DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరమ్మతుల కోసం తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత 

నెలరోజుల పాటు తాళాలు, డిసెంబర్ 6 à°¨  à°ªà±à°¨: ప్రారంభం 

à°ˆ కాలంలో భక్తులు స్నాన గదులనే వినియోగించాలి: à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ) : . .

.

తిరుపతి, నవంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌): అత్యంత ప్రాశస్త్యం కల్గిన తిరుమల శ్రీవారి పుష్కరిణి లో మరమ్మత్తులు జరుగుతున్నందున మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి

దేవస్థానముల అధికారులు తెలియచేసారు. ఈ కారణంతో ప్రస్తుతం శ్రీవారి పుష్కరిణికి అన్ని వైపులా ఉన్న గేట్లకు అధికారులు తాళాలు వేశారు. ప్రతి ఏటా వార్షిక

బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని మార్చడం ఆనవాయితీ.  à°…యితే, à°ˆ ఏడాది నీటి ఎద్దడి కారణంగా పుష్కరిణి శుభ్రత పనులను వాయిదా

వేశారు.  à°¤à°¾à°œà°¾à°—à°¾, à°ˆ ప్రక్రియను టీటీడీ అధికారులు ప్రారంభించారు. నిల్వ ఉన్న మురుగునీటిని పైపుల ద్వారా నీటిశుద్ధి కేంద్రాలకు తరలించారు. నెల రోజులపాటు పుష్కరిణి

శుద్ధి పనులు కొనసాగనున్నాయి. పుష్కరిణి అడుగుభాగం, మెట్లను పూర్తిగా శుభ్రం చేస్తారు.  à°ªà°¾à°šà°¿, చెత్తాచెదారాన్ని తొలగించి రంగులు వేస్తారు. అనంతరం 23 లక్షల

గ్యాలెన్ల నీటితో పుష్కరిణిని నింపుతారు. à°ˆ పనులన్నీ పూర్తయిన అనంతరం వచ్చే నెల 6à°¨  à°ªà±à°·à±à°•à°°à°¿à°£à°¿à°¨à°¿ పునఃప్రారంభిస్తారు.  à°ˆ పనుల కారణంగా సాయంత్రం ఊరేగింపు సమయంలో

ఉత్సవర్లకు సమర్పించే పుష్కరిణి హారతిని కూడా రద్దు చేశారు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యే వరకు భక్తులు స్నానపు గదుల్లోనే స్నానమాచరించాల్సి ఉంటుందని

అధికారులు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam