DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుచానూరు ఆలయ  బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు - 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): . . .

    à°¤à°¿à°°à±à°šà°¾à°¨à±‚రు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 23

నుంచి డిసెంబరు 1వతేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పరిపాలనా భవనంలో à°—à°² సమావేశం మందిరంలో గురువారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. à°ˆ సంద‌ర్భంగా బ్ర‌హ్మోత్స‌వాల గోడ

à°ª‌త్రిక‌à°²‌ను ఆవిష్క‌రించారు.

     à°ˆ సందర్భంగా ఈవో మాట్లాడుతూ à°—‌à°¤ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల

శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ఆల‌à°¯ à°ª‌à°°à°¿à°¸‌రాల‌లో

చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను త్వ‌à°°à°¿à°¤ à°—‌తిన పూర్తి చేయాలన్నారు. à°¨‌వంబరు 30à°¨ రథోత్సవం సంద‌ర్భంగా à°®‌హా à°°‌థాన్ని

శుభ్ర‌à°ª‌à°°à°¿à°šà°¿, బ్రేక్‌లు, à°¤‌దిత‌à°° à°®‌à°°‌మ్మ‌త్తు à°ª‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజులైన

నవంబరు 27à°¨ గజవాహనం, à°¨‌వంబరు 28à°¨ బంగారు రథం, గరుడవాహనం, డిసెంబరు 1à°¨ పంచమితీర్థం నాడు రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్‌, పోలీస్‌, ట్రాఫిక్‌, విజిలెన్స్ అధికారులు à°¸‌à°®‌య్వ‌యంతో వాహ‌నాల పార్కింగ్‌కు à°—‌à°¤ ఏడాది కంటే à°…à°¦‌à°¨‌పు

పార్కింగ్ స్థ‌లాల‌ను ముంద‌స్తుగా గుర్తించి, ఏర్పాటు చేయాల‌న్నారు.  

       à°ªà°‚à°š‌మితీర్థం రోజున à°²‌క్ష‌లాదిగా విచ్చేసే భక్తులకు సరిపడా తాత్కాలిక,

మొబైల్‌ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని, à°…à°¦‌à°¨‌పు సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని ఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు

పంచమితీర్థం నాడు తోళప్ప గార్డెన్స్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. పంచ‌మితీర్థం రోజున à°­‌క్తుల‌కు ఉద‌యం అల్పాహారం,

à°®‌ధ్యాహ్నం అన్న‌ప్ర‌సాద ప్యాకెట్లు, వాట‌ర్ బాటిళ్ళు అందివ్వాల‌న్నారు. à°­‌క్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా  à°ªà±à°·à±à°•‌రిణి చేరుకునేందుకు రూట్‌మ్యాప్, అందుకు

à°…à°µ‌à°¸‌à°°‌మైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు. భక్తులకు వైద్యసేవలందించేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా

ఉంచుకోవాలన్నారు. టిటిడి నిఘా, భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమితీర్థం రోజున భక్తుల

రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సిసిటివిల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.

బ్ర‌హ్మోత్స‌వాలు à°œ‌రుగు 9 రోజుల పాటు  à°¸à°‚à°¦‌ర్భంగా తిరుచానూరు à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాల‌లో మాంసం, à°®‌ద్యం అమ్మ‌కాల‌ను నిషేధించాల‌ని పంచాయ‌తీ అధికారుల‌కు

సూచించారు. 

ఆలయం, పరిసర ప్రాంతాల‌తో పాటు తిరుప‌తి, అలిపిరి, ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో à°•‌టౌట్లు, విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్‌,

ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా కనులవిందుగా  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¾à°²à°¨à°¿ ఆదేశించారు.

శ్రీ à°ª‌ద్మావ‌తి అమ్మ‌వారి వాహ‌à°¨‌సేవ‌à°²‌ను ఎస్వీబిసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌న్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా

ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. 

       à°ˆ సమావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్‌, తిరుప‌తి అర్బ‌న్‌ ఎస్‌పి

à°¡à°¾.à°—‌జారావు భూపాల్‌,  à°¸à°¿à°‡ శ్రీరామ‌చంద్రారెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, అదనపు సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, పద్మావతి

అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam