DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు భాషకు బ్రాండ్ అంబాసిడర్ చేసే పని ఇదేనా. . .

భాషను ఉద్దరించలేక పొతే అధ్యక్షున్ని ఊడపీకండి   

అవకాశవాదానికి ప్రత్యక్ష నిదర్శనం యార్లగడ్డ. . . 

అధికార భాషే లేనప్పుడు అధ్యక్షుడు కూడా ఎందుకు

నాడు ప్రతిఘటించి - నేడు వత్తాసు పలుకుతూ . .

అక్షర బోర్డు తిరగేసిన తెలుగు భాష సంఘం అధ్యక్షుడు 

యార్లగడ్డ కు చిత్తశుద్ధి లేదు-  à°®à°‚డిపడ్డ తెలుగు

దండు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలుగుభాషకు తానే బ్రాండ్ అంబాసిడర్ అని విస్తృత ప్రచారం చేసుకునే అధికార భాష సంఘం

అధ్యక్షుడు యార్లగడ్డ వైఖరి యావత్ తెలుగు భాషాభిమానులు విస్మయానికి గురిచేసిందని తెలుగు దండు ప్రచారకర్త పరవస్తు ఫణిశయన సూరి ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాధమిక స్థాయి విద్యలో నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం పై అయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°­à°¾à°·à°¾

ప్రాతిపదికన భారత దేశంలోనే  à°à°°à±à°ªà°¾à°Ÿà±ˆà°¨ మొట్టమొదటి రాష్ట్రం తెలుగు ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ అని, అలాంటి రాష్ట్రంలోనే నేడు తెలుగు ను భూస్థాపితం చేస్తున్నారని అని

అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాధమిక స్థాయి నుంచి అన్ని పాఠశాలల్లోనూ తెలుగు ను రద్దు చేస్తూ, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంపై,

విభేదించవలసిన అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తన పదవి కోసం వెంపర్లాడుతూ భాషను పాతిపెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని

మండిపడ్డారు. తెలుగు రాష్ట్రం ఏర్పడిన విధానాన్ని ముఖ్యమంత్రి కి వివరించి, తెలుగు భాషను రాష్ట్రంలో ప్రచారం కల్పించవలసిన అధికార భాష సంఘం అధ్యక్షుడు తన

భాద్యతలను పూర్తి గా విస్మరించి అధికార కుర్చీ కోసం వెంపర్లాడుతున్నడన్నారు. తక్షణం అతను తన పదవికి రాజీనామా చేసి తెలుగు భాష వ్యాప్తికి కృషి చెయ్యాలని

పిలుపునిచ్చారు. 

గతంలో తెలుగు దండు తెలుగుభాష వ్యాప్తికి నిరాహార దీక్ష చేసిన నాడు ఇదే యార్లగడ్డ శిబిరానికి వచ్చి కచ్చితంగా ప్రాధమిక విద్య నుంచి తెలుగు

తప్పని సరి చెయ్యాలని డిమాండ్ చెయ్యడంతో పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఈ అంశంపై పూర్తిగా తూర్పారబట్టారన్నారు. అయితే ప్రభుత్వం మారగానే పదవికోసం వైఎస్

జగన్ మోహన్ రెడ్డి వెంటపడి, పదవి కోసం ప్లేట్ ఫిరాయించేశారన్నారు. పైగా నేడు ఇదే మనిషి రాష్ట్ర వ్యాప్తంగా ఆంగ్ల భాష ఉండాలంటూ లెక్చర్లు దంచుతున్నారని

మండిపడ్డారు. 

తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రాధమిక విద్య నుంచి తప్పని సరిగా తెలుగు భాషలోనే జరగాలని, దీనికి బాధ్యత వహించాల్సింది అధికార

భాషా సంఘమేనని, దాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతే తక్షణం యార్లగడ్డ తన పదవికి రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేసారు. 

ఇతనికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదు : ..

వారం రోజుల్లోగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్బంధ ఆంగ్ల బాషా విధానం వెనక్కి తీసుకోకుంటే యార్లగడ్డ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

ఇప్పడికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను తప్పుదారి పెట్టించాడని, భాష ప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన ఈ రాష్ట్రంలోనే ఆ భాషకు విలువ లేకుండా చేశారంటే, దానికి

భాద్యత పూర్తిగా అధికార భాష సంఘం అధ్యక్షునిదే అన్నారు. 

అధికార భాషే లేక పొతే అధ్యక్షుడు ఎందుకు?: . . .

రాష్ట్రంలో ప్రాధమిక దశ నుంచే భాష వ్యాప్తి

జరుగుతుందని, అలాంటిది నేటి ప్రభుత్వం ప్రాధమిక దశ నుంచే అధికార తెలుగు భాషను రద్దు చేస్తోందన్నారు. అధికార భాషే లేకపోతె ఇక అధికార భాషకు ఒక సంఘం ఎందుకు?

 à°¦à°¾à°¨à°¿à°•à°¿ à°’à°• అధ్యక్షుడు ఎందుకు అని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాకు అదనపు భారం తప్ప..

ఇక తెలుగు అకాడెమీ సంగతి సరే సరి. అది కూడా ఇదే తరహాగా మారిపోయిందన్నారు.

ప్రాధమిక స్థాయిలోనే తెలుగు భాష కనుమరుగైపోతే . . .ఉన్నత విద్య లో ఏమి కనపడుతుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam