DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చారిత్రాత్మక తీర్పు వెనుక చరిత్రకారులెందరో . . .

పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్  à°•à±‡à°•à±‡ మహమ్మద్ పాత్ర కీలకం 

బెదిరింపులు వచ్చినా.. నిజాయితీగా నిలబడ్డారు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం,

నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : కోట్లాది మంది హిందువు సంప్రదాయ వాదులు, హిందూ సంప్రదాయ అభిమానులు అందరూ ఎన్నో ఏళ్ళ నుంచే ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణ ఘట్టం పై

అత్యద్భుతమైన తీర్పు కు ఆధారమైన సాక్ష్యాలు సాధించినవారెందరో చరిత్రకారులున్నారు. వారిలో కీలక పాత్రధారి పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ కేకే మహమ్మద్. కేరళకు

చెందిన ఈయన అయోధ్య లోని వివాదాస్పదం గా భావించబడుతున్న రామజన్మ భూమి ప్రాంతంలో అలహాబాద్ కోర్టు ఆదేశం మేరకు పరిశోధనలు చేపట్టిన బృందంలో సభ్యునిగా ఉన్నారు.

నాటి కమిటీ à°•à°¿ 
చీఫ్ గా ఉన్న బిబి లాల్ బృందంలో ముహమ్మద్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు పరిశోధనల్లో పాల్గొన్నారు. 1976 -77 లో చేపట్టిన ఈ పరిశోధనల్లో రామజన్మ భూమి

ప్రాంతంలో పునాదుల్లో రామాలయ సంబంధిత ఆధారాలు లభించినట్టు ముహమ్మద్ బహిరంగంగానే ప్రకటించారు. కొన్ని వర్గాల నుంచి ఈయనకు బెదిరింపులు వచ్చినా బెదరక, తానూ

నమ్ముకున్న నిజాయితీకి పట్టం కడుతూ నాటి పరిశోధనలను పుస్తకరూపం కల్పించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు సహా ఇచ్చిన తీర్పుకు వీరి బృందం నాడు జరిపిన పరిశోధనలు

కూడా సాక్ష్య ఆధారాలుగా పరిగణన లోకి తీసుకోవడం జరిగింది. 

ఈ బృందం చేపట్టిన పరిశోధనలు :

అలహాబాద్ కోర్టు ఆదేశం ప్రకారం భారత పురావస్తు శాఖా అధికారుల

బృందం అధికారికంగా మొదటి సారి 1976 -77 లో పరిశోధన జరిగింది. తర్వాత 2003 లో మరొకసారి జరిగింది. లభించిన ఆధారాలను 2003 లో కోర్టుకు సమర్పించడం జరిగింది. ప్రక్కనే ఉన్న మసీకు

ఎటువంటి ముప్పు రాకుండా ఉండే విధంగా రామజన్మ భూమి స్థానం లో గ్రౌండ్ పేనే ట్రెటింగ్  à°°à°¾à°¡à°¾à°°à± ( జి pi ఆర్) సర్వే ద్వారా ఆధారాలను సేకరించారు. à°ˆ పరిశోధన 2003 మార్చి 12 నుంచి,

 à°†à°—స్టు 7 , 2003 వరకూ నిర్వహించారు. à°ˆ శోధన టోజో డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో జరిగింది.  

పరిశోధన లో కనుగొన్న ఆధారాలు : 

క్రీస్తు పూర్వం 13 వ

శతాబ్దం కు చెందిన కొన్ని శిధిలాలు లభించాయి. వీటితో పాటు కుషాణులు, శుంగ à°² రాజరిక పాలన కు చెందిన ఆధారాలు కూడా లభించాయి. 

15 x 15 మీటర్ల విస్తీర్ణం కల్గిన పలకలు

లభించాయి. వీటిపై విలువ కల్గిన వస్తువులు ఏమైనా పెట్టి ఉండవచ్చు అని నివేదిక లో తెలిపింది.  

క్రీస్తు శకం 7 , క్రీస్తు శకం 10 వ శతాబ్ద కాలానికి చెందిన

 à°µà±ƒà°¤à±à°¤à°¾à°•à°¾à°° గోపురం లభించింది. ఉత్తర - దక్షిణ ముఖాదికంగా ఉండే 50 మీటర్ల విస్తీర్ణం కల్గిన భవన కట్టడం లభించింది. బహుశా క్రీస్తు శకం11 -12 శతాబ్ద కాలానికి చెందినది

అయి ఉండవచ్చు. తదుపరి మూడు విడతలుగా జరిపిన తనిఖీల్లో మరో పెద్ద భావన శిధిలాలు లభించాయి.      

16 వ శతాబ్దం లో ఈ రామ జన్మభూమి ఆలయం పై వివాదాస్పద మసీదు కట్టడం

నిర్మించినట్టు తెలిపింది. 

వివాదాస్పద మసీదు కట్టడం క్రింద 50 స్తంభాలను ఉన్నట్టు పరిశోధన నివేదిక లో తెలిపింది.  à°•à°¨à±à°—ొంది. 

ఇతర కాలాలకు చెందిన

కొన్ని నిర్మాణాలు కూడా లభించాయి, బహుశా అవి బుద్ధా, జైన్ సంప్రదాయాలకు చెందినవి కావచ్చు. 

ఈ పరిశోధనల్లో ఎన్నో ఆసక్తికర అంశాలను పురావస్తు శాఖా నివేదిక

రూపంలో కోర్టుకు సమర్పించింది. à°† ఆధారాలను కూడా తుది తీర్పు లో పరిశీలనకు తీసుకోవడం జరిగింది. 

ఈ పరిశోధనా బృందంలో సభ్యునిగా ఉన్న కేకే ముహమ్మద్

నిష్పక్షపాతంగా ఈ ప్రాంతంలో శ్రీ రామ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చే మసీదు, తదితర కట్టడాలు కట్టడం జరిగిందని ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటనపై అయన కు కొందరు

హెచ్చరికలు కూడా చేసినట్టు తెలుస్తోంది. వృత్తి పట్ల ఇంత నిబద్దత, నిజాయితీ ఉన్న అధికారులు ఉన్నారు కనుకనే ఆలస్యం అయినా సుప్రీం కోర్టు అందరూ సమ్మతించి తీర్పు

ను ప్రకటించగలిగింది.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam