DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వివాదాలకు అతీతంగా…గుంటూరు అర్బన్‌ ఎస్పీ

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) :గుంటూరు అర్బన్‌ ఎస్పీగా రెండేళ్లు బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో పాటు

సమర్ధత à°—à°² ఐపిఎస్‌ అధికారిగా పేరుతెచ్చుకున్న విజయరావు పనితీరును గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆయనను గుంటూరు గ్రామీణ ఎస్పీగా నియమించటం

జరిగిందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీగా విజయరావు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించాయి,

నిరసన కార్యక్రమాలు,. మతపరమైన సమావేశాల జరిగాయి. కానీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా బహిరంగ సభలలో ఎలాంటి అసాంఘిక శక్తులు చొరబడకుండా ముందు జాగ్రత్తలు

తీసుకుని అధికార,విపక్షనేతల మన్ననలు పొందారు.

గుంటూరు అర్బన్‌ పరిధిలో కింది స్థాయిలో పని చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి

సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తూ బదిలీలు, పోస్టింగ్‌లలో అలాంటి వారి విన్నపాలను మన్నిస్తూ నూతన ఒరవడిని సృష్టించారు విజయారావు. కింది స్థాయి

ఉద్యోగులను, అధికారులను ఏనాడు అకారణంగా ఇబ్బంది పెట్టలేదు. చిన్నపాటి తప్పులను భూతర్ధంలో చూడకుండా పిలిచి మందలించేవారు. కొంతమంది ఐపిఎస్‌ అధికారుల వలె

విజయారావు ఏనాడూ à°•à° à°¿à°¨ నిర్ణయాలు తీసుకోలేదు. ఆయన బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఎస్సైల బదిలీలు, పోస్టింగ్‌లలో ఎక్కడా అవినీతికి అవకాశం ఇవ్వలేదు. రాజకీయ నాయకులు

సిఫార్సులు చేసినా అందులో మంచి చెడును తెలుసుకుని నిర్ణయాలు తీసుకున్నారు. ఐపిఎస్‌ అధికారులలో మంచి వారు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో విజయారావు ఒకరు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam