగవన్నామస్మరణ చేస్తే సత్ఫలితాలు

వస్తాయన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. కొక్కె సుబ్రహ్మణ్య క్షేత్రంలో సాక్షాత్తు ఆదిశేషుడే

కొలువయ్యారని, ఇక్కడ స్వామివారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయన్నారు.

      à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా దాస‌సాహిత్య ప్రాజెక్టు

ఆధ్వ‌ర్యంలోక్ర‌మం à°¤‌ప్ప‌కుండా మెట్లోత్స‌వం నిర్వ‌హిస్తోందన్నారు. ఎందరో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీవ్యాసరాజయతీశ్వరులు శ్రీమాన్‌

అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారని చెప్పారు. అలాంటివారి అడుగుజాడలలో

నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతున్నట్టు వివరించారు. ఇలా కాలినడకన వెళ్లి

సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల‌ నుండి 2 వేల‌

మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొనడం సంతోషకరమన్నారు.
      à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో à°ˆ

కార్యక్రమం à°œ‌రిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam