DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశాంతంగా ఆర్మీ నియామక ప్రక్రియ  - కల్నల్ భూపేందర్ సింగ్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌):   à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚లో ఆర్మీ నియామక ప్రక్రియ ప్రశాంతంగా

జరుగుతుందని ఆర్మీ నియామక అధికారి (ఏ.ఆర్.ఓ) కల్నల్ భూపేందర్ సింగ్ అన్నారు. శుక్ర వారం ఆర్మీ నియామక ప్రక్రియను తనిఖీ చేసిన భూపేందర్ సింగ్ అభ్యర్ధులకు పలు

సూచనలు చేసారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, మద్యదళారీల చేతుల్లో మోసపోవద్దని ఆయన కోరారు. నియామక ప్రక్రియను ఒక బ్రిగేడియర్, నలుగురు కల్నల్ లు, 8

మంది ఆర్మీ వైద్య అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 150 మంది జవాన్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పారు. జిల్లా యంత్రాంగం మంచి సహాయ సహకారాలు

అందించిందని భూపేందర్ సింగ్ చెప్పారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ స్వయంగా పనులను పర్యవేక్షించడంతోపాటు అన్ని ఏర్పాట్లు ఎక్కడా లోపం లేకుండా చేసారని

ప్రశంసించారు. పోలీసు శాఖ సహాయ సహకారాలు కూడా బాగున్నాయని, పోలీసు అధికారులు, సిబ్బంది చక్కటి తోడ్పాటును అందిస్తున్నారని పేర్కొన్నారు. సెట్ శ్రీ సి.ఇ.ఓ

శ్రీనివాస రావు, క్రీడల చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్ ప్రక్రియలో పూర్తి భాగస్వామ్యమై ఏ సమస్యా లేకుండా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అభ్యర్ధులకు నిర్వహించే

పరీక్షలకు ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రన్నింగు ట్రాక్ ను అధికారులు ఎప్పటికప్పుడు రోలింగు చేయిస్తూ నీటితో తడుపుతున్నారని

తెలిపారు. అగ్నిమాపక శాఖ, వైద్యఆరోగ్య శాఖ శిబిరాలను ఏర్పాటు చేసి తమ వంతు సహకారానికి సంసిద్దంగా ఉన్నాయని చెప్పారు. మొదటి రోజున 4,500 మంది, రెండవ రోజున 4,900 మంది

అభ్యర్ధులు ఎంపిక పరీక్షలకు హాజరు అయ్యారని ఏ.ఆర్.ఓ తెలిపారు. అభ్యర్ధులు ఏ రోజున ఎన్ని గంటలకు హాజరు కావలసినది అన్ని వివరాలు కాల్ లెటర్ లో సూచించామని అందుకు

అనుగుణంగా అభ్యర్ధులు వస్తున్నారని చెప్పారు. అభ్యర్ధుల బయోమెట్రిక్ తో సహా శారీరక సామర్ధ్యాలను పరీక్షించి వాటిలో ఉత్తీర్ణులైనవారిని మెడికల్ పరీక్షలకు

పంపిస్తున్నామని ఆయన తెలిపారు. ఏడు జిల్లాల నుండి అభ్యర్ధులు వారికి సూచించిన తేదీల మేరకు హాజరు అవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ప్రక్రియ ప్రశాంతంగా,

సజావుగా జరుగుతోందని పేర్కొన్నారు. 17వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam