DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళంలో ఆర్మీ నియామక ప్రక్రియ ప్రారంభం

దరఖాస్తులు చేసిన అభ్యర్థులు  49 వేల మంది 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚లో

ఆర్మీ నియామక ప్రక్రియ ప్రారంభం అయింది. నియామక ప్రక్రియకు ఆర్మీ అధికారులు తమ పనులను పూర్తి చేసుకోగా, జిల్లా యంత్రాంగం నియామక ప్రక్రియకు అవసరమగు సివిల్

పనులను పూర్తి చేసింది. బుధ వారం సాయంత్రం నుండి నియామక ప్రక్రియలో పాల్గొనుటకు అభ్యర్ధులు రావడం ప్రారంభం కానుండటంతో అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేసారు. ఈ

ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధ వారం రాత్రి నుండి

శ్రీకాకుళంలో ఆర్మీ రెక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం అవుతుందని కలెక్టర్ చెప్పారు. 49 వేల మంది అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారని ఆయనతెలిపారు.

నియామక ప్రక్రియ పూర్తిగా రాత్రి సమయంలో చేపడుతున్నందున అందుకు అవసరమై మౌళికసదుపాయాలు కల్పించామని చెప్పారు. అభ్యర్ధుల పరుగు పరీక్షకు అవసరమగు ట్రాక్ ను

ఏర్పాటు చేయడంతోపాటు అందుకు అవసరమైన విద్యుత్ దీపాలు, తాగు నీటి వసతులు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని చెప్పారు. ప్రక్రియలో పాల్గొనుటకు వచ్చే అభ్యర్ధులు

కోడి రామమూర్తి స్టేడియంకు ముందుగా చేరుకుని తమ కాల్ లెటర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారని ఆయన చెప్పారు. అందుకు కోడి రామమూర్తి స్టేడియంలోను 16

కంపార్ట్ మెంట్లలో అభ్యర్దులు వేచి ఉండటానికి వీలుగా ఏర్పాట్లు చేసామని చెప్పారు. ఆర్మీ అధికారులతోపాటు రెండు వందల మంది పోలీసులు ప్రక్రియలో నియంత్రణకు

పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్ధులు నియామక ప్రక్రియకు సహకరించి ప్రశాంతంగా పూర్తి కావడానికి దోహదపడాలని కోరారు.

మాదక ద్రవ్యాలు వాడితే నియామక

ప్రక్రియలో అనర్హత : శారీరక ధారుడ్యానికి మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వాడిన అభ్యర్ధులను ఆర్మీ నియామకాలకు చేపట్టే అన్ని ర్యాలీల్లోనూ నిషేధం విధిస్తామని ఆర్మీ

నియామక అధికారి కల్నల్ భూపేందర్ సింగ్ తెలిపారు. శ్రీకాకుళంలో జరుగుతున్న నియామక ప్రక్రియలో శ్రీకాకుళం నుండి కృష్ణా వరకుగల ఆరు జిల్లాలతోపాటు పాండిచ్ఛేరీ

రాష్ట్రంలోని యానాం జిల్లా అభ్యర్ధులు పాల్గొంటున్నారని చెప్పారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే ర్యాలీలో పాల్గొనుటకు అర్హులని స్పష్టం చేసారు. గత

అక్టోబరు 22వ తేదీతో దరఖాస్తులు చేసుకొనుటకు గడువు ముగిసిందని, 23వ తేదీ నుండి అభ్యర్థులకు కాల్ లెటర్స్ జారీ చేసామని చెప్పారు. కాల్ లెటర్స్ లో అభ్యర్ధులు

హాజరుకావలసిన తేదీ, సమయం స్పష్టంగా ఇవ్వడం జరిగిందని దానిని అభ్యర్ధులు విధిగా పాటించాలని కోరారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని

అభ్యర్ధులు గుర్తించాలని, మధ్య దళారీల మాటలను నమ్మరాదని ఆయన కోరారు. నియామక ప్రక్రియలో 15 మంది ఆర్మీ అధికారులు, 150 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.

అభ్యర్ధులు కోడి రామమూర్తి స్టేడియంలో కాల్ లెటర్ లో సూచించిన మేరకు సాయంత్రం నాటికి చేరాలని అన్నారు. కోడి రామమూర్తి స్టేడియం నుండి బ్యాచ్ ల వారీగీ ఆర్ట్స్

కళాశాల మైదానంలోకి అర్ధ రాత్రి 12 గంటల నుండి ప్రవేశం కల్పిస్తామని అన్నారు. ప్రవేశం కల్పించే సమయంలో అభ్యర్ధుల బయోమెట్రిక్ పరిశీలిస్తామని తెలిపారు. ఒక్కో

బ్యాచ్ లో 250 నుండి 300 వందల మంది వరకు అభ్యర్ధులు ఉంటారని తెలిపారు. అభ్యర్ధుల హాజరు మేరకు రోజుకు నాలుగు వేల మందికి పరీక్షలు పూర్తి చేస్తామని అన్నారు. ఆర్ట్స్

కళాశాలలో మొదటగా పరుగు ప్రక్రియ పూర్తి చేస్తామని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మిగిలిన పరీక్షలు నిర్వహించి మెడికల్, నాన్ మెడికల్ పరీక్షలు

నిర్వహిస్తామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం.వి.రమణ, ఆర్ అండ్ బి ఎస్.ఇ కె. కాంతిమతి, ఇఇ గౌరీశ్వర రావు, డిఇ ఆర్.గణపతి, డి.ఎం.హెచ్.ఓ ఎం.చెంచయ్య, డి.ఎస్.ఓ

జి.నాగేశ్వరరావు, సెట్ శ్రీ సిఇఓ జి.శ్రీనివాసరావు, డిఎస్డిఓ బి.శ్రీనివాస్ కుమార్, నగర పాలక సంస్థ ఇంజినీర్ శంకర రావు, సహాయ జిల్లా  à°…గ్నిమాపక అధికారి

బి.జె.డి.ఎస్.పి.కుమార్, ఇన్ స్పెక్టర్ శ్రీనుబాబు, ఇపిడిసిఎల్ డిఇ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam