DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందన అర్జీదారులను చిరునవ్వుతో పలుకరించాలి

స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలి

పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవు 

స్పందన విధి విధానాలపై అధికారుల

అవగాహన 

సదస్సులో వెల్లడించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు

విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల అధికారులు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . .

.

విశాఖపట్నం, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయిలో ఉన్నా à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు

వెల్లడించారు. స్పందన అర్జీలు పరిష్కారం, విధి, విధానాలపై మంగళవారం బీచ్ రోడ్ లోని ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ హాలులో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు

సంబంధించిన అధికారులతో సదస్సు నిర్వహించారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అందే వినతులను

నాణ్యతతో పరిష్కరించేందుకు అవసరమైన విధి, విధానాలను ఖరారుచేసింది. ఆ విధి, విధానాలపై జిల్లా, మున్సిపల్, మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు

ముఖ్యమంత్రి కార్యాలయం  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ సాల్మన్ ఆరోఖ్యరాజ్, ప్రత్యేక అధికారి à°¡à°¾. హరికృష్ణ, పురపాలక శాఖ కమిషనర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయకుమార్, పౌర సరఫరాల శాఖ

డైరెక్టర్ అరుణ్ కుమార్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీకృష్ణ, విశాఖ నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా,

విశాఖ జిల్లా ఎస్.పి. అట్టాడ బాపూజి, రాజమహేంద్రవరం పట్టణ ఎస్.పి. à°¡à°¾. షెముషి బాజ్పాయ్, తదితరులు సదస్సును ప్రారంభించారు.   
     à°®à±à°–్యమంత్రి కార్యాయం కార్యదర్శి

సాల్మన్ ఆరోఖ్యరాజ్, తదితరులు మాట్లాడుతూ ప్రజల హృదయ స్పందనకు అనుగుణంగా అధికారుల స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యల పరిష్కార

వేదిక స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అయితే స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కరణలో అధికారులు ప్రత్యేక శ్రద్ద, చొరవ

చూపకపోవడంతో వాటిలో చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు.  à°¸à±à°ªà°‚దన అర్జీల పరిష్కారంపై ప్రభుత్వం à°ˆ మద్య

కాలంలో నిర్వహించిన పలు సర్వేల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు వారు తెలిపారు.  à°µà°¿à°¨à°¤à±à°² స్వీకరణ, విచారణ, పరిష్కరణ, తిరస్కరణ, తదితర అంశాల్లో ప్రభుత్వ

అధికారులు, ఉద్యోగుల తీరు అసంతృప్తి కరంగా ఉన్నట్లు ఆ సర్వేల్లో వెల్లడైనట్లు వారు తెలిపారు. ప్రజల నుండి అర్జీల స్వీకరించేటప్పుడు నవ్వుతో స్వీకరించాలని, ఆ

విధంగా చేస్తే అర్జీదారుల్లో ఆత్మస్థ్తెర్యం పెంపుందుతుందని పేర్కొన్నారు.  à°•à±Šà°¨à±à°¨à°¿ అర్జీల సమస్యల పరిష్కారం జరిగినప్పటికీ మరికొన్ని సమస్యలను సహేతుక

కారణాలు చూపకుండా తిరస్కరించడం జరుగుచున్నట్లు గుర్తించడమైందన్నారు.  à°‡à°Ÿà± వంటి సమస్యలను అన్నింటినీ పరిష్కరించేందుకు, వినతుల పరిష్కారంలో అధికారులు

అనుసరించాల్సిన విధి, విధానాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వారు తెలిపారు.  à°ˆ విధి, విధానాలపై జిల్లా, మండల స్థాయి అధికారులు అందరూ అగాహన పెంచుకొని స్పందన అర్జీల

పరిష్కారంలో మంచి ప్రతిభ చూపాలని వారు సూచించారు.  à°¸à±à°ªà°‚దన అర్జీల పరిష్కారంలో ఇకపై ఎటు వంటి పిర్యాదులు వచ్చినా ప్రభుత్వం ఉపేక్షించదనే సంకేతాలను అధికారులకు

వారు ఇచ్చారు.
     à°®à±à°–్యమంత్రి కార్యాయం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ అర్జీలను అందజేసేందుకు వచ్చే ప్రజలను చిరునవ్వుతో ఆహ్వనించి,

గౌరవాధరణలతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. తీసుకున్న అర్జీకి రశీదు ఇవ్వాలని, అందిన వినతులను  à°•à±à°·à°£à±à°£à°‚à°—à°¾ పరిశీలించి, సమగ్రమైన విచారణ చేసి అర్జీపై

తీసుకున్న నిర్ణయాన్ని ఎండార్స్ మెంట్ అర్జీదారునికి అందజేయాలన్నారు. అర్జీ ఒక సమస్యకు పెట్టుకుంటే వేరొక సమస్యకు అప్ లోడ్ చేస్తున్నారని, ఆ విధంగా చేయకుండా ఏ

సమస్యపై అర్జీదారు పెట్టుకుంటే అదే సమస్యకు రశీదు ఇవ్వాలని చెప్పారు.  à°ªà±à°°à°¤à±€ విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కరించాలని తెలిపారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పథకాలు

పొందేందుకు వారు అర్హులు అయితే వెంటనే లబ్దిచేకూర్చాలని సూచించారు. ఒక వేళ అనర్హులు అయితే అందుకు సహేతుకమైన కారణాలను చూపుతూ సున్నితంగా అర్జీని

తిరస్కరించాలన్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధి, విధానాలను ప్రభుత్వం ఖరారు చేసిందని, అధికారులు వాటిని తూ.చా.తప్పక పాటిస్తూ స్పందన అర్జీలను నాణ్యతతో

పరిష్కరించాలన్నారు. డిశంబరు లేదా జనవరి నెల నుండి వ్యవస్థలో మార్పు చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన అధికారులను కోరారు.
     à°®à±à°–్యమంత్రి కార్యాలయం

ప్రత్యేక అధికారి డా.హరికృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో నిర్వహించిన పాదయాత్రలో ఎన్నో అర్జీలు వచ్చాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే అర్జీల సమస్యలను

పరిష్కించే వేదిక ఉండాలనుకున్నారని చెప్పారు.  à°ªà±à°°à°œà°¾ వినతులను నాణ్యతతో పరిష్కరిస్తే ప్రజలకు ప్రభుత్వం పై విశ్వాసం పెరుగుతుందని, అలక్ష్యం వహిస్తే విశ్వాసం

తగ్గుతుందన్నారు. అర్జీలు 80 శాతం పరిష్కారం జరిగాయని, దీనిపై ప్రభుత్వం సర్వే చేయగా అర్జీల పరిష్కారంలో నాణ్యత లేదని తేలినట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినట్లు

ఆయన పేర్కొన్నారు.  à°…ర్జీ సమస్య ఒకటైతే వేరొక సమస్యలపై అప్ లోడ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు.  à°®à±à°–్యమంత్రి à°ˆ సమస్యను అదిగమించేందుకే రాష్ట్ర స్థాయి

ఉన్నతాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు స్వీకరించి వాటిలో ప్రజలకు నాణ్యమైనవో వాటిని గుర్తించి, స్పందన అర్జీల పరిష్కారంలో ప్రభుత్వం విధి,

విదానాలను రూపొందించిందని, వాటిని పాటించి స్పందన అర్జీలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించి ప్రజలకు మంచి సేవలు అందించాలని అధికారులను ఆయన కోరారు.
   

 à°ªà±à°°à°ªà°¾à°²à°• శాఖ కమిషనర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయకుమార్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలోని లోపాలను సరిదిద్దడం కోసమే à°ˆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు

పేర్కొన్నారు.  à°®à°‚à°¡à°² స్థాయిలో వివిధ సమస్యలపై అర్జీలు వస్తాయని, అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి స్పందనకు వస్తాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్య

పరిష్కారం జరిగితే పరిష్కరించాలని, పరిష్కారం జరుగపోతే నాణ్యమైన సమాధానం అర్జీదారునికి చెప్పాలని వివరించారు. నవ్వుతూ అర్జీని స్వీకరించాలని, నాణ్యమైన

పరిష్కారం చూపాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో ఉద్యోగుల నిబద్దత లోపించడవం వల్లే ప్రజలు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అత్యంత

ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన స్పందన కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, స్పందన అర్జీల పరిష్కారంతో నాణ్యతను చూపాలన్నారు. ఈ

సదస్సు అనంతరం కూడా అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పురాకుంటే తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. స్పందన అర్జీల పరిష్కారంపై ఆయన

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో క్షుణ్ణంగా వివరించారు. 
     à°ªà±Œà°° సరఫరాల శాఖ డైరెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రేషన్ కార్డులకు సంబందించిన అర్జీలపైన, సెర్ప్ సి.à°‡.à°“.

పి. రాజ బాబు పించన్ల అర్జీలపైన, రెవిన్యూ శాఖ అధికారి వెట్రిసెల్వి భూ సంబంధమైన అర్జీలపైన, పోలీస్ అధికారి శాంతి, భద్రతల సమస్యల అర్జీల పరిష్కారానికి

అనుసరించాల్సిన విధి, విధానాలను పవ్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
     à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో  à°ªà±à°°à°¤à°¿à°·à±à°Ÿà°¾à°¤à±à°®à°•à°‚à°—à°¾

అమలు చేస్తున్న స్పందన కార్యక్రమానికి అదికారులు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని

స్పందన కార్యక్రమం జిల్లా, మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారని, నివేదికలు

తెప్పించుకొని వాటిపై సమీక్షిస్తున్నారని చెప్పారు. 
     à°¤à±‚ర్పు గోదావరి జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళికృష్ణ మాట్లాడుతూ అర్జీలు ఎన్ని పరిష్కరించారనేది ముఖ్యము

కాదని, à°Žà°‚à°¤ నాణ్యతతో అర్జీల సమస్యలు పరిష్కరించామనేది కావాలన్నారు.  à°…ర్జీ దారులు చాలా దూరం నుండి వస్తుంటారని, వారి సమస్యలు పరిష్కరించాల్సిన అవసర ఉందన్నారు.

 à°ªà±à°°à°¤à°¿ జిల్లా, మండల స్థాయి అధికారులు స్పందన కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని, ఇందులో ఏ ప్రాంతంలో మంచి పరిపాలన ఉన్నదో తెలుసుకొని రాష్ట్ర స్థాయిలో à°† విధానంను

అమలు చేయాలని చెప్పారు.  
     à°ˆ కార్యక్రమంలో నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వస్తున్న అర్జీలను

పరిష్కరిస్తున్నామన్నారు.  à°¨à°—రంలో ఎక్కువగా భూ సమస్యలపై వస్తున్నాయని, వాటిని సంబంధిత తహసిల్థార్ లకు పంపుతున్నామని చెప్పారు.  à°­à±‚ ఆక్రమణలకు సంబంధించి

ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  à°‡à°‚దులో భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను పెట్టుకుంటున్నట్లు వివరించారు. కొంత మంది

అధికారులు వారికి ఉన్న అనుమానాలను రాష్ట్ర స్థాయి అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.
        à°ˆ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, తూర్పు

గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, జివియంసి కమీషనర్ డా.జి. సృజన, పాడేరు ఐటిడిఎ పిఓ డికె బాలాజి, సబ్ కలెక్టర్ వెంకటేష్, డి.ఆర్.ఓ. ఎం. శ్రీదేవి, విశాఖపట్నం

ఆర్డిఓ పెంచల కిషోర్, తదితరులతో పాటు  à°µà°¿à°¶à°¾à°–పట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా అధికారులు, తహసిల్దార్లు, మండల అభివృద్థి అధికారులు, మున్సిపల్

కమిషనర్లు, డిఎస్పిలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam