DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్కూళ్లల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టడానికి దేశ భక్తే  కారణమా? 

స్కూళ్లల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టడానికి దేశ భక్తే  à°•à°¾à°°à°£à°®à°¾? 

వైఎస్ జగన్ కు చిత్తశుద్ధి ని శంకించవద్దు. 

పైకి చెప్పే కారణం వేరు - అంతర్గత అభిప్రాయం

వేరు కావచ్చు. .. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుధ్దిని

ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. అయన నిఖార్సైన దేశభక్తుడే. దానికి నిదర్శనమే ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని స్కూళ్లలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమం

పెట్టారు. దీనికి పైకి చెప్తున్న కారణం రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో అందరితో పోటీ పడాలి అని చెప్తున్నప్పటికీ అయన అంతర్గత కారణం ఇంకొంకటి

ఉన్నట్టు గాఅనిపిస్తోంది. 

అంతర్గత కారణం ఇది అయి ఉండవచ్చు : . . .  . 

ఆంగ్లేయులు 200 ఏళ్లకు పైగా భారత దేశం లో తిష్ట వేసి దేశ స్వాతంత్య్రాన్ని మన నుంచి

లాక్కున్నారు. పైగా బ్రిటిష్ వాడు భారత్ నేలపై అడుగు పెట్టింది మన భాషను సంస్కృతిని నాశనం చేసేందుకే. అందుకే మన విద్య వ్యవస్థ పై పడి వాళ్ళ ఇంగ్లిష్ మాధ్యమాన్ని

ప్రవేశ పెట్టాడు. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునేందుకా అన్నట్టు ఈయన తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశ పెడుతున్నారు అనే అభిప్రాయం

కొందరు అభిమానుల్లో ఉంది.   

ఇప్పుడు తెలుగు బాగా అలవాటు అయినా మన పాఠశాలల్లో ఇంగ్లిష్ భాషను మాధ్యమంగా ప్రవేశ పెడితే ఆ భాషను నానా రకాలుగా కూ. . .నీ . . చేసే

అవకాశం ఉంటుంది. ఎన్ని రకాలుగా à°† భాషను à°Žà°²à°¾ వాడకూడదో  à°…లా అన్ని రకాలుగానూ వాడే అవకాశం ముందుగా ఉంది.. ఇటు అధ్యాపకులూ ( తెలుగులోనే అక్షర దోషాలు ఇబ్బడి ముబ్బడిగా

పలికే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు), అటు విద్యార్థులు ( అసలు సరైన విధానం ఏంటో పూర్తిగా తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నవారు) ప్రతి ఆంగ్ల పదాన్ని తమకు తోచిన రకంగా

పలుకుతూ à°† భాషను కర్ణ కఠోరంగా తయారు చేస్తే . . . . ఊహించడం కష్టతరం. 

ఆంగ్లేయుడి మీద కోపం, వాళ్ళ భాష ద్వారా తీర్చుకోడానికా అన్నట్టుగానే ఈ జిఓ విడుదల చేశారేమో

అనే అభిప్రాయం కలుగుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam