DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాట్సాప్ లో అద్భుతం ప్రయోగం .. సామూహిక విష్ణు సహస్ర పారాయణ ఒక రికార్డు

విశాఖపట్నం, జూన్ 9 , 2018 : సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయం లో యువతీ యువకులు గాడి తప్పేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. అయితే ఇదే సాంకేతిక

విధానాన్ని సద్వినియోగం చేసుకుని, అందరికీ ఒక మంచి సందేశం అందించాలనే సంకల్పం తో కొందరు యువతీ యువకులు, వాట్సాప్ ద్వారా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ లయ బద్దంగా

చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సోషల్ మీడియా రంగంలో మొట్ట మొదటి సారిగా ఈ విధమైన ఆధ్యాత్మిక తరంగాలను వివిధ ప్రాంతాల నుంచి ఒకే వేదికపై ప్రదర్శించడం

గమనార్హం. విశాఖపట్నం కు చెందిన 150 మంది విప్ర కుటుంబ సభ్యులు వ్యాసపీఠం పేరిట ఒక వాట్సాప్ సమూహాన్ని రూపొందించి, ఆధ్యాత్మిక సమాచారాన్ని అందిస్తున్నారు. శనివారం

సాయంత్రం 6 గంటల సమయంలో ఈ వాట్సాప్ సమూహం ద్వారా సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేపట్టారు. ఈ విధంగా సామూహిక పారాయణ ( పరోక్షంగా ఉన్నప్పటికీ) చేయడం

చాలామందిని ఆశ్చర్య పరిచింది. విషయం తెలుసుకున్న మిత్రులు, ఇతర ఆధ్యాత్మిక పరులు తాము కూడా ఈ విధమైన కార్యాచరణ చేసేందుకు సన్నద్ధమయ్యారు. సభ్యులందరు నిశ్చలమైన

భక్తితో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ చేయడం జరిగింది. కార్యక్రమం ఆద్యంతం కడు రమణీయంగా లయబద్ధంగా శ్రీ మహావిష్ణువుకు పదపుష్పాంజలి అర్పించారు. ఈ

మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించిన వారిలో వి ఎస్ à°Žà°‚ శాస్త్రి, బి. అనంత రామం, మంద అన్నపూర్ణ, జంధ్యాల మోహన్ సాయి, భారతి, నిష్ఠల సూర్య ప్రకాష్,  à°—ండికోట రాజేష్ లు

ఉన్నారు. à°’à°• మంచి కార్యక్రమానికి సహకరించి, పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు తెలియచేసారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam