DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల పోటు లో అనాచారం . . . చొక్కాలు, ఫాంట్ లతో ప్రవేశమా 

వైష్ణవులకు మాత్రమే ప్రవేశం ఉన్న వంట శాల లోకి అన్యకులు ఎలా వెళ్తారు ?

రమణ దీక్షితుల ఆరోపణలు వాస్తవాలేనా ..

తిరుమల, జూన్  10, 2018 (DNS Online)  :  à°¤à°¿à°°à±à°®à°² ఆగమ సంప్రదాయం

ప్రకారం స్వామీ వారికి పెట్టె నైవేద్యం తయారు చేసే వంట గదిని పోటు అంటారు. అక్కడ వంట చేసే వారు శ్రీ వైష్ణవులై  à°‰à°‚డాలి, ఉపనయనం అయి ఉండాలి, సమాశ్రయణం అయి ఉండాలి.

వీరు తప్పని సరిగా ఆగమ నియమ నిబంధనలు పాటించవలసిందే. ఇక్కడ వినియోగించే ప్రతీ సామాగ్రి ఇతర వంటలకు వాడరాదు. ఇది తొలినాళ్ళ నుంచీ వస్తున్నా సంప్రదాయం. తిరుమల

కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ ఇదే విధమైన సంప్రదాయాన్ని అనుసరించడం జరుగుతుంది. ప్రస్తుతం తిరుమల ఆలయం లో తయారు చేసే అన్ని తరహాల ప్రసాదాలనూ ఇక్కడే

తయారు చెయ్యడం జరుగుతుంది. ఇక్కడ తయారయ్యే ప్రతీ వంటకం స్వామీ వారికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఆలయం బయటకు చేరి, భక్తులకు వితరణ జరుగుతుంది. 

ఇటీవల తిరుమల

పోటు లో శ్రీ వారి లడ్డు ప్రసాదం తయారుచేస్తున్న వీడియో లు విడుదలయ్యాయి. వీటిని ఒక టెలివిజన్ ఛానెల్ / వెబ్ మీడియా లో ప్రసారం చేసింది. ఆలయ ఆగమ నియమాల ప్రకారం పోటు

లో వంట చేసేవారు కేవలం పంచె మాత్రమే ధరించాలి. అయితే ఈ వీడియో లో కనిపించిన దృశ్యాల్లో లడ్డు ప్రసాదం చెయ్యడానికి ముందు శనగపిండి కలిపే వ్యక్తి చొక్కా వేసుకునే

కలుపుతున్నారు, ఆపై బూందీ వేయించే వారికి సహాయకులుగా ఉన్నవారుఐకిమెడలో కనీసం యజ్ఞోపవీతం కూడా ధరించకపోవడం దర్శనమిచ్చింది. ఇక అత్యంత ప్రధానమైనది.. ప్రసాదం

తయారీ లో కేవలం పంచె మాత్రమే ధరించాలి. ఇక్కడ పని చేసే వారు కూడా చొక్కాలు ధరించినట్టయితే వారికి కూడా ప్రవేశం నిషేధమే. అలాంటిది కొందరు వ్యక్తులు ( వాళ్ళు

పర్యవేక్షకులైనా కావచ్చు, లేదా ట్రస్ట్ బోర్డు సభ్యులైనా అయి ఉండవచ్చు) చొక్కా, ఫాంట్ లతో పోటు లోనే ఉండి లడ్డు తయారీలను పరిశీలిస్తున్నారు.  

వంట శాలలోకి

ఎవరు పడితే వారు వెళ్ళడానికి అర్హులు కారు. కేవలం శీ వైష్ణవ సంప్రదాయ పరులు మాత్రమే వెళ్ళాలి అనే నిబంధన ఉంది. అలాంటిది తిరుమల శ్రీవారి వంటశాల లోకి ఎవరు పడితే

వాళ్ళు వెళ్తున్నారు.ఈ విధానమైన వీడియో దృశ్యాల ఆధారాల ప్రకారం తిరుమల పోటు లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్లవచ్చని తెలుస్తోంది. తిరుమల లో ఆగమ విరుద్దంగానే

కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణ వాస్తవం à°—à°¾ తేలుతోంది. ఇక మిగిలిన ఆరోపణలు కూడా నిజాలుగానే తేలే అవకాశం ఉంది. 

 

 

pix: courtesy to whom so

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam